Yawning Mystery : ఆవలింత.. ఎవరైనా ఆవలిస్తే.. మీరూ ఎందుకు ఆవలిస్తారు? కారణం తెలిసిందోచ్..!

ఆవలింత.. ఇది అంటువ్యాధా? ఎవరైనా ఆవలిస్తే.. మనం ఎందుకు ఆవలింత వస్తుందో తెలుసా? అసలు అవలింత అనేది ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలుసా?

Yawning Mystery : ఆవలింత.. ఎవరైనా ఆవలిస్తే.. మీరూ ఎందుకు ఆవలిస్తారు? కారణం తెలిసిందోచ్..!

Do You Know The Reason Why You Yawn When Other People Yawn, This Is Answer (1)

Yawning Mystery : ఆవలింత.. ఇది అంటువ్యాధా? ఎవరైనా ఆవలిస్తే.. మనం ఎందుకు ఆవలింత వస్తుందో తెలుసా? అసలు అవలింత అనేది ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలుసా? పుట్టుకముందే ఆవలిస్తారని ఎప్పుడైనా విన్నారా? అవును.. తల్లి గర్భంలో ఉన్పప్పుడే శిశువు ఆవలిస్తుందంట.. అప్పటినుంచి మళ్లీ మరణం వరకు ఆవలింత ఉంటుంది. ఒక మనిషి జీవితకాలంల సగటున 2.4 లక్షల సార్లు ఆవలిస్తాడంట..

సాధారణంగా మన ఎదురుగా ఎవరైనా ఆవలిస్తే.. ఆకస్మాత్తుగా మీకు తెలియకుండానే అవలింత వచ్చేస్తుంటుంది. ఇది ఎలా ఎందుకు జరుగుతుందంటే.. ఆక్సిజన్ సప్లయ్ పెరగడానికి సాయపడుతుందని అంటారు. ఇందులో నిజమెంత? ఇంతకీ అవలింతలు ఎందుకు వస్తాయో తెలుసుకుందాం.. ఆవలింతలు ఎందుకు వస్తాయంటే దానికి రెండు థియరీలు ఉన్నాయి. అవేంటో ఓసారి చూద్దాం..

సాధారణంగా అలసిపోయినప్పుడు లేదా విసుగు చెందినప్పుడు మన మెదడు ఉష్ణోగ్రత హఠాత్తగా పెరిగిపోతుంది. ఆ సమయంలో చల్లటి గాలిని పీలుస్తాం. అప్పుడు మెదడును చల్లబరుస్తుందని ఒక థియరీ చెబుతోంది.. ఇక రెండో థియరీ ప్రకారం.. మనం ఇతరులు ఆవలింతని చూసినప్పుడు మనం ఎందుకు ఆవలిస్తామంటే… అదో రకమైన కమ్యూనికేషన్ అంటున్నారు రీసెర్చర్లు. ఒకరిని ఆవలింత చూడగానే మరొకరిలోనూ ఆవలింత వచ్చేస్తుంది.

మనుషులే కాదు, జంతువులూ కూడా ఆవలిస్తాయి. తన యజమాని ఆవలింతను చూడగానే కుక్కలు కూడా ఆవలిస్తుంటాయి. ఎక్కువ ఆక్సిజన్‌ను పెంచుకోవడానికి అని 30 ఏళ్ల క్రితం వరకు శాస్త్రవేత్తలు విశ్వసించారు. ఏదేమైనా, ఆ సిద్ధాంతం 1987లో అధ్యయనాల్లో కాదని రుజువైంది. ఆక్సిజన్ కొరతకు ఆవలింతలకు మధ్య ఎలాంటి సంబంధం లేదని తేలింది.

ఒక వ్యక్తిలో అవలింతను చూసినప్పుడు తెలియకుండానే శరీరం ఉద్రేకానికి లోనవుతుంది. ఆ సమయంలో అలసిపోయాననే భావన మెదడుకు చేరుతుంది. అప్పుడు మెదడులోని ఉష్ణోగ్రత ఒక్కసారిగా ఆవలింత ద్వారా వెళ్లే గాలి ద్వారా చల్లబడుతుంది. అంతేకాదు.. మానసికంగానూ నాడీ అభివృద్ధిని మెరుగుపరుస్తుంది. అప్పుడు మనలో ఏదో రిలీఫ్ అయ్యాననే భావన కలుగుతుంది.