Belly Fat : నిద్రలేమి బెల్లీ ఫ్యాట్ కు దారితీస్తుందా?

బెల్లీ ఫ్యాట్ కు మరొక కారణం నిద్రలేమి కూడా కారణమని నిపుణులు చెబుతున్నారు. వ్యాయామం లేకపోవటం, నిద్రలేమి వల్ల బెల్లీ ఫ్యాట్ అధికమౌతుంది. అదే విధంగా రాత్రి పూట ఆలస్యంగా నిద్రపోవటం, అర్ధరాత్రి వరకు మెలుకవతో ఉండే ఏదో ఒకటి తింటూ ఉండటం వంటి అలవాట్లు ఉన్నవారిలో బెల్లీ ఫ్యాట్ సమస్య బారిన పడే అవకాశాలు ఉధికంగా ఉంటాయి.

Belly Fat : నిద్రలేమి బెల్లీ ఫ్యాట్ కు దారితీస్తుందా?

Sleep

Belly Fat : ఇటీవలి కాలంలో బెల్లీఫ్యాట్‌ అనేది ఒక పెద్ద సమస్యగా మారింది. అధిక బరువు సమస్యతో బాధపడుతున్న వారిలో బొడ్డు కొవ్వు అధిక మోతాదులో ఉంటూ అనేక సమస్యలకు దారితీస్తుంది. ముఖ్యంగా గుండె జబ్బులు, మధుమేహం, మెటబాలిక్ సిండ్రోమ్, అధిక రక్తపోటు, పెద్దప్రేగు క్యాన్సర్ మరియు మహిళల్లో రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని బెల్లీ ఫ్యాట్ పెంచుతోంది. దీనిని కరిగించడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేసినా ఏమాత్రం ఫలితం ఉండదు. ముఖ్యంగా బెల్లీఫ్యాట్‌ రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. మనం చేసే తప్పుల వల్లే బెల్లీఫ్యాట్‌ పెరుగుతుంది. ఈ అలవాట్లను మార్చుకుంటే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.

శారీరపరమైన, బాహ్యపరమైన ఒత్తిడి శరీరంలో అనేక మార్పులకు కారణమవుతుంది. ఒత్తిడిలో ఉన్నప్పుడు నాడీ వ్యవస్థ లేదా క్లాసిక్ ఫైట్ లేదా ఫ్లైట్ రెస్పాన్స్ యాక్టివేట్ అవుతుంది. ఇది మీ జీర్ణశయాంతర వ్యవస్థ, పునరుత్పత్తి అవయవాలు, చర్మం శరీర భాగాలపై ప్రభావం చూపిస్తుంది. దీర్ఘకాలిక ఒత్తిడి ఏదైనా జీవరసాయన మార్పులకు కారణమవుతుంది, ఇది బొడ్డు కొవ్వు పేరుకుపోవడానికి దారితీస్తుంది. బొడ్డు కొవ్వు ద్వారా సృష్టించబడిన పెరిగిన ఈస్ట్రోజెన్‌లు పురుషులు మరియు స్త్రీలలో సహజ ప్రొజెస్టెరాన్ స్థాయిలను మరింత అణిచివేస్తాయి. ప్రేగులలో తక్కువ ఆక్సిజన్ కొవ్వు పేరుకుపోవడానికి దారితీసే జీవరసాయన మార్పులకు కారణమవుతాయని పరిశోధకులు కనుగొన్నారు.

అలాగే బెల్లీ ఫ్యాట్ కు మరొక కారణం నిద్రలేమి కూడా కారణమని నిపుణులు చెబుతున్నారు. వ్యాయామం లేకపోవటం, నిద్రలేమి వల్ల బెల్లీ ఫ్యాట్ అధికమౌతుంది. అదే విధంగా రాత్రి పూట ఆలస్యంగా నిద్రపోవటం, అర్ధరాత్రి వరకు మెలుకవతో ఉండే ఏదో ఒకటి తింటూ ఉండటం వంటి అలవాట్లు ఉన్నవారిలో బెల్లీ ఫ్యాట్ సమస్య బారిన పడే అవకాశాలు ఉధికంగా ఉంటాయి. ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండాలంటే మీ దినచర్యలో సమతుల్య ఆహారం తీసుకోవటం ప్రారంభించాలి. మంచి ఆరోగ్యం కోసం రోజుకి కనీసం 7 నుంచి 8 గంటల నిద్ర పోవాలి. ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి నిద్ర సామర్ధ్యాన్ని పెంచటం అన్నది సులభంగా బరువు తగ్గడానికి మరొక మార్గం. మంచి ఆహారం, సుఖ నిద్ర బెల్లీ ఫ్యాట్ సమస్యను దరిచేరకుండా చూసుకోవచ్చు.