kidney Stones : కాఫీ తాగడం వల్ల కిడ్నీలో రాళ్లు వచ్చే ప్రమాదం పెరుగుతుందా లేదా తగ్గుతుందా?

మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడకుండా నిరోధించేందుకు పరిశోధకులు అనేక అధ్యయనాలు చేస్తున్నారు. అయితే కాఫీ తాగడానికి, మూత్రపిండాల్లో రాళ్ల సమస్య నుండి బయటపడటానికి మధ్య సంబంధాన్ని పరిశీలిస్తున్న నేపధ్యంలో ఇటీవలి అధ్యయనాల్లో కెఫీన్ వినియోగం మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా నిరోధించవచ్చని తేలింది.

kidney Stones : కాఫీ తాగడం వల్ల కిడ్నీలో రాళ్లు వచ్చే ప్రమాదం పెరుగుతుందా లేదా తగ్గుతుందా?

drinking coffee

kidney Stones : మన శరీరంలోని కీలకమైన అవయవాల్లో మూత్రపిండాలు ముఖ్యమైనవి. రక్తం నుంచి వ్యర్థాలను బయటకు పంపటంతోపాటు, శరీరంలోని ద్రవ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. కిడ్నీ స్టోన్ అనేది మూత్రంలోని వ్యర్థ పదార్థాల నుండి తయారు చేయబడిన చిన్న, గట్టి పదార్ధం, ఇది బయటకు రాకుండా కిడ్నీల్లోనే రాళ్లుగా ఉండిపోతాయి. తక్కువ మోతాదులో నీరు సేవించే వారిలో కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంటుంది.

READ ALSO : కాఫీ, టీలు అతిగా తాగితే ఎముకలకు అనర్థమే..!

మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడకుండా నిరోధించేందుకు పరిశోధకులు అనేక అధ్యయనాలు చేస్తున్నారు. అయితే కాఫీ తాగడానికి, మూత్రపిండాల్లో రాళ్ల సమస్య నుండి బయటపడటానికి మధ్య సంబంధాన్ని పరిశీలిస్తున్న నేపధ్యంలో ఇటీవలి అధ్యయనాల్లో కెఫీన్ వినియోగం మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా నిరోధించవచ్చని తేలింది.

చాలా మంది తరచుగా కాఫీ తాగడం వల్ల డీహైడ్రేట్ కు కావాల్సి వస్తుందని, తద్వారా మూత్రపిండాల్లో రాళ్ల ప్రమాదం పెరుగుతుందని భావిస్తారు. అయితే అది పూర్తిగా అవాస్తవమని ఈ అధ్యయనం ద్వారా తేలింది.

READ ALSO : Diabetes During Pregnancy : గర్భధారణ సమయంలో మధుమేహ ప్రమాదాన్ని కాఫీ తగ్గించగలదా? అధ్యయనాలు ఏం చెబుతున్నాయ్?

వాస్తవానికి, కిడ్నీలో రాళ్లపై పరిశోధనలు కెఫీన్ వాడకం వల్ల కిడ్నీలో రాళ్లు రాకుండా నిరోధించవచ్చని తేల్చాయి. రోజుకు 1 కప్పు నుండి రెండు కప్పుల వరకు కాఫీ తాగడం వల్ల మూత్రపిండాలలో రాళ్ల సమస్య 40% వరకు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.

కెఫిన్ కలిగిన ద్రవాలు తాగని వారి కంటే కాఫీ లేదా టీ తాగే వారికి మూత్రపిండాల్లో రాళ్లు వచ్చే అవకాశం తక్కువ. నీరు మూత్ర ప్రవాహాన్ని పెంచటం వల్ల కిడ్నీల్లోని రాళ్లు మూత్రం ద్వారా బయటకు వెళ్ళిపోతాయి. మొత్తానికి కాఫీ అనేది మూత్రపిండాల్లో రాళ్ల నుండి రక్షణ కల్పించటానికి దోహదపడుతుందని అధ్యయనకారులు చెబుతున్నారు.