Mosquitoes : దోమలు మనుషుల రక్తాన్ని ఎందుకు తాగుతాయో తెలుసా!

దోమలు కుట్టటానికి సంబంధించి మనుషుల్లో కొన్ని లక్షణాలు కలిగిన వారినే ఎక్కవగా కుడుతుంటాయని పలు పరిశోధనల్లో తేలింది. దోమలు సైతం గ్రహణ శక్తిని కలిగి ఉంటాయి. కార్బన్ డై ఆక్సైడ్ అంటే

Mosquitoes : దోమలు మనుషుల రక్తాన్ని ఎందుకు తాగుతాయో తెలుసా!

Mosquitoes

Mosquitoes : మనుషుల రక్తాన్ని పీల్చి వివిధ వ్యాధులకు కారణమవుతాయి దోమలు. వీటి జీవితకాలం రెండువారాలు. నీరు నిల్వ ఉండే ప్రాంతాలు, చెత్తా చెదారం ఉండే చోట్ల దోమల వృద్ధి అధికంగా ఉంటుంది. దోమల్లో కొన్ని రకాల దోమలు మాత్రమే వ్యాధులను వ్యాప్తి చేస్తుంటాయి. క్యూలెక్స్, అనాఫిలస్,ఏడిస్ జాతుల దోమలు కుడితే వివిధ రకాల జబ్బులు వస్తాయి.

మగ,ఆడ దోమల్లో మగదోమలు మనుషులను కుట్టవు. ఇవి చెట్ల రసాలపై అధారపడి జీవిస్తుంటాయి. ఆడదోమలే మనిషిని కుట్టి రక్తాన్ని పీలుస్తుంటాయి. ఆడదోమలు కుట్టేందుకు అనుకూలంగా ఉండే ముఖాన్ని కలిగి ఉంటాయి. ఆ తరహా ఆకారాన్ని కలిగి ఉండటం వల్లే అవి మనుషుల రక్తాన్ని ఈజీగా తాగగలుగుతాయి. మనుషుల నుండి సేకరించిన రక్తం వీటికి ఆహారం కాదు. అయితే ఈ రక్తంతో దోమలు గుడ్లు పెట్టేందుకు అవసరమైన ప్రొటీన్ ను తయారు చేసుకునేందుకు ఉపయోగించుకుంటాయి. రక్తం కోసం కుట్టుని సందర్భంలో మనుషులకు వ్యాధులు వ్యాప్తి చేస్తుంటాయి.

దోమలు కుట్టటానికి సంబంధించి మనుషుల్లో కొన్ని లక్షణాలు కలిగిన వారినే ఎక్కవగా కుడుతుంటాయని పలు పరిశోధనల్లో తేలింది. దోమలు సైతం గ్రహణ శక్తిని కలిగి ఉంటాయి. కార్బన్ డై ఆక్సైడ్ అంటే దోమలుకు అమితమైన ఇష్టం, ఎకువగా సిఓ2 వదిలేవాళ్ళ చుట్టూ దోమలు మూగుతుంటాయి. శరీరం నుండి ఎక్కవ వేడి ఉత్పత్తి అయ్యేవారు, శ్వాసలో లాక్టిక్ ఆసిడ్ వాసన కలిగి ఉన్న వాళ్ళ చుట్టూ తిరుగుతుంటాయి.

దోమలు కుట్టే సమయంలో ఒక విధమైన రసాయనాన్ని మనకు నొప్పి, జిల తెలయకుండా విడుదల చేస్తుంటాయి. అందుకే అవికుట్టే సందర్భంలో మనకు పెద్దగా నొప్పి తెలియదు. కొట్టిన కొద్ది సేపటి తరువాత దద్దుర్లు , చురుకు అనిపిస్తుంటుంది. దోమ లాలాజలంలో ఉండే యాంటీ కొయాగ్యులెంట్ కారణంగా ఈ దద్దుర్లువంటి రియాక్షన్లు వస్తాయి. ఇలాంటి దద్దుర్లు వచ్చిన సందర్భంలో గ్రీన్ టీ బ్యాగును తడిపి కుట్టిన చోట ఉంచటం వల్ల కొంత ఉపసమనం ఉంటుంది. తులసి ఆకుల రసం, యాంటీ హిస్టైమైన్ క్రీమ్ లను పూయవచ్చు.

వీలైనంత దోమలు పరిసర ప్రాంతాల్లో అవాసం ఏర్పాటు చేసుకోకుండా చూసుకోవాలి. శరీరం మొత్తం కప్పే దుస్తులను ధరించటం మంచిది. చెత్త కుండీలు, నీటితో నిల్వవుండే కుంటలు వంటివి లేకుండా చేసుకోవటం మంచిది. ఈ ప్రదేశాలు దోమలకు ఆలవాలంగా ఉంటాయి. ఇంట్లో దోమలు లేకుండా చూసుకోవాలి. వీటి నుండి రక్షణ కోసం దోమతెరలు, మస్కిటో కాయిల్స్ వంటి వాటిని ఉపయోగించుకోవచ్చు.