Hot Milk : వేడి పాలు తాగితే నిద్రపడుతుందా?…

ఈ విషయాన్ని కనుగొనేందుకు ఎలుకలపై పరిశోధనలు నిర్వహించిన వారికి సీటీఎచ్‌లో నిద్రను పెంచే కారకాలు ఉన్నట్లు బహిర్గతమైంది. ఇతర ఎలుకలతోపోలిస్తే వేడి పాలు తాగిన ఎలుకల్లో 25 శాతం త్వరగా నిద్రపోయినట్టు సైంటిస్టులు గుర్తించారు. అంతేకాకుండా రోజువారి సమయం కన్నా ఎక్కువ సమయం నిద్రపోయినట్లు తేలింది.

Hot Milk : వేడి పాలు తాగితే నిద్రపడుతుందా?…

Milk

Hot Milk : మారుతున్న జీవన పరిస్ధితులు, ఉరుకుల పరుగుల జీవనంలో చాలా మందికి కంటి నిండా నిద్ర రాని పరిస్ధితి. ఈ క్రమంలో రాత్రి సమయంలో సుఖవంతమైన నిద్రకోసం వివిధ రకాల చిట్కాలను పాటిస్తుంటారు. అయితే అలాంటి వాటిలో పూర్వం నుండి మన పెద్దలు పాటించే చిట్కా ఒకటి రాత్రి హాయిగా నిద్రపోయేందుకు ఉపకరిస్తుందని చెప్తుంటారు. అదేంటంటే రాత్రి నిద్రబాగా పట్టేందుకు పడుకునే ముందు ఒక గ్లాసు వేడిపాలు తాగితే సరిపోతుంది. వేడిపాలు మీమ్మల్ని ప్రశాంతంగా నిద్ర పోయేలా చేస్తాయి.

చిన్నప్పుడు మన పేరెంట్స్‌ రాత్రి భోజనాలయ్యాక పసుపు కలిపిన పాలు లేదా బాదం పాలు తాగమని పోరుపెట్టేవారు. దీని వెనుకున్న రీజన్ గురించి చాలా మంది ఆలోచించి ఉండరు. పాలల్లో ఉండే పెప్టైడ్‌ అనే ప్రొటీన్‌ హార్మోన్ ఒత్తిడిని తగ్గించి, నిద్ర వచ్చేలా ప్రేరేపిస్తుందని పరిశోధనల్లో తేలింది.

అమెరికన్‌ కెమికల్‌ సొసైటీకి చెందిన అగ్రికల్చరల్‌ అండ్‌ ఫుడ్‌ కెమిస్ట్రి జర్నల్‌ ప్రచురించిన నివేదిక కూడా ఇదే విషయాన్నిస్పష్టం చేసింది. పరిశోధకులు ఎల్ జెంగ్, మౌమింగ్ జావో వారి సహోద్యోగులు దీనిపై తమ పరిశోధనలు కొనసాగిస్తున్నారు. వేడిపాలల్లో సహజంగా నిద్రకుపక్రమించేలా చేసే ప్రత్యేక పెప్టైడ్‌లను ఉండవచ్చని వీరు బావిస్తున్నారు.

ఈ విషయాన్ని కనుగొనేందుకు ఎలుకలపై పరిశోధనలు నిర్వహించిన వారికి సీటీఎచ్‌లో నిద్రను పెంచే కారకాలు ఉన్నట్లు బహిర్గతమైంది. ఇతర ఎలుకలతోపోలిస్తే వేడి పాలు తాగిన ఎలుకల్లో 25 శాతం త్వరగా నిద్రపోయినట్టు సైంటిస్టులు గుర్తించారు. అంతేకాకుండా రోజువారి సమయం కన్నా ఎక్కువ సమయం నిద్రపోయినట్లు తేలింది.

మంచి పెప్టైడ్‌తో పాటు, ఇతర మార్గాల ద్వారా నిద్రను పెంచే సిటీహెచ్ లోని ఇతర కారకాలను అన్వేషించే పనిలో పరిశోధకులున్నారు. కాబట్టి రాత్రి సమయంలో నిద్రపట్టని వారు ఇకపై రాత్రి పడుకోబోయే ముందు ఒక గ్లాసు వేడిపాలు తాగితే సుఖంగా, ప్రశాంతంగా, హాయిగా నిద్రపోవచ్చు. అయితే ఒక్కో సారి ఇతర ఆరోగ్యసమస్యల వల్ల కూడా నిద్ర పట్టకపోవచ్చు అలాంటి సందర్భాల్లో వైద్యుల వద్దకు వెళ్ళి వైద్య సహాయం పొందటమే మేలు.