Milk : పాలు తాగితే కొలెస్ట్రాల్ పెరుగుతుందా?

పాలలో సంతృప్త కొవ్వు ఉంటుంది. కేలరీలు అధికంగా ఉంటాయి. 250 ml పాలలో 5 గ్రాముల కొవ్వు,152 కేలరీలు ఉంటాయి. పాలు ఎప్పుడు బరువును పెంచవు అంతేకాదు బరువు తగ్గడానికి సహాయపడుతాయి.

Milk : పాలు తాగితే కొలెస్ట్రాల్ పెరుగుతుందా?

Milk (1)

Milk  : పాలు ఆరోగ్యానికి మంచిది. పాలు తాగటం వల్ల ఆరోగ్యప్రయోజనాలు చేకూరతాయి. ఇటీవలికాలంలో చాలా మందికి అధిక బరువు, కొలెస్ట్రాల్ పెద్ద సమస్యగా మారింది. ఏంతిన్నా బరువు పెరుగుతామన్న ఆలోచనతో ఉంటారు. అయితే పాలు తాగే విషయంలో కూడా చాలామందికి అపోహలు ఉన్నాయి. వాస్తవానికి పాలు ఆరోగ్యకరం. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఇది కొవ్వును కూడా కలిగి ఉంటుంది. హై కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడే వాళ్ళు పాలు తాగడం మానేస్తారు. అది కొలెస్ట్రాల్ పెరగడానికి కారణం అని అనుకుంటూ ఉంటారు.

హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది మంచి కొలెస్ట్రాల్. ఇది చెడు కొలెస్ట్రాల్‌ని బ్లడ్ వెసెల్స్ నుండి తొలగిస్తుంది. దీంతో బాడీ నుండి చెడు కొలెస్ట్రాల్ దూరమవుతుంది. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది బ్యాడ్ కొలెస్ట్రాల్. ఇవి అధికంగా ఉంటే హృదయ సంబంధిత సమస్యలు, హార్ట్ ఎటాక్, హార్ట్ స్ట్రోక్ లాంటి సమస్యలు వస్తాయి. మనం తీసుకునే ఆహారం కొలెస్ట్రాల్‌కి కారణం అవుతుంది కాబట్టి ఆహారం తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకుంటూ ఉండాలి.  ఊబకాయానికి, కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోవడానికి పాలతో ఎలాంటి సంబంధంలేదని నిపుణులు అంటున్నారు.

పాలలో సంతృప్త కొవ్వు ఉంటుంది. కేలరీలు అధికంగా ఉంటాయి. 250 ml పాలలో 5 గ్రాముల కొవ్వు,152 కేలరీలు ఉంటాయి. పాలు ఎప్పుడు బరువును పెంచవు అంతేకాదు బరువు తగ్గడానికి సహాయపడుతాయి. పాలు ఆరోగ్యకరమైనది అంతేకాదు అధిక నాణ్యత గల ప్రోటీన్ మూలం. కండరాల నిర్మాణానికి, పెరుగుదలకు అవసరమైన పోషకం. జింక్, మెగ్నీషియం, కాల్షియం, విటమిన్ బి12, విటమిన్ డి వంటి పోషకాలు తగిన మొత్తంలో ఉంటాయి.

తక్కువ కేలరీల ఆహారాన్ని అనుసరించే వ్యక్తులు పాల ఉత్పత్తులను నివారించే వారి కంటే రోజుకు మూడు సార్లు పాల ఉత్పత్తులను తీసుకోవడం ద్వారా ఎక్కువ బరువును కోల్పోతున్నారని ఒక అధ్యయనంలో తేలింది. అదనంగా పాల వల్ల కాల్షియం పొందడం, ఊబకాయం, మెటబాలిక్ సిండ్రోమ్, టైప్-2 మధుమేహం, గుండె జబ్బుల ప్రమాదం కూడా తగ్గిస్తుంది. మీరు బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నట్లయితే మీ ఆహారం నుంచి పాలు, పాల ఆధారిత ఉత్పత్తులను తగ్గించాల్సిన అవసరం లేదు. పాలల్లో ఉండే పోషకాలు ఎముకలను బలోపేతం చేయడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి జీవక్రియను పెంచడానికి సహాయపడతాయి. రోజూ పరిమిత పరిమాణంలో పాలు తీసుకోవడం వల్ల ఎటువంటి హాని ఉండదు.