Kidney Stones : కిడ్నీలో రాళ్లు ఎందుకు ఏర్పడతాయో తెలుసా?

ఒకసారి కిడ్నీలో రాళ్లు ఏర్పడితే కొన్ని సందర్భాల్లో వాటంతటవే కరిగిపోయి పండిపోతుంటాయి. అయితే కొన్ని సందర్భాల్లో మూత్రనాళానికి అడ్డంకిగా మారి ఇబ్బందికరమైన పరిస్ధితికి దారి తీస్తాయి.

Kidney Stones : కిడ్నీలో రాళ్లు ఎందుకు ఏర్పడతాయో తెలుసా?

Kidney Stone

Kidney Stones : మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడటానికి అనేక కారణాలు ఉన్నాయి. జన్యుపరంగా, ఇన్ ఫెక్షన్ల కారణంగా, ఇతర వ్యాధులకోసం వాడుతున్న మందుల వల్ల , ఆహారపు అలవాట్లతో రాళ్లు ఏర్పడతాయి. అయితే ఎక్కవ శాతం తీసుకునే ఆహారం వల్లనే రాళ్లు రావటానికి అవకాశం ఉంటుంది. శరీరంలో కాల్సియం ఆక్సలేట్ శాతం పెరిగినప్పుడు అది స్పటికంలా మారుతుంది. ఇవి మూత్రపిండాల్లో గాని, మూత్రనాళంలో గాని చేరి మూత్రానికి అడ్డుపడతాయి. దీని వల్ల విపరీతమైన నడుంనొప్పి, మూత్రంలో మంట వస్తుంది. ఈ సమస్య మహిళల్లో కన్నా పురుషుల్లోనే ఎక్కవగా ఉంటుంది. రాళ్లు కారణంగా తలెత్తే బాధ వర్ణించటం చాలా కష్టం.

ఒకసారి కిడ్నీలో రాళ్లు ఏర్పడితే కొన్ని సందర్భాల్లో వాటంతటవే కరిగిపోయి పండిపోతుంటాయి. అయితే కొన్ని సందర్భాల్లో మూత్రనాళానికి అడ్డంకిగా మారి ఇబ్బందికరమైన పరిస్ధితికి దారి తీస్తాయి. ఆసమయంలో వైద్యుల సూచన మేరకు వాటిని తొలగించటం మినహా మరో మార్గం ఉండదు. అయితే ఒకసారి కిడ్నీలో రాళ్లను తొలగిస్తే తిరిగి మళ్లీ ఏర్పడటానికి అవకాశం ఉంటుంది.

కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా చూసుకోవాలంటే ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంది. రోజు వారీగా తగినంత నీరు శరీరానికి అందించాలి. అప్పుడే కిడ్నీలు ఆరోగ్యంగా ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉంటాయి. రోజుకు 8 నుండి 10 గ్లాసుల నీరు తీసుకోవటం వల్ల మూత్ర విసర్జన సాఫీగా ఉంటుంది. మూత్రం లేత పసుపురంగులో ఉంటే సరిపడా నీరు తీసుకుంటున్నట్లుగా భావించాలి. అలాకాకుండా డార్క్ యెల్లో కలర్ లో ఉంటే మాత్రం నీరు సరిగా తాగటం లేదని అర్ధం.