Eat During Periods : పీరిడ్స్ సమయంలో తినాల్సిన, తినకూడని ఆహారాల గురించి తెలుసా?

పీరియడ్స్ సమయంలో ఆకుకూరలు ఎక్కువగా తీసుకుంటే మంచిది. అందులోనూ పాలకూర అయితే చాలా బెటర్. మామూలుగా పీరియడ్స్ సమయంలో ఐరన్ లెవెల్స్ తగ్గి నీరసం వస్తుంది.

Eat During Periods : పీరిడ్స్ సమయంలో తినాల్సిన, తినకూడని ఆహారాల గురించి తెలుసా?

Eat During Periods

Eat During Periods : పీరియడ్స్ అనేవి ప్రతీ నెల వస్తుంటాయి. ఒక్కొక్కసారి అది భరించలేనంత నొప్పిని అనుభవించాల్సి వస్తుంది. పీరియడ్స్ సమయంలో మహిళలు తీవ్ర రక్తస్రావంతో బాధపడుతుంటారు. తీవ్రమైన ఒత్తిడి, మూడ్ స్వింగ్స్, కడుపు నొప్ప, వికారం, అలసట, డయేరియా వంటి సమస్యలతో సతమతం అవుతుంటారు. కాళ్లు లాగడం, ఆహారం తినాలనిపించకపోవడం, విపరీతంగా కోపం రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఆ మూడు రోజులు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే పీరియడ్స్ కాలం ముగుస్తుంది. ఈ నొప్పిని కంట్రోల్ చేయడానికి ఇప్పటికే వైద్యులు ఎన్నో రకాల ఆరోగ్య చిట్కాలను సూచించారు.ఈ సమస్యలను ఎదుర్కోవాలంటే మంచి ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. అదే సమయంలో సమస్య మరింత పెరగకుండా ఉండేందుకు కొన్ని రకాల ఆహార పదార్థాల దోహదపడతాయి. పీరియడ్స్ సమయంలో ఏమి తినాలి, ఏమి తినకూడదో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

పీరియడ్స్ సమయంలో తినాల్సి పదార్థాలు :

పీరియడ్స్ సమయంలో పెరుగు, గింజలు, అల్లం, ఆకకూరలు, బచ్చలికూర, డార్క్ చాక్లెట్, అరటి పండ్లు, సోంపు, నారింజ, పుచ్చకాయ వంటి నీరు అధికంగా ఉండే ఆహారాలను అధికంగా తీసుకోవాలి. పీరియడ్స్ అయిన తర్వాత ఐదు రోజులపాటు వీటిని తీసుకుంటే మంచిది. దీనివల్ల రుతుక్రమ సమస్యలు దూరమౌతాయి. పీరియడ్స్ సమయంలో ఆకుకూరలు ఎక్కువగా తీసుకుంటే మంచిది. అందులోనూ పాలకూర అయితే చాలా బెటర్. మామూలుగా పీరియడ్స్ సమయంలో ఐరన్ లెవెల్స్ తగ్గి నీరసం వస్తుంది. అందుకే ఆ టైమ్‌లో పాలకూర, ఇతర ఆకుకూరలు తింటే ఐరన్ స్ధాయిలు పెరుగుతాయి.

ముఖ్యంగా డార్క్ చాక్లెట్ చాలా మేలు చేస్తుంది. డార్క్ చాక్లెట్‌లో ఐరన్, మెగ్నిషియం ఎక్కువగా ఉండడం వల్ల పీరియడ్స్‌లో కాస్త చురుకుగా ఉండడానికి ఇది ఉపయోగపడుతుంది. పీరియడ్స్ టైమ్‌లో కూడా నీటిశాతం ఎక్కువగా ఉండే పండ్లను తినడం చాలా మేలు చేస్తుంది. పుదీనా టీ, అల్లం టీ, చామంతి పూల టీ వంటివి తాగితే పొత్తకడుపు నొప్పి తగ్గుతుంది. వికారం వంటి లక్షణాలు కూడా తగ్గుతాయి. నరాలు, కండరాలకు కూడా విశ్రాంతినిస్తాయి.

పిరియడ్స్ సమయంలో తినకూడని పదార్ధాలు ;

రోజువారీ ఆహరంలో ఊరగాయలను తీసుకునే అలవాటు ఉంటే, పీరియడ్స్ సమయంలో దాన్ని నివారించాలి. అలాగే, నూడుల్స్, చిప్స్, వేఫెల్స్, ఫ్రిజ్లో ఉంచగలిగే ఫుడ్ కు దూరంగా ఉండటం మంచిది. పాలు, మాంసాహారం.. కాల్షియం, ఫ్యాట్ పదార్థాలు పాలు, మాంసం వంటివి వాటిలో ఎక్కువగా తీసుకోవడం వల్ల రొమ్మునొప్పి, బాడీ పెయిన్స్, కండరాల నొప్పులు వస్తాయి. అలాగే, కాఫీ, టీలు ఎక్కువగా తాగడం మానుకోవాలి. బదులుగా మీరు పాలు కాకుండా బ్లాక్ టీ, కాఫీ తాగవచ్చు. ఉప్పు అధికంగా తీసుకోవద్దు. అధిక చెక్కర వినియోగం వద్దు. ప్రాసెస్ చేసిన ఫుడ్ జోలికి వెళ్ళకుండా ఉండటమే మంచిది. ఆల్కాహాల్, స్పైసీ ఫుడ్స్ కు దూరంగా ఉండాలి.