Papaya : బొప్పాయి తింటున్నారా?..ప్రయోజనాలతోపాటు..

ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటో కెమికల్స్ హృదయ సంబంధిత సమస్యలు రాకుండా సహాయపడతాయి. ఇందులో ఉండే పీచు పదార్థం ప్రేగుల్లో ఉండే విషాన్ని గ్రహించగలదు. రోజు బొప్పాయి తీసుకున్న వారిలో కంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి.

Papaya : బొప్పాయి తింటున్నారా?..ప్రయోజనాలతోపాటు..

Papaya

Papaya : ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పండ్లలో బొప్పాయి ఒకటి. ఈ పండులో శరీరానికి కావాల్సిన విటమిన్లు అన్నీ లభ్యమవుతాయి. వైద్య నిపుణులు ప్రతిరోజూ బొప్పాయి పండు తింటే ఎంతో మంచిదని తెలుపుతున్నారు. జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడం, రోగనిరోధకశక్తిని పెంపొందించడంతో పాటు చర్మానికి అలాగే శిరోజాలకు పోషణని అందించేందుకు బొప్పాయి ప్రముఖ పాత్రను పోషిస్తుంది.

ఎవరైనా ఉదయం సమయంలో వివిధ కారణాల వల్ల అల్పాహారం తినడం సాధ్యం కాకపోతే బొప్పాయి పండు తింటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఏ, బీ, సీ, డీ విటమిన్లు తగిన మోతాదులో ఉండే ఈ పండులో పెప్సిన్ అనే పదార్థం ఉంటుంది. ఈ పెప్సిన్ పదార్థం వల్ల జీర్ణక్రియ ప్రక్రియ సాఫీగా జరుగుతుంది. ఫ్రూట్ ఆఫ్ ఏంజెల్స్ అని పిలిచే ఈ పండును అనేక రకాల ఆరోగ్య రుగ్మతల కోసం వినియోగిస్తారు.

బొప్పాయిలో ఫైబర్ సమృద్ధిగా లభిస్తుంది. విటమిన్ ఏ, బయో ఫ్లేవనాయిడ్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ లభిస్తాయి. బొప్పాయిలో లభ్యమయ్యే షుగర్ ను సులభంగా శరీరం గ్రహిస్తుంది. తద్వారా శరీరానికి తక్షణ శక్తి అందుతుంది.బొప్పాయిలో పపైన్ మరియు కైమోపపైన్ అనే ఎంజైమ్స్ కలవు. ఇవి యాంటీ ఇంఫ్లేమేటరీ ఎఫెక్ట్స్ కలిగి ఉంటాయి. అలాగే, ఇవి దీర్ఘకాల వ్యాధుల బారిన పడే ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఈ ఎంజైమ్స్ అనేవి ర్యుమటాయిడ్ ఆర్తరైటిస్, ఎడెమా వంటి ఇతర ఇంఫ్లేమేషన్స్ ను తగ్గించేందుకు తోడ్పడతాయి.

ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటో కెమికల్స్ హృదయ సంబంధిత సమస్యలు రాకుండా సహాయపడతాయి. ఇందులో ఉండే పీచు పదార్థం ప్రేగుల్లో ఉండే విషాన్ని గ్రహించగలదు. రోజు బొప్పాయి తీసుకున్న వారిలో కంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఇందులో ఉండే విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. బొప్పాయి చర్మం ముడతలు పడకుండా చేయడంతో పాటు మేను రంగు కూడా మెరుగుపడేలా చేస్తుంది. బరువును, ఆకలిని తగ్గించడంలో బొప్పాయి తోడ్పడుతుంది. కీళ్లనొప్పులను తగ్గించడంతో పాటు క్యాన్సర్ బారిన పడే అవకాశాలను బొప్పాయి తగ్గిస్తుంది.

శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నవారు ఈ పండుని తీసుకోవద్దని నిపుణులు చెబుతున్నారు. అలాంటి వారు ఈ పండు తినడం వల్ల ఎలర్జీ వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. బొప్పాయిలోని పొపైన్ అనే మూలకమే ఇందుకు కారణం. అందుకే ఆ సమస్యలతో బాధపడేవారు బొప్పాయికి దూరంగా ఉంటే మంచిదని చెబుతున్నారు. జ్వరాలకు బొప్పాయి ఆకులను మందుగా వాడతారు. వీటిని తీసుకోవడం వల్ల రక్తంలో ప్లేట్‌లెట్స్ సంఖ్య పెరుగుతుంది. అయితే, హై ఫీవర్ ఉన్నప్పుడు మాత్రం బొప్పాయి పండుని తినొద్దని చెబుతున్నారు నిపుణులు.

బొప్పాయిని తినడం వల్ల అనేక సమస్యలు ఎదుర్కొంటారని చెబుతున్నారు. వీటిని తినడం వల్ల వీర్యకణాల సంఖ్య తగ్గుతుందని కొన్ని పరిశోధనల్లో గుర్తించినట్లు పరిశోధకులు చెబుతున్నారు. కాబట్టి మితంగా తీసుకోవాలని చెబుతున్నారు. .గర్భంతో ఉన్నవారు ఈ పండుని తీసుకుంటే అనర్థాలు జరుగుతాయి. కడుపుతో ఉన్న సమయంలో ఈ పండు తీసుకుంటే తల్లితో పాటు పుట్టబోయే బిడ్డపై ప్రభావం పడుతుంది. గర్భస్రావం అయ్యే అవకాశాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు.