Fenugreek Seeds : వేసవికాలం జుట్టు నిర్జీవంగా మారుతుంటే మెంతులతో ఇలా చేసి చూడండి !
వెంట్రుకల చివర్లు చిట్లకుండా ఆరోగ్యంగా పెరిగేందుకు మెంతులు నానబెట్టిన నీటితో జుట్టు తడిపి, ఆ తర్వాత నానబెట్టిన మెంతిపిండిలో కాస్త పెరుగు చేర్చి తలకు ప్యాక్‌గా వేసుకోవాలి. వీటిల్లోని పొటాషియం జుట్టు ఆరోగ్యంగా పెరిగేలా చేస్తుంది.

Fenugreek Seeds : ప్రతి ఇంటి పోపుల పెట్టెలో మెంతులు లభిస్తాయి. మెంతి పొడిని ఊరగాయల్లోనూ, మెంతి గింజలను చారు, పులుసు, పోపులోనూ, దోశలలోనూ ఉపయోగిస్తారు. చేదుగా ఉండే ఈ గింజలు ఆహారానికి రుచిని తీసుకొస్తాయి. పురాతన కాలం నుండి భారతీయులు, ఆరోగ్య సంరక్షణ కోసమూ, మెంతులను తీసుకుంటూ ఉంటారు. మెంతులలోని పోషకాలు.. ఆరోగ్యానికే కాదు, జుట్టు సంక్షరణకూ మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. వీటిలోని ప్రొటీన్లు, నియాసిన్, అమైనో యాసిడ్స్, పొటాషియం,ఐరన్, మాంగనీస్, మెగ్నీషియం జుట్టు పెరుగుదలకు తోడ్పడతాయి.
మెంతులలోని పోషకాలు జుట్టు సమస్యలను దూరం చేస్తాయి, కేశాలు ఒత్తుగా, పొడుగ్గా పెరిగేలా తోడ్పడతాయి. వేసవికాలం జుట్టు నిర్జీవంగా మారుతుంది. జుట్టును పట్టుకుచ్చులా మెరిపించడానికి, మెంతులు సహాయపడతాయి. పావుకప్పు మెంతుల్ని నానబెట్టి మొలకలు వచ్చేలా చేయాలి. ఆపై ఆరబెట్టి పొడి చేసి దాన్ని కొబ్బరి నూనెలో మరగనివ్వాలి. ఈ నూనెను తలకు పట్టించి గంట తర్వాత స్నానం చేయండి. ఇలా చేస్తే మీ జుట్టు సిల్కీగా మారుతుంది.
READ ALSO : Fenugreek Seeds : వేసవికాలం జుట్టు నిర్జీవంగా మారుతుంటే మెంతులతో ఇలా చేసి చూడండి !
మెంతి గింజలలోని శ్లేష్మ ఫైబర్ ఉంటుంది, ఇది జుట్టుకు తేమ అందిస్తుంది. జుట్టు మృదువుగా, మెరిసేలా చేస్తుంది. మెంతి గింజల్లో అమైనో యాసిడ్స్, ప్రొటీన్లు మెండుగా ఉంటాయి. ఇవి జుట్టు ఆరోగ్యంగా పెరిగేలా ప్రోత్సహిస్తాయి.
వెంట్రుకల చివర్లు చిట్లకుండా ఆరోగ్యంగా పెరిగేందుకు మెంతులు నానబెట్టిన నీటితో జుట్టు తడిపి, ఆ తర్వాత నానబెట్టిన మెంతిపిండిలో కాస్త పెరుగు చేర్చి తలకు ప్యాక్‌గా వేసుకోవాలి. వీటిల్లోని పొటాషియం జుట్టు ఆరోగ్యంగా పెరిగేలా చేస్తుంది. కొందరిలో చిన్న వయస్సులోనే తెల్ల జుట్టు వస్తుంది. తెల్ల జుట్టును నివారించడానికి మెంతులు సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు.
READ ALSO : Porridge : చర్మాన్ని ఇన్ఫెక్షన్ల బారి నుండి కాపాడటంతోపాటు, జుట్టు రాలిపోయే సమస్యను నివారించే గంజి !
తెల్ల జుట్టుతో బాధపడుతుంటే.. కొన్ని కరివేపాకు ఆకుల్ని నీళ్లలో వేసి బాగా మరిగించాలి. రాత్రంతా నీళ్లలో నానబెట్టిన మెంతుల్ని.. కరివేపాకు నీళ్లు వేసి మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను తలకు, జుట్టుకు పట్టింటి.. అరగంట పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత మైల్డ్ షాంపుతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే తెల్ల జుట్టు కాస్త నలుపురంగులోకి మారుతుంది.
చుండ్రు సమస్యతో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారు మెంతులు, కాస్త వేపాకు, కరివేపాకు తీసుకుని పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను కొబ్బరి నూనెలో వేసి మరిగించండి. ఆ నూనె గోరువెచ్చగా ఉన్నప్పడు.. తలకు అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేసుకోవాలి. గంట తర్వత తలస్నానం చేయండి. ఇలా తరచుగా చేస్తే చుండ్రు సమస్య తగ్గుతుంది.
జుట్టు కుదుళ్లకు పోషణనిచ్చి.. బలంగా, ఒత్తుగా పెరిగేలంటే ఆముదం, కొబ్బరి నూనె సమపాళ్లలో తీసుకుని.. మెంతులు వేసి మరిగించాలి. ఇది చల్లారాక రెండు చుక్కల లావెండర్ నూనె కలిపి తలకు అప్లై చేసి.. సున్నితంగా మసాజ్ చేయండి. ఇలా చేస్తే తలలో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. అలాగే రాత్రి నానబెట్టిన మెంతుల్ని మెత్తగా చేసి దానిలో చెంచా చొప్పున కలబంద గుజ్జు, నిమ్మరసం వేసి పేస్ట్‌లా తయారు చేసుకోండి. దీన్ని తలకు పట్టించి, 20 నిమిషాల పాటు వదిలేయాలి. ఆ తర్వాత షాంపూతో తలస్నానం చేయండి. ఇలా చేస్తే.. జుట్టు మెరుపుదనం సంతరించుకుంటుంది.