Poisonous Food Items : రోజూ తినే ఆహార పదార్థాలు కొన్ని సార్లు విషపూరితంగా మారే ప్రమాదం.. ఎందుకో తెలుసా?

యాపిల్ పండులో ఉండే గింజలు అమిగ్డాలిన్ అనే పదార్ధాన్ని కలిగి ఉంటాయి, అవి జీర్ణ ఎంజైమ్‌లను తాకినప్పుడు సైనైడ్‌ను విడుదల చేస్తాయి. యాపిల్ గింజల్లో కిలోకు 700 మిల్లీగ్రాముల సైనైడ్ ఉంటుంది. మరియు ఇది మానవ శరీరానికి చాలా ప్రమాదకరం.

Poisonous Food Items : రోజూ తినే ఆహార పదార్థాలు కొన్ని సార్లు విషపూరితంగా మారే ప్రమాదం.. ఎందుకో తెలుసా?

Poisonous Food Items :

Poisonous Food Items : బంగాళాదుంపలు, టమోటాలు మరియు బాదంపప్పులో మానవ శరీరానికి తీవ్రమైన హాని కలిగించే విషపూరితమైన పదార్ధం ఉందన్న మీకు తెలుసా? ప్రతిరోజూ మనం చాలా ఆహార ఉత్పత్తులను మార్కెట్లో కొనుగోలుచేసి వాటిలో ఏమేమి ఉన్నాయో ఆలోచించకుండా వంటకు తరిగిపెట్టుకుంటాము. పండ్లు మరియు కూరగాయలు ఆరోగ్యానికి మంచివన్న విషయం అందరికి తెలుసు. అయితే కొన్ని సందర్భాల్లో అవి కూడా విషపూరితమైనవిగా మారే అవకాశాలు ఉంటాయని చాలా మందికి తెలియదు. అంతేకాదు కొన్నపర్యాయాలు తీవ్ర నష్టం కలిగించడమే కాక ప్రాణాల మీదకు తీసుకువస్తాయి.

మనం ఆహార పదార్థాలు తీసుకునే మందు అవి ఆరోగ్యానికి ఎంత వరకు మేలు చేస్తున్న విషయం తెలుసుకోవడం ఎంతో అవసరం. అంతే కాదు తీసుకునే పదార్థాలు సరైన విధంగా ఉడికించకపోయినా ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

READ ALSO : Ignoring Social Media : రోజులో కేవలం 15 నిమిషాలు సోషల్ మీడియాను దూరంపెడితే మీ ఆరోగ్యం మెరుగుపడటం ఖాయం !

బంగాళాదుంప ; గ్లైకోఅల్కలాయిడ్స్ అనేది బంగాళాదుంపల ఆకులు, కాండం మరియు మొలకలలో కనిపించే విషపూరిత రసాయన సమ్మేళనం. బంగాళాదుంపను ఎక్కువసేపు కాంతిలో ఉంచినట్లయితే అది పెరుగుతుంది. గ్లైకోఅల్కలాయిడ్స్ తినడం వల్ల తిమ్మిరి, విరేచనాలు, తలనొప్పి, కోమా, చివరకు మరణం సంభవించవచ్చు. ఆకుపచ్చవర్ణం కలిగిన బంగాళాదుంపలను తినకుండా నివారించడం మంచిది.

టమోటో ; భారతీయులు ఎక్కువగా ఇష్టపడే పండు. దీనిని తప్పనిసరిగా కూరల తయారీలో వినియోగిస్తారు ఈ బెర్రీ పండు టొమాటో మొక్క ఆకులు మరియు కాండం కూడా గ్లైకోఅల్కలాయిడ్‌ను కలిగి ఉంటాయి. ఇది విపరీతమైన భయాన్ని మరియు కడుపు నొప్పిని కలిగిస్తుంది.

జీడిపప్పు : సూపర్ మార్కెట్లలో లభించే జీడిపప్పుల్లో నిజానికి ఉరుషియోల్ అనే విష పదార్థంతో కూడి ఉంటాయి. ఈ రసాయనం చర్మంపై చికాకు, దద్దుర్లు కలిగించే పాయిజన్ వలె ప్రభావాన్ని కలిగిస్తుంది. ఉరుషియోల్ యొక్క అధిక స్థాయిలు ప్రాణాంతకమనే చెప్పాలి.

ఎల్డర్ బెర్రీ ; ఎల్డర్‌బెర్రీని ఔషధ సిరప్‌లు, సోడాలలో ఉపయోగిస్తారు. ఎల్డర్‌బెర్రీ చెట్టు యొక్క వేర్లు , కొన్ని ఇతర భాగాలు చాలా విషపూరితమైనవి. తీవ్రమైన కడుపు సమస్యలను కలిగిస్తాయి. వాటిలో గ్లైకోసైడ్స్ అనే రసాయన పదార్ధం ఉంటుంది, ఇది ప్రాసెస్ చేయబడినప్పుడు, సైనైడ్‌గా మారుతుంది.

READ ALSO : Millets : బరువు తగ్గటంతోపాటు ఆరోగ్యంగా ఉండాలన్నా తృణధాన్యాలే బెస్ట్!

చేదు బాదం ; కొన్ని రకాలైన బాదం గింజలు విషపూరితమైనవి. ఎందుకంటే అవి సైనైడ్తో నిండి ఉంటాయి. విషాన్ని తొలగించడానికి వాటిని ప్రాసెస్ చేయడం మంచిది. విషపూరితమైన కారణంగా న్యూజిలాండ్‌లో చేదు బాదం అమ్మకం చట్టవిరుద్ధం. అందులో కొద్ది మొత్తంలో ఉండే అమిగ్డాలిన్ ఉంటుంది. దీనిని శరీరం లోకి తీసుకున్నప్పుడు సైనెడ్ గా మారిపోతుంది
జాజికాయ

యాపిల్ ; యాపిల్ పండులో ఉండే గింజలు అమిగ్డాలిన్ అనే పదార్ధాన్ని కలిగి ఉంటాయి, అవి జీర్ణ ఎంజైమ్‌లను తాకినప్పుడు సైనైడ్‌ను విడుదల చేస్తాయి. యాపిల్ గింజల్లో కిలోకు 700 మిల్లీగ్రాముల సైనైడ్ ఉంటుంది. మరియు ఇది మానవ శరీరానికి చాలా ప్రమాదకరం.

READ ALSO : మీ కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహారాలు తీసుకుంటే మేలు!

తేనె ; తేనెటీగల నుండి నేరుగా తేనె తీసుకోవటం మానవ శరీరానికి నిజంగానే ప్రమాదకరం. ముడి తేనె పాశ్చరైజేషన్ ప్రక్రియ జరిగితే, దీనిలో హానికరమైన టాక్సిన్లు చంపబడతాయి. పాశ్చరైజ్ చేయని తేనెలో గ్రేయనోటాక్సిన్ ఉంటుంది, ఇది మైకము, బలహీనత, అధిక చెమట, వికారం మరియు వాంతికి దారితీస్తుంది.

గమనిక ; అందుబాటులో ఉన్న వివిధ మార్గాల ద్వారా ఈ సమచారం సేకరించి అందించటమైనది. కేవలం అవగాహన కోసం మాత్రమే. వివిధ ఆరోగ్య సమస్యలు ఉన్న వారు వైద్యుల సూచనలు, సలహాలు పాటించటం మంచిది.