Betel Leaves : తమలపాకులో ఔషదగుణాలు ఎన్నో తెలుసా?

తమలపాకుల రసమును గొంతునొప్పి నివారణకు ఉపయోగిస్తారు. శ్వాసకోశ వ్యాధుల నివారణకై ఈ ఆకులను నూనె రాసి కొద్దిగా వేడిచేసి ఛాతీపై ఉంచుతారు. తమలపాకులకు నేయి రాసి గాయాలకు కట్టుకడతారు.

Betel Leaves : తమలపాకులో ఔషదగుణాలు ఎన్నో తెలుసా?

Betel Leaves

Betel Leaves : తమలపాకు దక్షిణ, అగ్నేయ ఆసియాలోనూ, పాకిస్తాన్ నుండి న్యూగినియా వరకూ విస్తృతంగా పండిస్తారు. బంగ్లాదేశ్ లో రైతులు దీనిని బరుయి అని పిలుస్తారు. హిందూ సాంప్రదాయంలో తమలపాకుకు విశిష్టమైన స్ధానం ఉంది. పూజా కార్యక్రమాల్లో దీనిని వినియోగిస్తారు. తాంబూలం గా ఉపయోగిస్తారు. భోజనానంతరం తాంబూలంగా తీసుకుంటారు.

తమలపాకుల వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. ఇందులో ఎన్నో పోషకాలు ఉన్నాయి. మన పూర్వీకులకు దీని ఉపయోగాల గురించి బాగా తెలుసు. ఆధునిక ప్రజలకు దాని ఉపయోగాల గురించి పెద్దగా తెలియదు. నోటి క్యాన్సర్ వల్ల వచ్చే ప్రమాదం ఉందని పేర్కొంటూ పాన్ తినడాన్ని నిరుత్సాహపరుస్తుంటారు. భారతదేశంలో పొగాకు లేదా సున్నం, అరేకా గింజతో పాన్ తినడం సంప్రదాయం. ఆధ్యాత్మిక ఆచారాలు, ప్రార్థనల్లో తమలపాకులను శుభప్రదంగా భావిస్తారు.

వాస్తవానికి తమలపాకుల్లో మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిలో విటమిన్-సీ, థియామిన్, రైబోఫ్లోవిన్, కేరోటిన్ లాంటి విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. కాల్షియం వీటిలో గొప్ప మూలం. వాస్తవానికి తమలపాకులు చాలా తక్కువగా ఉంటాయి. ఇది పోషకాలకు గొప్ప వనరుగా దోహదపడుతుంది.

అయితే నిజమైన ఔషధ ప్రయోజనాలు ఇతర పోషక రహిత భాగాల నుంచి ఉత్పన్నమవుతాయి. వీటిలో శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటోకెమికల్స్ వంటి నిరోధక సమ్మేళనాలు ఉన్నాయి. వీటిలో ఫ్లేవనాయిడ్లు, టానిన్లు, ఆల్కలాయిడ్లు, స్టెరాయిడ్లు, క్వినోన్లు ఉన్నాయి.

తమలపాకుల రసమును గొంతునొప్పి నివారణకు ఉపయోగిస్తారు. శ్వాసకోశ వ్యాధుల నివారణకై ఈ ఆకులను నూనె రాసి కొద్దిగా వేడిచేసి ఛాతీపై ఉంచుతారు. తమలపాకులకు నేయి రాసి గాయాలకు కట్టుకడతారు. తమలపాకుల రసమును చెవిలో పిండిన చెవినొప్పి తగ్గిపోతుంది. అపస్మారకమును నివారించుటకు తమలపాకుల రసమును పాలతో కలిపి త్రాగిస్తారు. తమలపాకు రసాన్ని టీ స్పూన్ మోతాదులో మూడుపూటలా మిరియం పొడి కలిపి తీసుకుంటుంటే జ్వరం తగ్గుతుంది.

తమలపాకుల్లో యాంటీ మైక్రోబియల్ క్యాన్సర్ నిరోధక, డయాబెటిక్ వ్యతిరేక లక్షణాలు ఉన్నాయి. కార్డియో వాస్కులర్ డిసీజ్, అధిక కొలెస్ట్రాల్, రక్తపోటు నివారణలో తోడ్పడుతుందని పలు అధ్యయనాల్లో నమోదు చేశారు. సాంప్రదాయ వైద్యంలో గాయాలు, మంట, ఉబ్బసం చికిత్సలో ఇది ఉపయోగపడుతుంది. సంప్రదాయ ఔషధంలో ఇతర ప్రయోజనాలు నోటి కుహరం లోపాలు, జీర్ణ సంబంధిత సమస్యలు, ఒత్తిడిని తగ్గించడంలో ఇవి ఉపయోగపడతాయి. తమలపాకును వేడిచేసి వాపు, నొప్పి కలిగిన కీలు మీద కడితే నొప్పి తగ్గుతుంది.

నోటి క్యాన్సర్ కు సంబంధించిన ఆందోళనలు వాస్తవమైనవే. పొగకు, ఇతర పదార్థాల ప్రభావం పెదవి, నోరు, నాలుక క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయని అనేక అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అయితే స్వతంత్రంగా తమలపాకులు హానికరమైన ప్రభావాలను కలిగి ఉన్నట్లు కనుగొనలేదు.నిర్దిష్ట పరిస్థితుల కోసం ఆయుర్వేద గ్రంథాల్లో తమలపాకు తినే విషయంలో వివిధ సిఫార్సులు ఉన్నాయి. అంతేకాకుండా ఇందులో హానికరమైన పదార్థాలు ఉన్నా లేవా అనే కంటే తమలపాకుల వల్ల కలిగే ప్రయోజనాలు గురించి మరిన్ని శాస్త్రీయ అధ్యయనాలు నిర్వహించాల్సిన అవసరం ఉంది.

తమలపాకు రసం, తులసి రసం, అల్లం రసం, మిరియాలు పొడి, తేనెలను కలిపి నాకిస్తే పిల్లల్లో జలుబు, దగ్గు తగ్గుతాయి. చెవుల మీద తమలపాకులను వేసి కట్టుకుంటే తలలో చేరిన వాతం శాంతించి తల నొప్పి తగ్గుతుంది. రసాన్ని పాలతో కలిపి తీసుకుంటే మహిళల్లో కనిపించే పిశాచ బాధలు, క్షణికావేశాలు తగ్గుతాయి. గుండె అపసవ్యంగా, అపక్రమంగా కొట్టుకుంటున్నప్పుడు తమలపాకు రసాన్ని టీ స్పూన్ మోతాదుగా తాగుతుంటే హితకరంగా ఉంటుంది.

తమలపాకు షర్బత్‌ని తాగితే గుండె బలహీనత తగ్గుతుంది. కఫం, మందాగ్ని దూరమవుతాయి. పసిపాపాయికి పాలివ్వలేకపోతే రొమ్ముల్లో పాలు నిలిచిపోయి గడ్డలుగా తయారై నొప్పిని కలిగిస్తాయి. ఇలాంటి సందర్భాల్లో తమలపాకు కొద్దిగా వేడిచేసి స్తనాలమీద కట్టుకుంటే వాపు తగ్గి ఉపశమనం లభిస్తుంది. చిన్న పిల్లలకు చీటికిమాటికి జలుబు చేసి ఇబ్బంది పెడుతున్నప్పుడు తమలపాకును వేడిచేసి, కొద్దిగా ఆముదాన్ని రాసి, ఛాతిమీద వేసి కడితే హితకరంగా ఉంటుంది.