Black Raisins : బ్లాక్ కిస్మిస్ తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు తెలుసా?..

నల్ల కిస్మిస్‌ల‌లో పొటాషియం అధికంగా ఉంటుంది క‌నుక హైబీపీ ఉన్న‌వారు వీటిని రోజూ తింటే మంచిది. దీంతో బీపీ త‌గ్గుతుంది. దంతాలు ఆరోగ్యంగా ఉండేందుకు న‌లుపు రంగు కిస్మిస్ పండ్లు ఎంత‌గానో

Black Raisins : బ్లాక్ కిస్మిస్ తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు తెలుసా?..

Blck Raisins

Black Raisins : కిస్మిస్ పండ్లు అంటే అంద‌రికీ ఇష్ట‌మే. వాటిని చాలా మంది ఇష్టంగా తింటుంటారు. వాటిని ఎక్కువ‌గా తీపి వంట‌కాల్లో వేస్తారు. అంటే కిస్మిస్‌లోనూ ప‌లు ర‌కాలు ఉంటాయి. వాటిల్లో న‌లుపు రంగు కిస్మిస్‌లు ఒక‌టి. న‌ల్ల ద్రాక్ష‌ల‌ను ఎండ‌బెట్టి వీటిని త‌యారు చేస్తారు. సాధార‌ణ కిస్మిస్‌ల‌తో పోలిస్తే ఈ కిస్మిస్‌లు ఎన్నో ఔష‌ధ గుణాల‌ను దాగి ఉంటాయి. ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి. నల్ల కిస్మిస్ లు తినటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని పలు పరిశోధనల్లో తేలింది.

కిస్మిస్‌ల‌లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి అనేక విధాలుగా మ‌న‌కు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. కిస్మిస్‌ల‌లో ఉండే పాలిఫినోలిక్ ఫైటోన్యూట్రియెంట్లు ఫ్రీ ర్యాడిక‌ల్స్‌ను నాశ‌నం చేస్తాయి. దీంతో కంటి చూపు పెరుగుతుంది. క‌ళ్ల‌లో కండ‌రాల‌పై ప‌డే ఒత్తిడి తగ్గుతుంది. కంటి ఆరోగ్యం మెరుగు ప‌డుతుంది. న‌లుపు రంగు కిస్మిస్‌ల‌ను తిన‌డం వ‌ల్ల రక్తం శుద్ధి అవుతుంది. అందులో ఉండే వ్య‌ర్థాలు బ‌య‌ట‌కు పోతాయి. విష ప‌దార్థాలు న‌శిస్తాయి. ర‌క్తం శుభ్రంగా మారుతుంది. ఇన్‌ఫెక్ష‌న్లు రావు.

న‌లుపు రంగు కిస్మిస్‌ల‌ను తిన‌డం వ‌ల్ల ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది. హైబీపీ త‌గ్గుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె జ‌బ్బులు రాకుండా చూసుకోవ‌చ్చు. వీటిలో విట‌మిన్ సి అధికంగా ఉంటుంది. అందువ‌ల్ల వాటిని రోజూ తింటుంటే జుట్టు స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. వెంట్రుక‌లు రాలిపోవ‌డం, చుండ్రు త‌గ్గుతాయి. జుట్టు న‌ల్ల‌గా మారుతుంది.

బ్లాక్ కిస్మిస్‌ల‌లో పొటాషియం, కాల్షియం అధికంగా ఉంటాయి. అందువ‌ల్ల ఎముక‌లు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. ఆస్టియోపోరోసిస్, ఆర్థరైటిస్ స‌మ‌స్య‌లు ఉన్న‌వారు రోజూ న‌లుపు రంగు కిస్మిస్ ల‌ను తిన‌డం వ‌ల్ల నొప్పుల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. ఎముక‌ల సాంద్ర‌త పెరుగుతుంది. ఆర్థ‌రైటిస్, గౌట్ వంటి స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి.

కిస్మిస్ ల‌ను తింటే శ‌రీరంలోని చెడు కొలెస్ట్రాల్ త‌గ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీంతో హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూసుకోవ‌చ్చు. కాలేయానికి కిస్మిస్ ఎంతో ప్రయోజనకారిగా ఉంటాయి. కిస్మిస్ నానబెట్టిన నీటిని తీసుకోవడం వల్ల బాడి మెటబాలిజాన్ని సమతౌల్య పరుస్తోంది. ఫలితంగా శరీరం యాక్టివ్ గా ఉంటుంది.

నల్ల కిస్మిస్‌ల‌లో పొటాషియం అధికంగా ఉంటుంది క‌నుక హైబీపీ ఉన్న‌వారు వీటిని రోజూ తింటే మంచిది. దీంతో బీపీ త‌గ్గుతుంది. దంతాలు ఆరోగ్యంగా ఉండేందుకు న‌లుపు రంగు కిస్మిస్ పండ్లు ఎంత‌గానో దోహ‌దం చేస్తాయి. వీటిల్లో శ‌క్తివంత‌మైన ఫైటోకెమిక‌ల్స్ ఉంటాయి. ఇవి దంత క్ష‌యం కాకుండా దంతాల‌ను ర‌క్షిస్తాయి. దంతాల‌ను, చిగుళ్ల‌ను ఆరోగ్యంగా ఉంచుతాయి. నోట్లో ఉండే బాక్టీరియా న‌శించి నోటి దుర్వాస‌న తగ్గుతుంది. నోరు శుభ్రంగా మారుతుంది.

బ్లాక్ కిస్మిస్‌ల‌లో అనేక విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ ఉంటాయి. ఇవి రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి. ఇన్‌ఫెక్ష‌న్ల‌కు వ్య‌తిరేకంగా పోరాడుతాయి. కిస్మిస్‌ల‌లో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ, యాంటీ బాక్టీరియ‌ల్ గుణాలు జ్వ‌రం, ఇన్‌ఫెక్ష‌న్లు, ఇత‌ర అనారోగ్య స‌మస్య‌లను రాకుండా చూస్తాయి.

నల్ల కిస్మ‌ిస్‌ల‌లో ఐర‌న్ అధికంగా ఉంటుంది. దీంతో ఐర‌న్ లోపం నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ర‌క్తం బాగా త‌యార‌వుతుంది. హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి. ర‌క్త‌హీన‌త నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. కిస్మిస్‌లు తియ్య‌గా,పుల్లగా ఉంటాయి. అయిన‌ప్ప‌టికీ వీటిల్లో క్యాల‌రీలు త‌క్కువ‌గానే ఉంటాయి. అందువ‌ల్ల వీటిని త‌క్కువ‌గా తిన్నా ఎక్కువ సేపు ఆక‌లి వేయ‌దు. ఫ‌లితంగా ఆహారం త‌క్కువ‌గా తీసుకుంటారు. దీంతో అధిక బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు.