FENNEL SEEDS : సోంపుతింటే ఆహారం త్వరగా జీర్ణమౌతుందా?

జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలకు సోంపు చక్కటి పరిష్కారాన్ని చూపిస్తుంది. అజీర్తి, ఎసిడిటీ, సమస్యలకు సోంపు తినడం, సోంపు నీరు తాగడం వల్ల ఉపశమనం లభిస్తుంది.

FENNEL SEEDS : సోంపుతింటే ఆహారం త్వరగా జీర్ణమౌతుందా?

Fennel Seeds

FENNEL SEEDS : సోంపు గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకోవటం వల్ల ఎన్నో లాభాలు కూడా ఉన్నాయి. సోంపు గింజల్లో యాంటిసెప్టిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలుంటాయి. సోంపులో ఐరన్‌, కాల్షియం, మెగ్నీషియం, జింక్, కాపర్‌, మాంగనీస్‌, విటమిన్ బి, విటమిన్ సి, ప్రోటీన్‌, ఫైబర్‌తో పాటు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ కూడా పుష్కలంగా నిండి ఉంటాయి. భోజనం చేశాక సోంపు తీసుకుంటే ఆహారం త్వరగా జీర్ణం అవుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. రక్తహీనతతో బాధ పడే సోంపును పాలల్లో కలిపి సేవించాలి. ఇలా చేయడం వల్ల శరీరానికి సరిపడా ఐరన్ అందుతుంది. ఫలితంగా రక్తహీనత సమస్య దూరమౌతుంది.

సోంపులో లభించే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇది చర్మాన్ని ముడతలు పడేలా చేసే ప్రీ రాడికల్స్‌ను శరీరం నుంచి బయటకు పంపిస్తుంది. మొటిమలు రావడానికి కారణమైన బ్యాక్టీరియాను సంహరిస్తాయి. మొటిమలతో పాటు వచ్చే వాపు, నొప్పిని తగ్గిస్తాయి. రోజుకొకసారి సోంపు నీటితో ముఖం కడుక్కొంటే క్రమంగా ముడతలు తగ్గుముఖం పడతాయి. గ్లాసు నీటిలో చెంచా సోంపు వేసి రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఆనీటితో ముఖం శుభ్రం చేసుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలకు సోంపు చక్కటి పరిష్కారాన్ని చూపిస్తుంది. అజీర్తి, ఎసిడిటీ, సమస్యలకు సోంపు తినడం, సోంపు నీరు తాగడం వల్ల ఉపశమనం లభిస్తుంది. ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ సమస్యతో బాధపడేవారు సోంపు టీ తాగడం వల్ల జీర్ణవ్యవస్థకు సంబంధించిన ఎంజైమ్‌లు విడుదలవుతాయి. సోంపులో యాంటీ ఆక్సిడెంట్లు, పీచుపదార్థం ఉంటాయి. ఇవి రక్తంలోని టాక్సిన్లను, ఫ్రీరాడికల్స్‌ను బయటకు పంపిస్తాయి. కంటి చూపు మెరుగ్గా ఉండాలంటే విటమిన్ ఎ చాలా అవసరం. సోంపు గింజల్లో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. సోంపు గింజలు తినడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది.

గ్లాస్ గోరు వెచ్చని పాలల్లో పావు టేబుల్ స్పూన్ సోంపు పొడి, రుచికి సరిపడా బెల్లం పొడి కలిపి రాత్రి నిద్రించడానికి గంట ముందు తీసుకోవాలి. ఇలా ప్రతి రోజు గనుక చేస్తే నిద్రలేమి, ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలన్నీ దూరం అవుతాయి. దానిలో ఉండే పాలీఫెనల్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ గుండె జబ్బులు, మధుమేహం వంటివి దరి చేరకుండా చూస్తాయి. గోరు వెచ్చని పాలల్లో సోంపును యాడ్ చేసి నైట్ నిద్రించే ముందు తీసుకుంటే ఎముకలు, కండరాలు దృఢంగా మారతాయి.