Spinach : పాలకూర అతిగా తింటున్నారా!..

పాలకూరలో ఆక్సాలిక్ ఆమ్లం అధికంగా ఉంటుంది. ఇది మొక్కలలో ఉండే సమ్మేళనం. ఇది శరీరంలోని అధికంగా చేరినప్పుడు ఇతర ఖనిజాలను గ్రహించే సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది.

Spinach : పాలకూర అతిగా తింటున్నారా!..

Spinach

Spinach : పోషకాలు అధికంగా కలిగిన ఆకు కూరల్లో పాలకూర ఒకటి. శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ ఈ కూరలో లభిస్తాయి. వైద్యులు సైతం పాలకూరను ఆహారంలో భాగం చేసుకోమని సిఫార్సు చేస్తుంటారు. పాలకూరలో విటమిన్ ఎ, ఫోలేట్, విటమిన్ సి, క్యాల్షియం, ఫోలిక్ ఆమ్లం, ఐరన్ వంటి ఖనిజాలు లభిస్తాయి. దీనిని ఆహారంగా తీసుకోవటం వల్ల ఆరోగ్యానికి ప్రయోజనాలు కలుగుతాయి.

పాలకూరను మితంగా తీసుకుంటే ఆరోగ్యానికి మేలు కలిగిస్తున్న మాట వాస్తమే అయినా అతిగా తింటే మాత్రం అనర్ధాలు తప్పవు. అవసరానికి మించి ఏ ఆహారమైన ప్రతికూల ప్రభావాన్నే చూపిస్తుంది. అలాగే పాలకూర కూడా అంతే. పాలకూర అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో ఆక్సాలిక్ యాసిడ్ ఎక్కువ చేరుతుంది. దీన్ని మన శరీరం నుంచి బయటికి పంపడం కష్టమవుతుంది. ఇది మూత్రపిండాల్లో కాల్షియం ఆక్సలేట్ రాళ్ల రూపంలో మారడం జరుగుతుంది.

కిడ్నీ రాళ్ల సమస్య ఉంటే మీరు పాలకూరను సరైన మోతాదులో తినాలి. అధికంగా తీసుకోకూడదు. పాలకూరలో ఆక్సాలిక్ ఆమ్లంతో పాటూ, ప్యూరిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఈ రెండు సమ్మేళనాలు ఆర్దరైటిస్‌కు కారణమౌతాయి. ఇప్పటికే కీళ్ల నొప్పులు, వాపులు, మంటతో బాధపడుతున్న వారికి పాలకూరను తీసుకోవడం వల్ల సమస్య మరింత ముదురుతుంది.

పాలకూరలో ఆక్సాలిక్ ఆమ్లం అధికంగా ఉంటుంది. ఇది మొక్కలలో ఉండే సమ్మేళనం. ఇది శరీరంలోని అధికంగా చేరినప్పుడు ఇతర ఖనిజాలను గ్రహించే సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. దీని వల్ల పోషకాహార లోపం తలెత్తవచ్చు. ఆకుపచ్చని కూరలలో హిస్టామిన్ ఉంటుంది. ఇది మన శరీరంలోని కొన్ని కణాలలో కనిపించే ఒక రసాయనం. ఇది అధికంగా శరీరంలో చేరడం వల్ల అలెర్జీ ప్రభావాన్ని ప్రేరేపిస్తుంది.

పాలకూరను ఒకేసారి అధికంగా తీసుకోవడం లేదా ఒకరోజులో విడతల వారీగా అధికంగా తినడం వల్ల శరీరంపై విషప్రభావం పడే అవకాశం ఉంది. వీటితోపాటుగా గ్యాస్, కడుపుబ్బరం, తిమ్మిరి వంటివి కలగవచ్చు. పాలకూరలో అధికంగా ఫైబర్ ఉంటుంది కాబట్టి అధికంగా తింటే పొట్ట సమస్యలు వచ్చే అవకాశం ఉంది.