Boiled Egg : చలికాలంలో రోజుకో ఉడికించిన గుడ్డు తినమని నిపుణులు ఎందుకు సూచిస్తున్నారో తెలుసా?

గుడ్లలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, కోలీన్ పెద్దమొత్తంలో ఉంటాయి. గుడ్లలో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. విటమిన్ డి అనేది శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇది ఎముకల్ని పటిష్టం చేస్తుంది.

Boiled Egg : చలికాలంలో రోజుకో ఉడికించిన గుడ్డు తినమని నిపుణులు ఎందుకు సూచిస్తున్నారో తెలుసా?

boiled egg

Boiled Egg : ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో గుణాలు గుడ్డులో పుష్కలంగా ఉంటాయి. గుడ్డును చాలా మంది వివిధ రూపాల్లో ఆహారంగా తీసుకుంటారు. అయితే బాయిల్డ్ ఎగ్ అనేది మంచి ప్రత్యామ్నాయం. రోజువారిగా ఉడికించిన గుడ్డు తినటం వల్ల శరీరం ఇమ్యూనిటీ పెరుగుతుంది. పిల్లల ఎదుగుదలకు కావాల్సిన అన్ని పోషకాలురెగ్యులర్‌గా గుడ్డు తినడం వల్ల లభిస్తాయి. పోషకాహారలేమితో బాధపడేవారు రోజుకో ఉడకబెట్టిన గుడ్డుని తినమని నిపుణులు సూచిస్తున్నారు. ఉడికించిన గుడ్డు తినటం వల్ల బరువు వేగంగా తగ్గుతారు.

చలికాలంలో బాయిల్డ్ ఎగ్ తినడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఉడికించిన గుడ్డులో ఎన్నో పోషకాలు ఉంటాయి. అన్ని వయస్సుల వారు దీనిని తీసుకోవచ్చు. దీనిలో కాల్షియం, ఐరన్ శాతాలు కూడా అధికమోతాదులో ఉంటాయి. వీటితో పాటు విటమిన్ ఎ, బి5, బి12, బి2, కాల్షియం, జింక్ వంటి ఖనిజాలు, 77 క్యాలరీలు, 6 గ్రాముల ప్రోటీన్స్ ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్ తగ్గడమే కాకుండా, రక్తంలోని గ్లూకోజ్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉంటాయి. బాయిల్డ్ ఎగ్స్‌లో ఆరోగ్యకరమైన కొవ్వు ఉంటుంది. గుడ్లు రోజూ తినడం వల్ల శరీరంలో అంతర్గతంగా వేడి పెరుగుతుంది. ఫలితంగా చలినుండి రక్షించుకోవచ్చు.

గుడ్లలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, కోలీన్ పెద్దమొత్తంలో ఉంటాయి. గుడ్లలో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. విటమిన్ డి అనేది శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇది ఎముకల్ని పటిష్టం చేస్తుంది. మెదడులో సిగ్నలింగ్ వ్యవస్థను పటిష్టం చేస్తుంది. చలికాలంలో సహజంగా అధికంగా కన్పించే గుండెపోటు ముప్పు కూడా తగ్గుతుంది. ఎందుకంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. గుడ్లను లీన్ ప్రోటీన్‌తో పాటు ఎమీనో యాసిడ్స్‌కు బెస్ట్ సోర్స్. తక్కువ కేలరీలతో పాటు బరువు తగ్గించడంలో దోహదపడతాయి.

థైరాయిడ్‌ని తగ్గించడంలో కూడా గుడ్డులోని ప్రోటీన్స్ మేలు చేస్తాయి. విటమిన్ ఎ జ్ఞాపకశక్తిని పెంచుతుంది. కంటి సమస్యలతో బాధపడేవారికి గుడ్డుకి చక్కని ఆహారం.. దీనిలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా లివర్ ఆరోగ్యానికి చాలా మంచిది.

అయితే ఉడికించిన గుడ్లు చల్లబడిన వెంటనే ఫ్రిజ్‌లో ఉంచుకోవాలి. ఉడికించిన గుడ్లను 5 నుంచి 7 రోజుల వరకు నిల్వ ఉంచవచ్చు. ఉడికించిన గుడ్లను వెంటనే తినకపోతే, వాటిపై ఉన్న పొరను తొలగించకుండా ఉండాలి. తినాలనుకున్నప్పుడు మాత్రమే పొట్టుతొలగించుకోవాలి. ఇలా చేస్తే గుడ్డుపై ఎలాంటి బ్యాక్టీరియా సోకదు. ఒకవేళ గుడ్లను ఉడికించేటప్పుడు పై పెంకు పగిలితే మాత్రం వాటిని వెంటనే తినాలి. నిల్వవుంచి తినటం మంచిదికాదు.