Plastic Bottled Water : ప్లాస్టిక్ బాటిల్ వాటర్ ఎంత డేంజరో తెలుసా?

ప్లాస్టిక్ బాటిల్స్ ద్వారా విడుదలయ్యే బెథాలేట్ అనే రసాయనం నీటి ద్వారా రక్తంలోకి ప్రవేశించి చివరకు కాలేయ క్యాన్సర్ రావటానికి కారణమౌతుంది.

Plastic Bottled Water : ప్లాస్టిక్ బాటిల్ వాటర్ ఎంత డేంజరో తెలుసా?

Plastic Bottled Water

Plastic Bottled Water : ప్రపంచమంతా ప్లాస్టిక్ మయంగా మారిపోయింది. రోజు వారి దినచర్య ప్రారంభమైంది మొదలు అంతా ప్లాస్టిక్ తోనే గడపాల్సిన పరిస్ధితి నెలకొంది. తినే తిండి మొదలు, తాగే నీరు వరకు అన్నీ ప్లాస్టిక్ లో ప్యాకింగ్ చేయబడి ఉంటున్నాయి. ప్లాస్టిక్ పర్యావరణానికి ముప్పు కలిగించటమే కాక మానవ ఆరోగ్యానికి తీవ్రమైన హాని కలిగిస్తుంది. ఇటీవలి కాలంలో మార్కెట్లో ప్లాస్టిక్ బాటిల్స్ లో నీరు ఇబ్బడిముప్పడిగా అందుబాటులోకి వచ్చాయి. అనేక రసాయనాలతో తయారైన ప్లాస్టిక్ బాటిల్స్ లోని నీరు తాగటం వల్ల శరీర ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది.

ప్లాస్టిక్ బాటిల్ వాటర్ హార్మోన్లపై ప్రభావితం చూపిస్తాయి. ప్లాస్టిక్ బాటిల్స్ ఎండవేడికి గురైనప్పుడు అందులో ఉన్న నీటిలోకి కరిగిన ప్లాస్టిక్ పదార్ధాం చేరే అవకాశం ఉంటుంది. బాటిల్స్ తయారీలో వాడే రసాయనాలు వాటర్ లోకి చేరతాయి. అందులోని వాటర్ విషతుల్యంగా మారిపోతుంది. మన రోగనిరోధక వ్యవస్ధను ప్రభావితం చేస్తాయి. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ లో పాలీప్రొలైన్ అనే పాలిమర్ అవశేషాలు, అధిక మోతాదు కార్సినోజెన్స్, అలాగే బ్రోమేట్స్ అనేక అనేక అధ్యయనాల్లో తేలింది. ప్లాస్టిక్ బాటిల్స్ ఉండే రసాయనాలు నీటిలో కలవటం వల్ల వాటిని తాగిన వారిలో కాన్సర్ వంటి జబ్బులు వచ్చే ప్రమాదం ఉంటుంది. అంతే కాకుండా స్పెర్మ్ కౌంట్ కూడా తగ్గిపోతుంది. లైంగిక పరమైన సమస్యలకు దారితీసే అవకాశాలు ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ప్లాస్టిక్ బాటిల్స్ ద్వారా విడుదలయ్యే బెథాలేట్ అనే రసాయనం నీటి ద్వారా రక్తంలోకి ప్రవేశించి చివరకు కాలేయ క్యాన్సర్ రావటానికి కారణమౌతుంది. ఇటీవలి కాలంలో కుళాయి నీటి కంటే బాటిల్ వాటర్ ఆరోగ్యకరమైనదని అంతా భావిస్తున్నారు. అయితే వాటిల్లో ఉండే హానికరమైన రసాయనాల కారణంగా దీర్ఘకాలిక వ్యాధుల చెంతకు చేరుతున్నామన్న ఆలోచన ఏమాత్రం చేయటం లేదు.