Skin Beauty : చర్మ సౌందర్యానికి మెంతులు చేసే మేలు తెలుసా!.

మెంతులు చర్మ సౌందర్యానికి ఎంతగానో ఉపయోగపడతాయి. చర్మానికి మాయిశ్ఛరైజ్ గా పనిచేస్తాయి. ఫంగల్ ఇన్ ఫెక్షన్ , మొటిమలు రాకుండా చేస్తాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్

Skin Beauty : చర్మ సౌందర్యానికి మెంతులు చేసే మేలు తెలుసా!.

Menthulu

Skin Beauty :  ప్రాచీన కాలం నుండి మెంతులకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. పూర్వం గ్రీకులు మెంతులు వినియోగించేవారని చరిత్ర అధారాలను బట్టి తెలుస్తుంది. మనుషులు చనిపోయాక వచ్చే దుర్వాసన నిరోధించేందుకు రూపొందించే పరిమళ ద్రవ్యాలలో మెంతులు వాడే వారని తెలుస్తోంది. భారత దేశంలో ఎక్కవగా మెంతి సాగుచేయబడుతుంది. మెంతి ఆకుతోపాటు, మెంతులను నిత్యం ఆహారంలో వినియోగిస్తుంటారు.

మెంతిలో ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి. 100 గ్రాముల మెంతులలో పిడిపదార్ధాలు 44.1శాతం, ప్రొటీన్లు 26.2శాతం, కొవ్వు పదార్ధాలు 5.8శాతం , పీచు పదార్ధం 7.2శాతం, తేమ 13.7శాతం, విటమిన్ ఎ, కాల్షియం, పాస్పరస్, కెరోటిన్, థయమిన్, నియాసిన్ ఉంటుంది. 100 గ్రాముల మెంతి ఆకుల్లో పిండి పదార్ధాలు 60శాతం, ప్రొటీన్లు 4.4శాతం, కొవ్వు పదార్ధాలు 1శాతం, ఖనిజ లవణాలు 1.5శాతం, పీచు పదార్ధం 1.2శాతం, ఇనుము సమృద్ధిగా లభిస్తుంది. మెంతుల నుండి నూనెను కూడా తయారు చేస్తారు.

మెంతులు చర్మ సౌందర్యానికి ఎంతగానో ఉపయోగపడతాయి. చర్మానికి మాయిశ్ఛరైజ్ గా పనిచేస్తాయి. ఫంగల్ ఇన్ ఫెక్షన్ , మొటిమలు రాకుండా చేస్తాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉండటంలో దోహదపడతాయి. మెంతులను మెత్తగా పేస్టులా చేసి ముఖానికి పట్టించి కొద్దిసేపటి తరువాత నీళ్ళతో కడుక్కోవాలి. తరుచూ ఇలా చేయటం వల్ల మొటిమలు తగ్గి చర్మం మృధువుగా మారుతుంది.

మెంతులను నీటిలో వేసి బాగా వేడి చేయాలి. చల్లారిన తరువాత ఆ మిశ్రమాన్ని ఒక సీసాలో పోసి ఫ్రిజ్ లో నిల్వ వుంచుకోవాలి. ప్రతిరోజు టోనర్ గా ఈ మిశ్రమాన్ని ఉపయోగిస్తే చర్మం ఆరోగ్యవంతంగా ఉంటుంది. చర్మం ముడతులుగా ఉండే అలాంటి వారు పెరుగు, మెంతులు కలిపి ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. మెంతుల పేస్టును మొఖానికి రాసుకున్నా చర్మంలోని మృత కణాలు తొలగిపోతాయి.

చర్మ సౌందర్యానికే కాకుండా కొలెస్ట్రాల్ స్ధాయిలను తగ్గించటానికి మెంతులు ఉపయోగపడతాయి. కీళ్ళ నొప్పుల నుండి ఉపశమనాన్ని ఇస్తాయి. రోజుకు కొన్ని మెంతులను తీసుకుంటే ఇన్సులిన్ స్ధాయి తగ్గి షుగర్ అదుపులో ఉంటుంది. కాలేయం పనితీరును మెరుగు పర్చటంలో కూడా మెంతులు బాగా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు.