Bald Head : తలపై నిత్యం టోపి పెడుతున్నారా?అయితే బట్టతల ఖాయం!

అయితే బట్టతల రావడానికి చెడు అలవాట్లు కూడా కారణం కావచ్చు. తలపై నిత్యం టోపీలను ధరించేవారిలో ఈ సమస్య కనిపిస్తుంది. టోపీని తరచూ ధరించడం వల్ల జుట్టుకు ఆక్సిజన్ సరఫరా జరగదు.

Bald Head : తలపై నిత్యం టోపి పెడుతున్నారా?అయితే బట్టతల ఖాయం!

Are Bald

Bald Head : తలపై జుట్టురాలటం అన్నది సాధారణం. అయితే చాలా మందిలో జుట్టు రాలిపోయి తిరిగి వస్తుంది. అయితే కొంద మందిలో వయస్సు ప్రభావంతో జుట్టు రాలిపోయి తిరిగి రాదు. ఒకప్పుడు వయసు పైబడిన వారిలోనే ఈ సమస్య కనిపించేది. అయితే ప్రస్తుతం యువకుల్లో సైతం బట్టతల సమస్య కనిపిస్తుంది. 35 సంవత్సరాల వయస్సులోనే బట్టతల వస్తోంది. బట్టతలగా మారబోయే ముందు కొన్ని సంకేతాలు గమనించవచ్చు. వెంట్రుకలు క్రమేణా సన్నబడుతుంటాయి. అంతేకాకుండా బలహీనంగా మారతాయి. జుట్టు ఉన్నట్టుండి ఊడిపోతుంది. తలపై పొలుసులతో కూడిన మచ్చలు వంటి లక్షణాలు కనిపిస్తాయి.

బట్టతలకు జన్యుపరమైన కారణాలతోపాటు వయస్సు పెరుగుదల కావచ్చు. హార్మోన్ల అసమతుల్యత సైతం దీనికి కారణమౌతుంది. గర్భదారణ, మోనోపాజ్, థైరాయిడ్ , చర్మ వ్యాధులు జుట్టుకు నష్టం కలుగుజేస్తాయి. దీని వల్ల బట్టతల వస్తుంది. వివిధ అనారోగ్య సమస్యలకు వాడుకునే మందుల ప్రభావం వల్ల కూడా బట్టతల వచ్చే అవకాశం ఉంటుంది. ఒత్తిడి, రేడియేషన్ ప్రభావం, పోషకాహార లోపం కూడా ఇందుకు కారణం కావచ్చు.

అయితే బట్టతల రావడానికి చెడు అలవాట్లు కూడా కారణం కావచ్చు. తలపై నిత్యం టోపీలను ధరించేవారిలో ఈ సమస్య కనిపిస్తుంది. టోపీని తరచూ ధరించడం వల్ల జుట్టుకు ఆక్సిజన్ సరఫరా జరగదు. దీని వల్ల జుట్టు యొక్క మూలాలు దెబ్బతింటాయి. జుట్టు ఊడిపోవటం ప్రారంభమై చివరకు బట్టతలకు దారితీస్తుంది. జుట్టు తడిగా ఉన్నప్పుడు టవల్‌తో గట్టిగా రుద్దేయడం, దువ్వడం వంటివి చేయటం మంచిది కాదు. ఇలా చేస్తే జుట్టు రాలుతుంది. ఫలితంగా బట్టతల ఏర్పడుతుంది. హెయిర్ స్టైలింగ్ కోసం ఉపయోగించే రసాయనాల వల్ల జుట్టు రాలిపోయి బట్టతల వస్తుంది. రోజు షాంపుతో తలస్నానం చేసే వారేలో సమస్య అధికంగా ఉంటుంది. వారానికి ఒకటి రెండు సార్లు మినహా ఎక్కువ సార్లు షాంపులను ఉపయోగించి స్నానం చేయటం మంచిది కాదు.