EATING FOOD : భోజనం చేసే సమయంలో ఎలాంటి నియమాలు పాటించాలో తెలుసా!

మంచం మీద కూర్చొని భోజనం చేయరాదు. ఇలా తినడం వల్ల మనం తిన్న తిండి వంటికి పట్టదంటారు. ఆహారపదార్ధాలను ఉంచిన గిన్నెలను కాళ్లతో తన్నటం వంటివి చేయకూడదు.

EATING FOOD : భోజనం చేసే సమయంలో ఎలాంటి నియమాలు పాటించాలో తెలుసా!

Eating Food

EATING FOOD : మనిషి మనుగడకు ఆహారం అనేది చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా రోజుకు మూడు సార్లు భోజనం చేయటం అన్నది అందరికి అలవాటు. కొంతమంది ఉదయం పూట అల్పాహారం తీసుకుని మద్యాహ్నం, రాత్రి సమయంలో భోజనం చేస్తుంటారు. ఏసమయంలో ఎవరు ఎలాంటి ఆహారం తీసుకున్నా కొన్ని నీయమాలను మాత్రం తప్పనిసరిగా పాటించటం మంచిది. మన పూర్వీకులు కొన్ని నియమ నిబంధనలను అనాధిగా అనుసరిస్తూ వస్తున్నారు. అయితే ప్రస్తుతం అధునిక యుగంలో చాలా మంది మోడ్రన్ పద్దతులకు అలవాటు పడి వాటిని అనుసరించటం లేదు. అయితే వారు అనుసరించిన విధానాల్లో ఎంతో శాస్త్రీయత ఉందన్న విషయం నేటి తరానికి ఏమాత్రం బోధపడటంలేదు.

మనం తిన్న ఆహారం వంటికి పట్టాలన్నా, ఒక క్రమ పద్దతిని అనుసరించాల్సి ఉంటుంది. భోజనాన్ని తిన్న తినడానికి ముందు కాళ్లు, చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. అనంతరం కాళ్లు, చేతులు తడి లేకుండా తుడుచుకోవాలి. భోజనం తయారు చేసే వారు కచ్చితంగా స్నానం చేసే భోజనాన్ని తయారు చేయాలి. దంతాలను శుభ్రం చేసుకున్న తరువాత మాత్రమే వంట కార్యక్రమాలను మొదలు పెట్టాలి. వంట సమయంలో కాళ్లకు చెప్పులను ధరించరాదు.

భోజనం చేసే ముందు తూర్పు లేదా ఉత్తరం వైపు కూర్చొని భోజనం చేయాలి. ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు మనం తినగా మిగిలిన అన్నాన్ని వారికి వడ్డించకుండా, వారి కోసం ప్రత్యేకంగా భోజనాన్ని సిద్ధం చేయటం మంచిది. భోజనాన్ని వడ్డించేటప్పుడు వడ్డించే పదార్థాలను కంచానికి తగలకుండా వడ్డించాలి. ఆహార పదార్థాలను వడ్డించేటప్పుడు కొద్దిగా ఎత్తు నుండి వడ్డించాలి. ఎంగిలి చేత్తో ఏ పదార్థాన్ని చూపించకూడదు. తాకరాదు. ఎడమ చేత్తో తినే కంచాన్ని ముట్టుకోరాదు. భోజనం చేసేటప్పుడు భగవంతున్ని స్మరించుకోవాలని పెద్దలు చెబుతున్నారు.

ఒకసారి వండిన పదార్థాలను మరోసారి వేడి చేసి తినకూడదు. స్త్రీలు చేతులకు గాజులు లేకుండా భోజనాన్ని తినటం, ఇతరులకు వడ్డించటం వంటివి చేయకూడదు. చొట్టలు పడిన కంచంలో, పగిలిన కంచంలో భోజనం చేయరాదు. అరటి ఆకులలో భోజనం చేయడం ఉత్తమమని మన పూర్వికులు చెబుతున్నారు. నిలబడి భోజనాన్ని అస్సలు చేయకూడదు. ఇలా చేయడం వల్ల దరిద్రదేవత పడుతుందని శాస్త్రాలు సూచిస్తున్నాయి. కంచం ముందునుండి తింటూ మధ్యలో లేవకూడదు.

మంచం మీద కూర్చొని భోజనం చేయరాదు. ఇలా తినడం వల్ల మనం తిన్న తిండి వంటికి పట్టదంటారు. ఆహారపదార్ధాలను ఉంచిన గిన్నెలను కాళ్లతో తన్నటం వంటివి చేయకూడదు. అన్నం తినే సమయంలో నీళ్ల గ్లాసు కుడివైపున ఉంచుకోవాలి. ఆహారం వండిన గిన్నెను మొత్తం ఖాళీ చేయకుండా నాలుగు మెతుకులైనా అందులో చివరకు మిగిలి ఉండేలా చూసుకోవాలి. కోపంతో భోజనాన్ని చేయటం ఆరోగ్యానికి మంచిది కాదు. అలాగే మాడిపోయిన మాడుచెక్కల అన్నాన్ని మన ఇంటికి వచ్చిన అతిథులకు వడ్డించవద్దు. భోజనం చేసిన తరువాత విస్తర్లను ఎత్తే వారికి పుణ్యం వస్తుందని శాస్త్రం చెబుతుంది. భోజనం చేసిన తరువాత నోట్లో నీటిని పోసుకుని పుక్కిలించాలి. ఇలా చేయటం వల్ల నోటి ఆరోగ్యానికి మంచి జరుగుతుంది.