Diabetes : డయాబెటిస్ ఉన్నవారు ఎలాంటి నియమాలు పాటించాలో తెలుసా!..

ఔస్టేషనల్ మధుమేహం విషయానికి వస్తే సాధారణంగా హార్మోన్లలో హెచ్చుతగ్గుల వల్ల వస్తుంది. ముఖ్యంగా గర్భదారణ సమయంలో వచ్చి ప్రసంవ తరువాత తగ్గిపోతుంది. గర్భదారణ సమయంలో షుగర్ వ్యాధి వచ్చిన వ

Diabetes : డయాబెటిస్ ఉన్నవారు ఎలాంటి నియమాలు పాటించాలో తెలుసా!..

Shugar

Diabetes : రక్తంలో చక్కెర స్ధాయిలు అధికంగా ఉండం, అదికూడా అనియంత్రిత స్ధితిలో ఉండటాన్ని డయాబెటీస్ అని వ్యవహరిస్తారు. శరీరంలో ఇన్సులిన్ తగ్గటం వల్ల ఏర్పడే అసమానత తప్ప ఇది వ్యాధి కాదు. గ్లూకోజ్ స్ధాయిలను తెలుసుకోవటం ద్వారా మధుమేహం ఏస్టేజ్ లో ఉందో చెప్పవచ్చు. ఒక లీటరు రక్తంలో గ్లూకోజ్ 100 మిల్లీ గ్రాములు ఉండాలి. అంతకంటే ఎక్కువగా ఉంటే షుగర్ ఉన్నట్లు భావించాల్సి ఉంటుంది.

మధుమేహం అనేది మూడు రకాలుగా ఉంటుంది. టైప్ 1, టైప్ 2, ఔస్టేషనల్ గా పేర్కొంటారు. టైప్ 1కు సంబంధించి క్లోమ గ్రంధిలో బీటా కణాలు నశించి ఇన్సులిన్ ఉత్పత్తి కాకపోవటం వల్ల ఈరకం షుగర్ వ్యాధి వస్తుంది. దీనికి ప్రధాన కారణం జన్యుకారణాలు కావచ్చు. ఆకలి ఎక్కవగా ఉండటం, బరువు తగ్గిపోవటం, వాంతులు, వికారం, చిరాకు వంటి లక్షణాలు కనిపిస్తాయి. టైప్ 2 విషయానికి వస్తే శరీరం ఇన్సులిన్ ను ఉపయోగించుకోలేని స్ధితిలోకి చేరుతుంది. వయస్సు పైబడిన వారిలో ఇది ఎక్కువ కనిపిస్తుంది. ఉబకాయం, శారీరక శ్రమలేక పోవటం వల్ల వస్తుంది. ఈదశను గుర్తించాలంటే కాళ్ళ తిమ్మిర్లు, కాళ్ళ గాయాలు త్వరగా మానక పోవటం, చూపు మందగించటం, వెళ్ళు మొద్దుబారినట్లు అనిపించటం, చర్మం దురదలు వంటి లక్షణాలు కనిపిస్తాయి.

ఔస్టేషనల్ మధుమేహం విషయానికి వస్తే సాధారణంగా హార్మోన్లలో హెచ్చుతగ్గుల వల్ల వస్తుంది. ముఖ్యంగా గర్భదారణ సమయంలో వచ్చి ప్రసంవ తరువాత తగ్గిపోతుంది. గర్భదారణ సమయంలో షుగర్ వ్యాధి వచ్చిన వారికి ఆతరువాత కాలంలో టైప్ 2మధుమేహాంతో బాధపడేవారే ఎక్కువ మంది ఉంటారు.

మధుమేహాన్ని అదుపులో ఉంచుకునేందుకు కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి. బరువును తగ్గించుకోవాలి. ఇందుకోసం రోజు వారి వ్యాయామాలు క్రమం తప్పకుండా చేయాలి. ఆహార నియమాలను పాటించటంతోపాటు, మానసిక వత్తిడి, ఆందోళనను తగ్గించుకోవాలి. ఫాస్ట్ ఫుడ్స్ వంటి వాటిని తినకుండా ఉండటం మంచిది. మధుమేహం ఉన్న వారు దంపుడు బియ్యం, ముడిబియ్యం, ఆకుకూరలు, క్యారెట్ నేరేడు పండ్లు, కాకరకాయలు వంటి వాటిని తీసుకోవాలి.

ఖర్జూరం, ద్రాక్ష, సీతాఫలం, సపోటా, అరటిపండు, కిస్మిస్, బంగాళ దుంపలతో పాటు ఇతర ఫాస్ట్ ఫుడ్ పదార్ధాలను షుగర్ ఉన్న వాళ్ళు తినకపోవటమే ఉత్తమం. ఇలీవలికాలంలో చిన్న వయస్సు పిల్లల్లో డయాబెటిస్ కు గురవుతున్నారు. మధుమేహ వ్యాధిని నియంత్రించాలంటే ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవాలి. మంచి కూరగాయలు, ఆకు కూరలు రోజు వారి ఆహారంగా తీసుకోవాలి.