Reasons For Pimples : మగువల సౌందర్యాన్ని దెబ్బతీసే మొటిమలు అసలు ఎందుకొస్తాయో తెలుసా?

నూనె ఎక్కువ‌గా ఉన్న ఆహారం తీసుకుంటే మొటిమ‌లు ఎక్కువగా వస్తాయి. నూనె ఎక్కువ‌గా ఉన్న ప‌దార్థాలు మ‌న శ‌రీరంలో ఇన్సులిన్ స్థాయుల‌ను పెంచుతాయి. ఇన్సులిన్ మ‌న చర్మంపై నూనెలు ఎక్కువ‌గా విడుద‌ల‌య్యేలా చేస్తుంది.

Reasons For Pimples : మగువల సౌందర్యాన్ని దెబ్బతీసే మొటిమలు అసలు ఎందుకొస్తాయో తెలుసా?

Reasons For Pimples :

Reasons For Pimples : మొటిమలు అనేవి మహిళల్లోనే కాదు పురుషుల్లోను వస్తాయి. అయితే ముఖ్యంగా మహిళల్లో మొటిమలు రావటం వల్ల ముఖ సౌందర్యం దెబ్బతింటుంది. మొటిమలు శరీరంలో ముఖంతోపాటు ఇతర ప్రాంతాల్లో కూడా రావచ్చు. చర్మం నుండి విడుదలయ్యే నూనెలు, మృతచర్మంతో స్వేదరంధ్రాలు మూసుకుపోతాయి. దీని వల్ల మొటిమలు ఎక్కువగా వస్తాయి. మ‌రికొన్ని సార్లు మ‌న హార్మోన్ల అస‌మ‌తౌల్య‌త వ‌ల్ల‌ మొటిమ‌లు ఏర్ప‌డుతుంటాయి.

కాలుష్యం కూడా మొటిమ‌ల‌కు ప్ర‌ధాన కార‌ణ‌మే. అయితే ఇది నేరుగా మ‌న మొటిమ‌ల‌కు కార‌ణం కాకపోయినా ఇందులోని విష‌ప‌దార్థాలు చ‌ర్మం పాడ‌య్యేందుకు కార‌ణ‌మ‌వుతాయి. ఇవి మ‌న చ‌ర్మంపై ఉన్న స‌హ‌జ నూనెలను త‌గ్గించి.. ర‌క్ష‌ణ పొర‌ను దెబ్బతీస్తాయి. దుమ్మూ, ధూళి మ‌న చ‌ర్మంపై చేరి చ‌ర్మ‌రంధ్రాల‌ను త్వ‌ర‌గా మూసుకుపోయేలా చేస్తాయి. దీంతో మొటిమ‌లు అధికంగా వస్తాయి.

నూనె ఎక్కువ‌గా ఉన్న ఆహారం తీసుకుంటే మొటిమ‌లు ఎక్కువగా వస్తాయి. నూనె ఎక్కువ‌గా ఉన్న ప‌దార్థాలు మ‌న శ‌రీరంలో ఇన్సులిన్ స్థాయుల‌ను పెంచుతాయి. ఇన్సులిన్ మ‌న చర్మంపై నూనెలు ఎక్కువ‌గా విడుద‌ల‌య్యేలా చేస్తుంది. అన్నం, బ్రెడ్‌, చ‌క్కెర వంటివి తగ్గించి పండ్లు, కూర‌గాయ‌లు, ముడి ధాన్యాలు ఎక్కువ‌గా తీసుకోవాలి. చ‌ర్మం ఆరోగ్యంగా ఉండాలంటే పిజ్జా బ‌దులు స‌లాడ్లు తీసుకోవటం మంచిది.

హార్మోన్ల స్థాయుల్లో మార్పుల‌ను బ‌ట్టి మొటిమ‌లు వచ్చే అవకాశం ఉంటుంది. శ‌రీరంలో ఆండ్రోజ‌న్ స్థాయులు ఎక్కువైన‌ప్పుడు మొటిమ‌లు ఎక్కువ‌గా వస్తాయి. రుతుక్ర‌మం, మెనోపాజ్ స‌మ‌యంలోనూ హార్మోన్ల‌లో మార్పుల వ‌ల్ల మొటిమ‌లు వచ్చే అవకాశాలు అధికం. ఒత్తిడి ఎక్కువైన‌ప్పుడు మ‌న చ‌ర్మంలో స్వేద‌గ్రంథులు ఉత్తేజిత‌మై ఎక్కువ‌గా నూనెల‌ను విడుద‌ల చేస్తాయి. దీని వల్ల సైతం మొటిమలు వచ్చే అవకాశం ఉంటుంది.