Eating Fish : చేపలు తింటే బరువు తగ్గుతారా!..

చేపల్లో ఉండే ఒమేగా3 ఫ్యాటీ యాసిడ్లు గుండెకు ఎంతో మేలు చేకూరుస్తాయి. కొలెస్ట్రాల్ ను తగ్గించేందుకు ఒమెగా3 ఫ్యాటీ యాసిడ్లు సహాయ కారిగా పనిచేస్తాయి.

 Eating Fish : చేపలు తింటే బరువు తగ్గుతారా!..

Fish (3)

Eating Fish : మానవ ఆహారంలో చేపలకు విశిష్టమైన స్ధానం ఉంది. చేపల్లో ఎన్నో రకాల పోషకవిలువలు ఉంటాయి. చేపల్ని తినటం ఆరోగ్యానికి ఎంతో మంచిది. శరీరానికి అవసరమయ్యే ఎనిమిది రకాల అమైనో యాసిడ్లు చేపలు తినటం ద్వారా లభిస్తాయి. ముఖ్యంగా లైసీన్, మిథియోనిన్, సిస్టీన్, గంధకం వంటి అమైనో యాసిడ్లు చేపల్లో ఉంటాయి. మిటమిన్ ఎ, డిలతోపాటు, థయామిన్, రిబోప్లేవిన్, నియోసిన్లు అధికంగా ఉంటాయి. పిల్లల మెరుగుదలకు అవసరమైన ఒమోగా3 ఫ్యాటీ యాసిడ్లు లభిస్తాయి.

చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడుతుంటారు. అధిక బరువు వల్ల అనేక అనార్ధాలు ఉన్నాయి. అనారోగ్య సమస్యలు బరువు కారణంగా చుట్టుముడుతుంటాయి. బరువును తగ్గించుకునేందుకు అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అలాంటి వారు చేపల్ని రోజు వారి ఆహారంలో భాగం చేసుకోవటం వల్ల బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుంది. రోజుకు 140 గ్రాముల చేపలను తినటం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు సమకూరుతాయి.

చేపల్లో అయోడిన్ అధికంగా ఉంటుంది. ఇది థైరాయిడ్ హార్మోన్ల సమతుల్యతకు, మెటబాలిజం పెరగటానికి దోహదం చేస్తుంది. క్యాలరీలు అధికంగా ఖర్చై కొవ్వు కరిగేందుకు దోహదపతాయి. దీని వల్ల అధిక బరువు తగ్గవచ్చు. చికెన్, మటన్ కన్నా చేపలు తినటం ఎంతో మేలు. చేపల్లో క్యాలరీలు తక్కువగానే ఉంటాయి.

చేపల్లో ఉండే ఒమేగా3 ఫ్యాటీ యాసిడ్లు గుండెకు ఎంతో మేలు చేకూరుస్తాయి. కొలెస్ట్రాల్ ను తగ్గించేందుకు ఒమెగా3 ఫ్యాటీ యాసిడ్లు సహాయ కారిగా పనిచేస్తాయి. రక్త సరఫరా మెరుగవుతుంది. త్వరగా జీర్ణం కావటంతోపాటు, ప్రొటీన్లను మంచి శక్తినిస్తాయి. కండరాల నిర్మాణానికి చేపలు సహాయపడతాయి. మధ్యవయస్సు దాటిన వారు రోజువారి ఆహారంలో చేపలను తీసుకోవటం వల్ల గుండె సంబంధిత సమస్యలను దూరంగా ఉంచవచ్చు. పక్షవాతం వంటి సమస్యల ముప్పు నుండి తప్పించుకోవచ్చని పలు అధ్యయనాల్లో తేలింది.

ఇదిలా వుంటే తాజాగా చేపల గురించి జరిపిన పలు అధ్యయనాల్లో కాన్సర్ వంటి వ్యాధులను రాకుండా చేసేందుకు చేపలు ఎంతగానో ఉపయోగపడుతున్నట్లు వెల్లడైంది. చేపల్ని అయిల్ లో ఫ్రై చేసుకుని కాకుండా పులుసులా వండుకుని తినటం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.