Gaining Fat : బక్కగా ఉన్నామని బాధపడుతున్నారా?…బలంగా మారాలంటే?..

శిలాజిత్యాదియోగం ఔషధాన్ని రోజూ తీసుకొంటుంటే వివిధ దోషాలు తగ్గి శరీరంలో రక్తం పెరుగుతుంది. బాగా ఎండిన దాల్చిన చెక్కని మెత్తగా దంచి ఒక సీసాలో భద్రపరుచుకోండి.

Gaining Fat : బక్కగా ఉన్నామని బాధపడుతున్నారా?…బలంగా మారాలంటే?..

Less Wieght

Gaining Fat : సన్నగా బక్కపలచగా ఉన్నవారు కాస్త లావెక్కలని ప్రయత్నిస్తుంటారు. అదే క్రమంలో లావెక్కిన వారు సన్నగా నాజుగ్గా తయారవ్వాలని కోరుకుంటుంటారు. అయితే కొందరి శరీతత్వం కారణంగా ఎంతా తిన్నా కూడా లావెక్కలేకపోతుంటారు. కొంతమందికి జన్యుపరమైన కారణాల వల్ల కూడా బరువు పెరగడం కష్టం అవుతుంది. థైరాయిడ్‌ సమస్య ఉన్నా, బరువు తక్కువగా ఉంటారు. తీసుకునే ఆహారం సరిగా వంటబట్టకపోయినా బరువు పెరగడం కష్టం. కొన్ని రకాల పరీక్షల ద్వారా అసలు సమస్యను కనిపెట్టవచ్చు. అయితే కొన్ని రకాల ఆయుర్వేద చిట్కాలను పాటిస్తే చిక్కిపోయి సన్నబడ్డ వారు లావెక్కే అవకాశం ఉంటుంది.

ఆకలి బాగా పెరిగేందుకు ఆల్లం, శొంఠి లాంటివాతిని వాడాలి. ఇలా చేయటం వల్ల సన్నగా ఉండే వారిలో ఆకలి బాగా పెరుగుతుంది. తద్వారా లావుగా తయారవ్వవచ్చు. రాత్రిపూట వేడి అన్నంలో పాలు పోసి తోడుపెట్టి ఉదయాన్నే తీసుకొంటూ ఉంటే చిక్కిపొతున్నవారు బలం పుంజుకొంటారు. శరీరంలో వేడి తగ్గుతుంది. ధనియాలు, జిలుకర, శొంఠి ఈ మూడింటినీ సమానంగా తీసుకొని మెత్తగా దంచి రోజు అన్నంలో నంజుకొంటూ తింటే తేలికగ అరుగుతుంది. ఆకలి బాగా పెరుగుతుంది.

శిలాజిత్యాదియోగం ఔషధాన్ని రోజూ తీసుకొంటుంటే వివిధ దోషాలు తగ్గి శరీరంలో రక్తం పెరుగుతుంది. బాగా ఎండిన దాల్చిన చెక్కని మెత్తగా దంచి ఒక సీసాలో భద్రపరుచుకోండి. గుమ్మపాలు లేదంటే మామూలు పాలు పచ్చివి తీసుకుని కాగబెట్టాలి ,ఒక గ్లాసు పాలలో ఒక చెంచా దాల్చిన చెక్క పొడిని కలిపి పంచదార వేసుకొని రోజు ఉదయం పూట తాగితే ఫలితం ఉంటుంది. ఒంట్లో వాతము ,వేడి తగ్గుతాయి. మెదడు చురుగ్గా పనిచేస్తుంది .జీర్ణశక్తిని పెంచుతుంది .శరీరం కండపట్టి పుష్టిగా ఉంటుంది.

బాదం పప్పు, పిస్తా పప్పు, జీడిపప్పు, దూలగొండి విత్తులు, జాజికాయ, జాపత్రి, అశ్వగంధ, నేలగుమ్మడి, పిల్లిపీచర వేళ్ళు, శుగంధి పల లోపల పుల్ల తీసేసిన బెరడు వీటిని సమానంగా తీసుకుని శుభ్రంచేసి మెత్తగా దంచి పొడిచేసి , చాలా కొద్దిగా పచ్చకర్పూరం కలిపి సీసాలో భద్రపరచుకోవాలి. చెంచా పొడిని పాలలో కలిపి రోజు రెండు పూటలా తాగిస్తే బక్కపలచగా ఉన్నవారు శక్తి పుంజుకుంటారు. ఎండిపోయిన పిల్లిపీచర వేళ్ళు దంచిన పొడిని చెంచా మోతాదులో తీసుకొని పాలలోవేసి పంచదార కలిపి తాగాలి. ఇలా చేస్తే బలంగా తయారయ్యే అవకాశాలు ఉంటాయి.

శరీర సౌష్టవానికి సోయా ఉత్పత్తులు, నువ్వులు, అవిసె గింజలు తీసుకుంటే మంచిది. ముఖవర్చస్సు కోసం తాజా పండ్లు తినడం, రెండు లీటర్ల నీళ్లు తాగడం అవసరం. వెన్న తీయని పాలు, మీగడ తీయని పెరుగు ముప్పావు లీటరు వరకు ప్రతిరోజు తీసుకోవటం వల్ల బలంగా మారతారు. రోజుకు పిడికెడు బాదం, పిస్తా, ఆక్రోట్‌, వేరుశెనగ గింజలు తిన్నా మంచి ఫలితం ఉంటుంది.