Overeat Mangoes : మామిడి పండ్లు అతిగా తినొద్దు!

మామిడి పండ్లలో ఫ్రక్టోజ్ అధికంగా ఉంటుంది. కాబట్టి వీటిని ఎక్కువగా తీసుకుంటే శరీరంలో ఇన్సులిన్ లెవెల్స్ అమాంతం పెరిగిపోతాయి. డయాబిటిస్‌తో బాధపడుతున్నవారు మామిడి పండ్లకు దూరంగా ఉండటం మంచిది.

Overeat Mangoes : మామిడి పండ్లు అతిగా తినొద్దు!

Mango Eating

Overeat Mangoes : వేసవిలో లభించే పండ్లలో మామిడి ఒకటి. అందరూ ఇష్టంగా దీనిని తినేందుకు ఆసక్తి చూపిస్తారు. తీపి రుచి కలిగి రుచికరంగా ఉంటాయి. ఈ పండులో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఫోలేట్, బీటా కెరాటిన్, ఐరన్, విటమిన్లు A, C అలాగే కాల్షియం, జింక్, విటమిన్ E వంటి పోషకాలు ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అయితే మామిడి పండును తినటం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ అతిగా తినటం వల్ల కొన్ని రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. మామిడి కాయలు అతిగా తినటం వల్ల శరీరానికి అధిక వేడిని కలిగిస్తాయి. అధిక వేడి కారణంగా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అంతే కాకుండా జీర్ణ ప్రక్రియపై ప్రభావం ఉంటుంది.

మామిడి పండ్లలో ఫ్రక్టోజ్ అధికంగా ఉంటుంది. కాబట్టి వీటిని ఎక్కువగా తీసుకుంటే శరీరంలో ఇన్సులిన్ లెవెల్స్ అమాంతం పెరిగిపోతాయి. డయాబిటిస్‌తో బాధపడుతున్నవారు మామిడి పండ్లకు దూరంగా ఉండటం మంచిది. మామిడి పండ్లలో క్యాలరీలు అధికంగా ఉంటాయి. అధికంగా తినటం వల్ల బరువు పెరిగే అవకాశాలు ఉంటాయి. వ్యాయామాలు, కసరత్తులు చేసే వారిపై ఆ ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు. మామిడిపండ్లను అతిగా తింటే అలెర్జీలకు దారితేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మామిడిపండ్లు లాటెక్స్ అలెర్జీ ఉన్నవారికి హానికలిగిస్తాయి. మామిడిలోని ప్రొటీన్లు రబ్బరు పాలుతో సమానంగా ఉన్నందున సింథటిక్స్‌కు సున్నితంగా ఉంటే అలెర్జీ ఉన్నవారికి అసౌకర్యాన్ని కలిగిస్తాయి. కొంతమందిలో మామిడి పండ్లు ఎక్కువ మోతాదులో తినటం వల్ల ఉదర సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.

మామిడి పండ్లు త్వరగా మాగేందుకు కాల్షియం కార్బైడ్ అనే కెమికల్‌ను వాడి మగ్గబెడుతున్నారు. వీటిని అతిగా తినటం వల్ల ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. సరిగా పండని పండ్లు తినటం వల్ల జీర్ణ పరమైన సమస్యలు ఉత్పన్నం అవుతాయి. మామిడి పండ్లు తినటానికి అరగంట ముందుగా నీళ్లల్లో నానబెట్టుకోవాలి. దీని వల్ల చర్మసంబంధమైన సమస్యలు దరిచేరకుండా చూసుకోవచ్చు.