Sugar : పంచదార ఎక్కువగా తింటున్నారా… అయితే జాగ్రత్త..

అధిక చక్కెర తీసుకోవటం వల్ల మెదడులో డోపమైన్ అధికంగా విడుదలవుతుంది. చక్కెరలో ఉండే ప్రక్టోజ్ కాలేయంపై తీవ్రమైన వత్తిడిని కలుగజేస్తుంది.

Sugar : పంచదార ఎక్కువగా తింటున్నారా… అయితే జాగ్రత్త..

Shugar

Sugar : పంచదారంటే ఇష్టపడని వారుండరు. నోటికి తియ్యదనంతో కూడిన రుచినిచ్చే తెల్లని చక్కరను మనం నిత్యం వివిధ రూపాల్లో తీసుకుటుంటాం. పంచదారతో కూడిన డ్రింక్స్, టీలు, కాఫీలు, స్వీట్లు, బిస్కెట్లు ఇలా అనేక రకాల పదార్ధాల్లో దీనిని విరివిగా వినియోగిస్తారు. పంచదార ఎక్కువగా తింటే క్యాన్సర్ వస్తుందని తాజా పరిశోధనలో తేలింది. 1950 వ సంవత్సరంలో జన్మించిన వాళ్ళ కంటే కూడా 1990 లో జన్మించిన వాళ్ళల్లో అధికంగా పెద్దపేగు క్యాన్సర్ ఉన్నట్లు స్పష్టమైంది. అధ్యయనంలో భాగంగా 94వేల మందిపై రీసెర్చ్ చేయగా వారిలో సాఫ్ట్ డ్రింక్స్, స్పోర్ట్స్ డ్రింక్స్ తియ్యగా ఉండే టీలు తీసుకునే వారిలో ఇలాంటి క్యాన్సర్ ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు.

పంచదార వినియోగం వల్ల స్ధూలకాయం, డయాబెటిస్, తోపాటు ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. దీని ప్రభావం కాలేయంపై తీవ్రంగా ఉంటుంది. యూరిక్ యాసిడ్ ల స్ధాయి పెరిగి జీవక్రియలు దెబ్బతింటాయి. తెల్లని చక్కెరను తినటం కంటే సహజసిద్ధమైన తియ్యదనంతో కూడిన పండ్లు తినటం మేలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఆపిల్ జ్యూస్, ఆరెంజ్ జ్యూస్ ఇంకా ద్రాక్ష జ్యూస్ మొదలైనవి గమనించడం జరిగింది. అయితే ఈ రీసెర్చ్ ద్వారా తెలిసింది ఏమిటంటే..అధికశాతం మందిలో షుగర్ డ్రింక్స్ వలన ఇబ్బంది ఉన్నట్లు గుర్తించడం జరిగింది. షుగర్ కొద్దిగా తీసుకున్న వాళ్ళ కంటే ఎక్కువగా తాగిన వాళ్ళలో ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉన్నట్లు కూడా తెలిసింది.

అధిక చక్కెర తీసుకోవటం వల్ల మెదడులో డోపమైన్ అధికంగా విడుదలవుతుంది. చక్కెరలో ఉండే ప్రక్టోజ్ కాలేయంపై తీవ్రమైన వత్తిడిని కలుగజేస్తుంది. చాలా సందర్భాల్లో దీని వల్ల ఫ్యాటీ లివర్ బారిన పడే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. నిజానికి చక్కెరలో ఎలాంటి పోషకాలు లభించవు. చక్కెర తింటే పోషకాలు లేని క్యాలరీలను శరీరానికి అందించినట్లే అవుతుంది.

పంచదార కలిపిన డ్రింక్స్ కారణంగా కోలోరెక్టల్ క్యాన్సర్ వస్తుందని ఇటువంటి వాటికి దూరంగా ఉండటం మంచిదని డాక్టర్లు సూచిస్తున్నారు. మెటబాలిక్ సమస్యలు, ఇన్సులిన్ సమస్యలు, కొలెస్ట్రాల్ సమస్యలు ఇంకా ఇంఫ్లేమేషన్ సమస్యలు వస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. శుద్ధి చేయబడిన కృత్రిమ చక్కెరలను తక్కువ పరిమాణంలోనే తీసుకోవటం మంచిది.