Head Bath : రాత్రి సమయంలోనే తలస్నానం ఎందుకు చేయాలో తెలుసా?

ఉదయం తలస్నానం చేస్తే.. ఎండలో ఆరబెట్టుకోవడం వల్ల జుట్టు మీరు కోరుకున్నంత ఎట్రాక్టివ్ గా కనిపించదు. ఒకవేళ మీరు రాత్రిళ్లు జుట్టుని శుభ్రం చేస్తే డ్రై చేసుకోవడానికి ఎక్కువ సమయం దొరుకుతుంది.

Head Bath : రాత్రి సమయంలోనే తలస్నానం ఎందుకు చేయాలో తెలుసా?

Head Bath At Night

Head Bath : జుట్టు విషయంలో చాలా మంది తగిన జాగ్రత్తలు పాటిస్తుంటారు. ఇందుకోసం వారంలో రెండు మూడు సార్లైనా తలస్నానం చేస్తుంటారు. తద్వారా జట్టును శుభ్రం చేసుకుంటారు. అయితే చాలా మంది తలస్నానం ఉదయం సమయంలో చేయడానికే ఎక్కువ ప్రాధాన్యత అయితే జుట్టుని ఉదయం కంటే రాత్రి సమయంలో శుభ్రం చేసుకోవడమే మంచిదని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఉదయం తలస్నానం చేయడం అనేది కాస్త ఇబ్బందికరమైనది. ఎందుకంటే తలస్నానం చేయాలంటే కాస్త త్వరగా నిద్రలేవాలి. కొన్నిసార్లు వాతావరణం లో మార్పులు వస్తే ఉదయం నిద్రలేవడం కష్టమవుతుంది. అయితే రాత్రిళ్లు తలస్నానం చేయడం వల్ల అనేక ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

రాత్రిపూట తలస్నానం చేయడం వల్ల ఎక్కువ సమయం దొరుకుతుంది. దీనివల్ల ఎక్కువ శ్రద్ధగా, శుభ్రంగా తలను క్లీన్ చేసుకుంటారు. రాత్రిళ్లు తలస్నానం చేయడం వల్ల స్కాల్ప్ న్యాచురల్ ఆయిల్స్ ని కోల్పోకుండా ఉంటుంది. దీనివల్ల ఎక్కువ డ్రైగా కనిపించకుండా ఉంటుంది. రాత్రిళ్లు తలస్నానం చేస్తే జలుబు చేస్తుందని చాలామంది భావిస్తారు. కానీ రాత్రిపూట తలస్నానం వల్ల హాయిగా నిద్రపోతారు. ఉదయం తలస్నానం చేసిన వెంటనే ఎండకు బయటకు వెళ్లడం వల్ల జుట్టు బలహీనం అవుతుంది. రఫ్ గా మారుతుంది. కాబట్టి రాత్రిళ్లు తలస్నానం చేయడమే మంచిది.

హీట్ స్టైలింగ్ టూల్స్ ని తలస్నానం చేసిన వెంటనే ఉపయోగించడం మంచిది కాదు. ఈ సమయంలో జుట్టు ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. కాబట్టి రాత్రిపూట తలస్నానం చేసి.. మరుసటి రోజు ఉదయం స్టైలింగ్ టూల్స్ ఉపయోగించడం మంచిది. తలస్నానం చేసిన వెంటనే జుట్టు హెయిర్ స్టైల్స్ కి అంత సహకరించదు. తలస్నానం చేసిన వెంటనే జారిపోయే గుణం కలిగి ఉంటుంది. కాబట్టి రాత్రిళ్లు తలస్నానం చేస్తే.. ఉదయం తేలికగా జుట్టుని మీకు నచ్చినట్టు స్టైల్ చేసుకోవచ్చు.

ఉదయం తలస్నానం చేస్తే.. ఎండలో ఆరబెట్టుకోవడం వల్ల జుట్టు మీరు కోరుకున్నంత ఎట్రాక్టివ్ గా కనిపించదు. ఒకవేళ మీరు రాత్రిళ్లు జుట్టుని శుభ్రం చేస్తే డ్రై చేసుకోవడానికి ఎక్కువ సమయం దొరుకుతుంది. ఒకవేళ మీరు చాలా సెన్సిటివ్ అయి ఉండి, త్వరగా ఇన్ఫెక్షన్స్ వస్తాయని భావిస్తే.. మీరు రాత్రిళ్లు తలస్నానం చేయడమే మంచిది. ఉదయం తలస్నానం చేస్తే త్వరగా జలుబు వంటి సమస్యలు వస్తాయి.

అయితే రాత్రి వేళ‌లో తలస్నానం కోన్ని స‌మ‌స్య‌లు ఉన్నాయి. రాత్రి స‌మ‌యంలో తలస్నానం చేయడం వల్ల జుట్టు తేమగా ఉంటుంది.త‌ద్వారా చుండ్రు, జుట్టురాలడం, ఇన్ఫెక్షన్స్ వంటి సమస్యలు ఎదురవుతాయి. రాత్రి వేళ త‌ల‌స్నానం చేయ‌డం వ‌ల్ల మైగ్రేన్, తలనొప్పి వంటి సమస్యలు కూడా వస్తాయి. ఇక‌ రాత్రి వేళ‌లో త‌ల‌స్నానం చేసి తడి జుట్టుతో పడుకున్నప్పుడు జుట్టు మొత్తం ముద్దలా తయారవుతుంది. జుట్టును దువ్వ‌డం వ‌ల్ల ఎక్కువ వెంట్రుక‌లు ఊడిపోతాయి. త‌ద్వారా జుట్టు ప‌ల‌చ‌బ‌డిపోతుంది.