Chickpeas : శనగలు తినటం వల్ల కలిగే ఆరోగ్యప్రయోజనాలు తెలుసా!…

ఒకరోజుకు అవసరమయ్యే ప్రోటీన్ లో మూడవ వంతు ప్రోటీన్ 28గ్రాముల శనగల్లో ఉంటుంది.పొట్టు తీసిన శనగల కంటే పొట్టుతో వున్నా శనగలు చాలా మంచిది.అలా అని అతిగా తింటే మాత్రం కడుపుబ్బరంతో ఇబ్బంది పడతారు. డయాబెటిస్ ఉన్న‌వారికి శ‌న‌గ‌లు మంచి ఆహారం అని చెప్ప‌వ‌చ్చు. వీటి గ్లైసీమిక్ ఇండెక్స్ చాలా త‌క్కువ‌.

Chickpeas : శనగలు తినటం వల్ల కలిగే ఆరోగ్యప్రయోజనాలు తెలుసా!…

Chickpeas

Chickpeas : శ‌న‌గ‌ల‌ను ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగించే ఆహారంగా చెప్పవచ్చు. చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. చాలా మంది వీటిని ఉడ‌క‌బెట్టి గుగ్గిళ్ల రూపంలో,కూర‌లుగా చేసుకుని ఆహారంగా తీసుకుంటారు. ఎలా తీసుకున్న‌ప్ప‌టికీ శ‌న‌గ‌ల‌తో మ‌న‌కు ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. మాంసం తిన‌లేనివారికి శ‌న‌గ‌లు అద్భుత‌మైన ఆహారం అనే చెప్ప‌వ‌చ్చు. ఎందుకంటే శ‌న‌గ‌ల్లో ప్రోటీన్లు స‌మృద్ధిగా ఉంటాయి. నిత్యం ఒక క‌ప్పు శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక లాభాలు ఉన్నాయి. రోగనిరోధకశక్తి పెంచే దివ్యౌషదంగా శనగలను చెప్పవచ్చు.

ప్రతిరోజు గుప్పెడు శనగలను తినటం ద్వారా చిన్నచిన్న ఆరోగ్యసమస్యలు తలెత్తకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. శ‌న‌గ‌ల్లో పొటాషియం పుష్క‌లంగా ఉంటుంది. ఒక కప్పు శ‌న‌గ‌ల ద్వారా మ‌న‌కు సుమారుగా 474 మిల్లీగ్రాముల పొటాషియం ల‌భిస్తుంది. పొటాషియం మ‌న శ‌రీరంలో బీపీని నియంత్రిస్తుంది. గుండె స‌మ‌స్య‌లు రాకుండా చూస్తుంది. అందువ‌ల్ల నిత్యం శ‌న‌గ‌ల‌ను తింటే హైబీపీ త‌గ్గుతుంది. అలాగే గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి.సూపర్ రిచ్ ప్రోటీన్,విటమిన్స్,మినరల్స్,ఫైబర్ పుష్కలంగా వున్నా శనగలతో జీర్ణం కూడా బాగా అవుతుంది.

ఒకరోజుకు అవసరమయ్యే ప్రోటీన్ లో మూడవ వంతు ప్రోటీన్ 28గ్రాముల శనగల్లో ఉంటుంది.పొట్టు తీసిన శనగల కంటే పొట్టుతో వున్నా శనగలు చాలా మంచిది.అలా అని అతిగా తింటే మాత్రం కడుపుబ్బరంతో ఇబ్బంది పడతారు. డయాబెటిస్ ఉన్న‌వారికి శ‌న‌గ‌లు మంచి ఆహారం అని చెప్ప‌వ‌చ్చు. వీటి గ్లైసీమిక్ ఇండెక్స్ చాలా త‌క్కువ‌. అంటే వీటిని తింటే రక్తంలో షుగ‌ర్ లెవ‌ల్స్ వెంట‌నే పెర‌గ‌వు. పైగా వీటిలో ఉండే ఫైబ‌ర్ నెమ్మ‌దిగా జీర్ణం అవుతుంది. అందువ‌ల్ల ర‌క్తంలో షుగ‌ర్ లెవ‌ల్స్ పెర‌గ‌కుండా ఉంటాయి. ఫ‌లితంగా డ‌యాబెటిస్ అదుపులో ఉంటుంది.

శ‌న‌గ‌ల్లో ఐర‌న్‌, కాల్షియం, విట‌మిన్ సి, ఎ, ఇ, ఫోలేట్‌, యాంటీ ఆక్సిడెంట్లు, ఇత‌ర పోష‌కాలు పుష్క‌లంగా ఉంటాయి. దీంతో ఎముక‌లు ఆరోగ్యంగా, దృఢంగా ఉంటాయి. అలాగే శ‌రీరం ఐర‌న్‌ను ఎక్కువ‌గా గ్ర‌హిస్తుంది. దీంతో ర‌క్త‌హీన‌త స‌మ‌స్య రాదు. హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి. ఆస్టియోపోరోసిస్ వంటి స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. బ్లడ్ షుగర్ పై అదుపు సాధించేందుకు శనగలతో చేసిన ఆహారం సాయపడుతుంది.

శ‌న‌గ‌ల్లో రాఫినోస్ అన‌బ‌డే సాల్యుబుల్ ఫైబ‌ర్ ఉంటుంది. ఇది జీర్ణ ప్రక్రియ‌ను మెరుగు ప‌రుస్తుంది. జీర్ణ‌వ్య‌వ‌స్థ‌లో ఉండే విష ప‌దార్థాలు బ‌య‌ట‌కు వెళ్లిపోతాయి. దీంతో ఆ వ్య‌వ‌స్థ ఆరోగ్యంగా ఉంటుంది. శ‌న‌గ‌ల్లో ఉండే పోష‌కాలు మ‌న శ‌రీరానికి పోష‌ణ‌ను అందిస్తాయి. శ‌న‌గ‌ల్లో ఉండే సెలీనియం, మెగ్నిషియం, పొటాషియం, విట‌మిన్ బి, ఫైబ‌ర్‌, ఐర‌న్ వంటి పోష‌కాలు శ‌రీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ ను త‌గ్గిస్తాయి. మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతాయి. దీంతో హార్ట్ ఎటాక్‌లు రాకుండా ఉంటాయి.

సమృద్దిగా వున్నా ఫైబర్ తో మలబద్దకం,అజీర్తి వంటి సమస్యలు పోతాయి.శరీరంలో ని ట్యాక్సిన్ల ను బయటకు పంపటంలో శనగలు అధ్బుతంగా పని చేస్తాయి.శనగలు నాన బెట్టి,మొలకలు వచ్చాక వాటిని పచ్చివి తిన్నా,వేయించుకుని,ఉడికించుకుని తిన్నా ఆరోగ్యకరమే.