Brain stroke: బ్రెయిన్ స్ట్రోక్ ఎందుకు వస్తుందో తెలుసా?

ముఖం ,కాళ్లు , చేతులు మొద్దుబారిపోవడం అనేది సాధారణమైన విషయం అయినప్పటికీ, ఒకసారి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముందు కూడా ఇలా జరుగుతుంది.

Brain stroke: బ్రెయిన్ స్ట్రోక్ ఎందుకు వస్తుందో తెలుసా?

Brain Strok

Brain Stock : బ్రెయిన్ స్ట్రోక్ లేదా పక్షవాతం. ఇది రావడానికి అనేక కారణాలు ఉంటాయి. ప్రధానంగా మారుతున్న జీవనశైలి, జంక్‌ఫుడ్స్, ఒత్తిడి, ధూమపానం, మద్యపానం, స్థూలకాయం, మధుమేహం, హైబీపీ వంటి కారణాలతో ఎక్కువ మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన తర్వాత కూడా సకాలంలో సరైన చికిత్స అందిస్తే మరణించే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అధిక ఒత్తిడి, మానసిక ఆందోళన నిద్రలేమి, ఆర్థిక ఇబ్బందులు ఇలా ఎన్నో కారణాల వల్ల మనిషి ఎన్నో రోగాల బారిన పడుతున్నాడు..ఇలా ఎన్నో కారణాలకు అధికంగా దెబ్బతినేది అవయవం మెదడు. దీనికి కూడా విశ్రాంతి అవసరం. మెదడు పనితీరు మందగిస్తుంటే ముప్పువాటిల్ల బోతుందన్న విషయాన్ని గ్రహించాలి.

రక్త సరఫరా మెదడులో ఉన్న కొన్ని భాగాలకు ఆగిపోవడంతో వచ్చే ప్రమాదమే బ్రెయిన్ స్ట్రోక్. ఇక కణాల్లోకి ఆక్సిజన్ సరఫరా నిలిచి పోవడం కారణంగా ఇలా జరిగే ప్రమాదం ఉంటుందని వైద్యులు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంటుంది.. పక్షవాతం సమస్యలను ముందే పసిగడితే ప్రమాదం నుంచి ప్రాణాలను కాపాడుకోవచ్చు. సకాలంలో పక్షవాతానికి గురైన వారికి వైద్యాన్ని అందించగలిగితే వారిని ప్రాణాపాయం నుండి రక్షించవచ్చని వైద్య నిపుణులు చెప్తున్నారు.

ముఖం ,కాళ్లు , చేతులు మొద్దుబారిపోవడం అనేది సాధారణమైన విషయం అయినప్పటికీ, ఒకసారి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముందు కూడా ఇలా జరుగుతుంది.. ఒక సైడ్ మాత్రమే కాళ్లు ,చేతులు, ముఖం అన్నీ కూడా మొద్దుబారడం జరుగుతుంది .కంటిచూపులో కూడా తేడా వస్తుంది. ముఖ్యంగా బ్రెయిన్ స్ట్రోక్ సమస్య ఆడవాళ్ళ లోనే ఎక్కువగా ఉంటుందట. మెదడు వెనుక భాగంలో నొప్పిగా అనిపించడం ,ఒక్కోసారి స్పృహ కూడా కోల్పోవడం లాంటివి జరుగుతాయి.

శ్వాస తీసుకునేటప్పుడు ఛాతి నొప్పి, శ్వాస సమస్యలు కనిపిస్తాయి . మహిళలలో అయితే ఉన్నట్టుండి కొన్ని కొన్ని విషయాలు మర్చిపోవడం, అకస్మాత్తుగా వారి ప్రవర్తనలో మార్పు రావడం ,వికారం ,వాంతులు చూపు సమస్యతో పాటు భ్రమపడుతూ ఉన్నట్టు కూడా అనిపిస్తుంది. అధిక రక్తపోటుకు కూడా గురయ్యే ప్రమాదాలు ఉన్నాయని, దాని వల్ల మెదడులో రక్త సర ఫరా ఆగిపోయి ,రక్తం గడ్డకట్టే ప్రమాదం కూడా ఉందని చెబుతున్నారు. ఒక్కోసారి గర్భస్రావం జరగటం వంటివి చోటు చేసుకుంటాయి.

65 ఏళ్ళు దాటినవారికి స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువ. కుటుంబం లో ట్రాన్స్ సియంట్ ఇస్కీమిక్ ఎటాక్ రికార్డు ఉంటే కుటుంబ సభ్యులకు వచ్చే అవకాశాలు ఎక్కువ . అధిక రక్త పోటు, అధిక కొలెస్టిరాల్, క్రమబద్ధం గా గుండె కొట్టుకోకపోవడం, గుండె రక్తాన్ని సరిగా పంపించక పోవడం . గతం లో గుండె పోటు వచ్చి ఉంటే ..మధుమేహము, స్థూల కాయం, సంతాన నిరోధక మాత్రలు వాడడం, ఎక్కువ గా పొగత్రాగడం , వంటివి స్ట్రోక్ కు దారి తీయవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఏది ఏమైనా సకాలంలో వైద్యం అందిస్తే పక్షవాతానికి గురైన వారి ప్రాణాలను నిలబెట్టవచ్చు.