Heat Boils : వేసవిలో సెగ గడ్డలు బాధిస్తున్నాయా?

కొబ్బరి నీల్ళు, జ్యూసులు, కూరగాయల రసాలను సేవించటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇలా చేయటం వల్ల శరీరంలోని టాక్సిన్లు బయటకు వెళ్ళి పోతాయి. రక్తం శుద్ధి జరుగుతుంది.

Heat Boils : వేసవిలో సెగ గడ్డలు బాధిస్తున్నాయా?

Heat Boils

Heat Boils : వేసవి కాలంలో శరీరంలో అధిక వేడి కారణంగా శరీరంలో వివిధ ప్రాంతాల్లో సెగగడ్డలు వస్తుంటాయి. సెగ గడ్డలు వచ్చిన సందర్భంలో తీవ్రమైన నొప్పి , బాధ ఉంటుంది. చాలా మంది ఈ బాధను తట్టుకోలేక పోతుంటారు. వాస్తవానికి ఇవి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కారణంగా వస్తుంటాయి. సెగగడ్డలు రాకుండా ఉండాలంటే యాంటీ ఆక్సిడెంట్లు ఉండే పండ్లను రోజు వారీ ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల బాక్టీరియా తగ్గుతుంది. రోజుకు 3లీటర్ల మంచి నీరు తప్పనిసరిగా తాగాలి. ఇలా చేయటం వల్ల శరీరంలో ఉండే టాక్సిన్లు, విషపదార్ధాలు బయటకు పోతాయి. కొబ్బరి నీల్ళు, జ్యూసులు, కూరగాయల రసాలను సేవించటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇలా చేయటం వల్ల శరీరంలోని టాక్సిన్లు బయటకు వెళ్ళి పోతాయి. రక్తం శుద్ధి జరుగుతుంది. తద్వారా సెగగడ్డలు రాకుండా చూసుకోవచ్చు.

వేసవి కాలంలో సెగ గడ్డలు అనేవి సాదరణంగా వస్తూనే ఉంటాయి. వీటి నుండి బయటపడేందుకు వివిధ రకాల చిట్కాలను ఫాలో అవుతుంటారు. వెల్లుల్లి సెగ గడ్డలను తగ్గించటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. వెల్లుల్లిలో యాంటీబ్యాక్టీరియల్ గుణాలు ఉండటం వలన ఇన్ ఫెక్షన్ కాకుండా కాపాడుతుంది. నాలుగు వెల్లుల్లి రెబ్బలను తొక్క తీయాలి. తొక్క తీసిన వెల్లుల్లి రెబ్బలు,అరస్పూన్ వాము కలిపి మెత్తని పేస్ట్ గా చేయాలి. ఈ పేస్ట్ ని సెగ గడ్డలు ఉన్న ప్రదేశంలో రాసి పది నిమిషాలు అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

బియ్యంపిండి కూడా సెగ గడ్డలను తగ్గించటానికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఒక గిన్నెలో రెండు స్పూన్ల బియ్యంపిండి వేసి దానిలో నీటిని కలిపి పొయ్యి మీద పెట్టి ఉడికించాలి. ఈ మిశ్రమం గోరువెచ్చగా ఉన్నప్పుడూ సెగ గడ్డలపై రాయాలి.  పూర్తిగా ఆరనివ్వాలి అనంతరం చల్లని నీటితో శుభ్రం  చేసుకోవాలి. అదేవిధంగా క‌ల‌బంద జెల్‌లో కొద్దిగా ప‌సుపు క‌లిపి. గ‌డ్డ‌ల‌పై అప్లై చేయాలి. ఆరిన త‌ర్వాత చల్లని వాట‌ర్‌తో శుభ్ర ప‌రుచుకోవాలి. ఇలా చేస్తే మంచి ఫ‌లితం ఉంటుంది.

బంగాళా దుంపలలోని యాంటీ మైక్రోబయల్ మరియు యాంటీబయాటిక్ లక్షణాలు ఈ సెగ గడ్డలను నయం చేయడంలో ఎంతగానో సహాయం చేస్తాయి. బంగాళాదుంప పైతొక్కను తొలగించి, గ్రైండ్ చేసి, రసాన్ని తీయాలి. ఒక కాటన్ క్లాత్ సహాయంతో సెగగడ్డలు ఉన్న ప్రాంతంలో ఈ బంగాళాదుంప రసాన్ని రాయాలి. ఆరిపోయిన తరువాత చల్లటి నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. నానబెట్టిన మెంతులను పేస్ట్ గా చేసి ఆపేస్ట్ ను సెగ గడ్డలపై అప్లై చేయాలి. ఇలా చేయటం వల్ల గడ్డ త్వరగా పగిలిపోతుంది.  అందులో ఉండే చీము బయటకు వచ్చి ఉపశమనం కలుగుతుంది.

గమనిక: అందుబాటులో ఉన్న వివిధ మార్గాల నుండి ఈ సమాచారం సేకరించటమైనది. అవగాహన కోసం మాత్రమే అందించటం జరిగింది. సెగ గడ్డలు, ఇతర గడ్డలకు సబంధించి వైద్య సలహాలు తీసుకుని చికిత్స పొందటం మంచిది.