Bread : బ్రెడ్ అతిగా తింటున్నారా? మధుమేహం,గుండె జబ్బుల ప్రమాదం!

అంతేకాకుండా అదేపనిగా బ్రెడ్ తీనేవారిలో ట్రైగ్లిజరైడ్ స్థాయిలు పెరుగుతాయి. మధుమేహం గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి.

Bread : బ్రెడ్ అతిగా తింటున్నారా? మధుమేహం,గుండె జబ్బుల ప్రమాదం!

Bread

Bread : ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితం లో చాలా మందికి ఆహారం తయారీ సమయం దొరకటం లేదు. దీంతో చాలా మంది అల్పాహారంతోనే సరిపెట్టుకుంటున్నారు. అల్పాహారంగా ఎక్కువ మంది బ్రెడ్ ను తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. బేకరీ షాపుల్లో అందుబాటులో ఉండే బ్రెడ్ తో అల్పాహారం ముగించేస్తూ కాలం గడిపేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో వైట్ బ్రెడ్ ను ప్రతిరోజు ఉదయం అల్పాహారంగా తీసుకొవటం వల్ల అనేక ఆనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. వైట్ బ్రెడ్ తయారీలో ఉపయోగించే పిండి ఎక్కువగా ప్రాసెస్ చేయబడి ఉంటుంది. ఇందులో పోషక కంటెంట్ చాలా తక్కువగా ఉంటుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది.

గోధుమల పైభాగంలో మన శరీరానికి కావాల్సిన ఫైబర్ ఉంటుంది. ప్రాసెసింగ్ సమయంలో గోధుమలలో ఉండే ఫైబర్ మొత్తం పోతుంది. గోధుమలలో ఉన్న ఫైబర్ పూర్తిగా తొలగించినప్పుడు మెత్తని మైదా తయారవుతుంది. గోధుమలో ఉండే పోషకాలన్నీ తొలగిపోవటం వల్ల బ్రెడ్ లో కార్బోహైడ్రేట్లు శుద్ధి చేయడతాయి. ఇవి శరీరానికి ఏ మాత్రం ప్రయోజనకరం కావని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజూ ఉదయం బ్రెడ్ శాండ్విచ్ తో కడుపు నింపుకొనేవారు తప్పనిసరిగా వారి ఆహార విషయంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

అంతేకాకుండా అదేపనిగా బ్రెడ్ తీనేవారిలో ట్రైగ్లిజరైడ్ స్థాయిలు పెరుగుతాయి. మధుమేహం గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలలో ఆకస్మిక హెచ్చుతగ్గులు ప్రమాదకరంగా మారతాయి. సాధ్యమైనంత వరకు మధుమేహులు వైట్ బ్రడ్ తినకపోవటం ఉత్తమం. బ్రెడ్ తినేవారు త్వరగా బరువు పెరుగుతారు. బరువు తగ్గే ప్రయత్నంలో ఉన్నవారు అల్పాహారంగా బ్రెడ్ తీసుకుంటే బరువు తగ్గకపోను మరింత పెరిగే ప్రమాదం ఉంటుంది. అతిగా బ్రెడ్ తినటం వల్ల కొందరిలో డిప్రెషన్ కు దారి తీసే ప్రమాదం ఉంది. బ్రెడ్ అదేపనిగా తింటే శరీరంలో కొవ్వు పేరుకుపోవడం వల్ల గుండెపోటు ముప్పు ఉంటుంది. సాధ్యమైనంత వరకు బ్రెడ్ పూర్తిగా అవాయిడ్ చేయడం ఎంతో మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.