Fish Oil : చేపనూనెతో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో తెలుసా?

గర్భదారణతో ఉన్న స్త్రీలు చేపనూనెను వినియోగించటం ద్వారా శిశువులో మేధాశక్తి, అవయవాల అభివృద్ది బాగా ఉంటుంది. పుట్టబోయే శిశువులో కంటి చూపును మెరుగుపరచవచ్చు. గర్భదారణ చివరి మూడు

Fish Oil : చేపనూనెతో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో తెలుసా?

Fish Oil

Fish Oil : అత్యధిక పోషక విలువలు కలిగిన ఆహారంలో చేపలు ఒకటి. ఇందులో ఒమేగా 3 కొవ్వులు అధికంగా ఉంటాయి. అనేక విటమిన్లు, ఖనిజలతో పాటు శరీరానికి కావల్సిన పోషకాలను చేపలు అందిస్తాయి. ఇది ఆరోగ్యకరమైన ఆహారమని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. చేపలను తినేందుకు చాలా మంది ఇష్టపడకపోవచ్చు. అలాంటి వారు అందులోని కొవ్వులను శరీరానికి అందించేందుకు చేప నూనెను వాడుకోవచ్చు. చేప నూనె ద్వారా మనిషి ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరతాయి.

సాల్మోన్, కాడ్, వంటి చేపల కణజాలల నుండి చేప నూనెను తీస్తారు. ఇందులో ఇకోసాపెంటెనోయిక్ ఆసిడ్, డోకోసాహెక్సేనోయిక్ ఆమ్లం, ఓమెగా 3 వంటి కొవ్వు అమ్లాలు సమృద్ధిగా లభిస్తాయి. చేపల్లో ఈ తరహా కొవ్వులు అవి తినే నాచు ద్వారా ఏర్పడతాయి. చేపనూనె ద్వారా ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నట్లు ఇటీవల శాస్త్రవేత్తలు కనుగొన్నారు. చేపనూనె గుండె, మెదడు, కళ్ళకు ఒక వరం లాంటిదని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.

గర్భదారణతో ఉన్న స్త్రీలు చేపనూనెను వినియోగించటం ద్వారా శిశువులో మేధాశక్తి, అవయవాల అభివృద్ది బాగా ఉంటుంది. పుట్టబోయే శిశువులో కంటి చూపును మెరుగుపరచవచ్చు. గర్భదారణ చివరి మూడు మాసాల ముందుగా ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ తీసుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. చర్మ ఆరోగ్యాన్ని మెరుగు పరచటంలో సైతం చేపనూనె బాగా పనిచేస్తుంది. చర్మం పొడితనాన్ని తగ్గించి సోరియాసిస్ వంటి రుగ్ముతలను తగ్గించేందుకు ఇది ఉపకరిస్తుంది.

చేపనూనె గుండెకు ఒక వరంగానే చెప్పవచ్చు. చేపనూనెను తీసుకునే వారిలో గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించేందుకు అవకాశం ఉంటుంది. ఇది ఆరోగ్య కరమైన కొవ్వు కావటంతో అధిక రక్తపోటు, అరిథ్మియా వంటి సమస్యలు రాకుండా జాగ్రత్త పడవచ్చు. డిప్పెషన్ తో బాధపడేవారు చేపనూనెను వినియోగించటం ద్వారా దాని నుండి సులభంగా బయటపడవచ్చు. ఆందోళన వంటి సమస్యలను తగ్గిస్తుందని పలు అధ్యయనాల్లో తేలింది. మెదడును చురుకుగా ఉంచేందుకు ఇందులోని డిహెచ్ ఎ అనే రెండు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు దోహదపడతాయి.

మధుమేహం, కుంగుబాటు, ఉబకాయం, వంటి దీర్ఘకాలిక సమస్యలకు చేపనూనె చక్కగా పనిచేస్తుంది. వాపుని తగ్గించటం వల్ల ఆ వ్యాధుల లక్షణాలను కొంతమేర తగ్గించవచ్చు. చేపనూనెల్లోని యాంటీ ఇన్ఫలమెంటరీ ప్రభావం కారణంగా ఈ తరహా వ్యాధుల చికిత్సకు సహాయకారిగా పనిచేస్తాయి. చేపనూనెలో ఉండే కొవ్వులు శరీర పనితీరులో ఎంతగానో ఉపయోగపడతాయి. కంటి సమస్యలను తగ్గించటంలోను దోహదం చేస్తుంది.