Amla : ఉసిరి ఎవరు తినకూడదో తెలుసా? తింటే ఏమౌతుంది?

ఉసిరి రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. టైప్ 1 మరియు టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడుతున్న వ్యక్తులకు ఉసిరి ఉపయోగకరంగా

Amla : ఉసిరి ఎవరు తినకూడదో తెలుసా? తింటే ఏమౌతుంది?

Amla Gooseberry

Amla : శీతాకాలంలో సూపర్ ఫుడ్ లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అలాంటి వాటిల్లో ఉసిరి, జామ గురించి చెప్పవచ్చు. ఇవి యాంటీ ఆక్సిడెంట్ లను కలిగి ఉండి రోగనిరోధక శక్తి పెంపుదలకు దోహదపడతాయి. ఈ సీజన్ లో పండే ఆకుపచ్చ పండ్లలో నారింజ కంటే 20 రెట్లు ఎక్కవగా విటమిన్ సి ఉంటుంది. చల్లాని వాతావరణంలో రోగనిరోధక శక్తి పెంపుదలకు సి విటమిన్ అధికంగా కలిగిన ఉసిరి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఎన్నో ఔషదగుణాలు ఉన్నట్లు అయుర్వేద నిపుణులు చెప్తారు. అయితే ఉసిరిని తీసుకోవటం ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉన్నప్పటికీ అది అందరికీ సురక్షితం కాదు. కొన్ని ప్రత్యేక పరిస్ధితుల్లో అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఉసిరి కాయను తినకుండా ఉండటమే మంచిది.

ఉసిరిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, ఇది ఆమ్ల స్వభావానికి దోహదం చేసే పోషకం. గుండెల్లో మంట తీవ్రతను తగ్గించడానికి ఈ పండు తినడం మంచిదని అధ్యయనాలు సూచిస్తున్నాయి, అయితే హైపర్‌ యాసిడిటీతో బాధపడే వారికి సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది. హైపర్‌ యాసిడిటీ చరిత్ర కలిగిన ఉసిరిని ఖాళీ కడుపుతో తినడం వల్ల పొట్ట యొక్క పై పొరకు చికాకు కలిగించి ఎసిడిటీని పెరిగేలా చేస్తుంది.

ఉసిరి యాంటీ ప్లేట్‌లెట్ లక్షణాలను కలిగి ఉంది. అంటే రక్తం గడ్డలు ఏర్పడకుండా నిరోధించవచ్చు. సాధారణ వ్యక్తులకు, గుండెపోటు మరియు స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించడంలో దోహదపడుతుంది. కానీ ఇప్పటికే రక్త సంబంధిత రుగ్మతలతో బాధపడుతున్న వారికి ఉసిరి తినడం మంచిది కాదు. దాని యాంటీ ప్లేట్‌లెట్ లక్షణాల కారణంగా, ఇది మీ రక్తాన్ని పలుచగా మరియు సాధారణ రక్తం గడ్డకట్టడాన్ని నిరోధిస్తుంది. బ్లీడింగ్ డిజార్డర్‌తో బాధపడే వారు కూడా ఉసిరిని ఆహారంలో చేర్చుకునే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది.

శస్త్రచికిత్స చేయించుకోవాల్సిన ముందస్తుగా ఉసిరిని తీసుకోవటం మానుకోవటం ఉత్తమం. శీతాకాలపు పండును అధికంగా తినడం వల్ల రక్తస్రావం అయ్యే ప్రమాదం ఉంది. రక్తస్రావం నిరంతరంగా, దీర్ఘకాలంగా ఉంటే, ఇది కణజాల హైపోక్సేమియా, తీవ్రమైన అసిడోసిస్,అవయవాలు పనిచేయకపోవటానికి దారితీయవచ్చు. శస్త్రచికిత్సకు కనీసం 2 వారాల ముందు ఉసిరికాయ తినడం మానేయాలని వైద్యులు సూచిస్తున్నారు.

ఉసిరి రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. టైప్ 1 మరియు టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడుతున్న వ్యక్తులకు ఉసిరి ఉపయోగకరంగా ఉన్నప్పటికీ, రక్తంలో చక్కెర స్థాయిని కలిగి ఉన్నవారికి, యాంటీ-డయాబెటిక్ మందులు తీసుకునే వారికి ఇది మంచిది కాదు. కాబట్టి, డయాబెటిక్ రోగులు యాంటీ-డయాబెటిక్ మందులతో కలిపి ఉసిరిని తీసుకోవటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని ఎప్పటికప్పుడు పరిశీలించటం మంచిది.

ఉసిరిలో అనేక పోషక విలువలు పుష్కలంగా ఉన్నాయి, మరొక వాస్తవం ఏమిటంటే, దీనిని అధికంగా తీసుకోవడం వల్ల కడుపు నొప్పి, విరేచనాలు మరియు డీహైడ్రేషన్ వంటి సమస్యలకు దారితీయవచ్చు. ఈ లక్షణాలు గర్భిణీ లేదా పాలిచ్చే స్త్రీలకు ఇబ్బందిని కలిగిస్తాయి. చనుబాలివ్వడం , గర్భధారణ సమయంలో ఉన్నవారు ఉసిరి తినడం హానికరం అనే దాని సరైన సమాచారం లేకపోయినా అలా తినేముందే వైద్యుల సలహా తీసుకోవటం మంచిది.

పొడి చర్మం కలిగిన వారు ఉసిరికాయను ఎక్కువగా తినడం వల్ల సమస్య మరింత తీవ్రమవుతుంది. ఇది జుట్టు రాలడం, దురద, చుండ్రు ఇతర జుట్టు సంబంధిత సమస్యలకు దారితీస్తుంది. పండ్లలోని కొన్ని సమ్మేళనాలు కూడా నిర్జలీకరణానికి దారితీయవచ్చు. కాబట్టి, ఉసిరికాయను తీసుకున్న తర్వాత ఎక్కువ నీరు త్రాగటం మంచిది.