Body Weight : ఉదయం కంటే రాత్రి వేళల్లో మన శరీరం బరువు ఎక్కువగా ఉంటుందా!…

శరీర బరువును ఫిట్‌నెస్‌కు కొలమానంగా చూడలేము. అలాగే అధిక బరువును శరీరంలో పేరుకున్న కొవ్వుకు సూచనగా భావించకూడదు.

Body Weight : ఉదయం కంటే రాత్రి వేళల్లో మన శరీరం బరువు ఎక్కువగా ఉంటుందా!…

Weaght1

Body Weigh : శరీరం బరువు విషయంలో కాలం, వయసును బట్టీ ఒకరోజులేనే వివిధ రకాల తేడాలు కనిపిస్తాయి. శరీరంలోని నీటి పరిమాణం, ఉదయం నుంచి రాత్రి లోపు మనం తాగే నీళ్ల హెచ్చుతగ్గులే ఇందుకు కారణం. అలాగే చెమటపట్టడం, వేడికి ఒంట్లో నీరు ఆవిరవ్వటం, మూత్రవిసర్జన, ఆహార వేళలు, పేగుల కదలికలు కూడా శరీర బరువు మీద ప్రభావం చూపుతాయి. ఉదయం కంటే రాత్రి వేళ శరీరం ఎక్కువ బరువుగా ఉంటుంది.

అలాగే శరీర తత్వాన్ని బట్టి శరీర బరువుల్లో తేడాలుంటాయి. ఎక్కువ బరువును అనారోగ్య లక్షణంగా భావించడం సరైనది కాదని, ఎలాంటి శరీర బరువుతోనైనా ఫిట్‌గా ఉండే వీలు ఉంటుందనీ న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. వయసుతో పాటు, మారే కాలానికి తగ్గట్టు శరీర బరువుల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటూ ఉంటాయని చెబుతున్నారు.

శరీర బరువును ఫిట్‌నెస్‌కు కొలమానంగా చూడలేము. అలాగే అధిక బరువును శరీరంలో పేరుకున్న కొవ్వుకు సూచనగా భావించకూడదు. కాబట్టి బరువు తగ్గనంత మాత్రాన కుంగిపోవలసిన అవసరం లేదు. బరువు కంటే ఫిట్‌నెస్‌ ముఖ్యం. కండరాలు, ఎముకలు, కొవ్వు, నీరు… శరీర బరువులో ఇవన్నీ కలిసే ఉంటాయి. కాబట్టి శరీర బరువును కొవ్వుతో సరిపోల్చకూడదు. వెయింగ్‌ స్కేల్‌ మీద కనిపించే శరీర బరువు మీ ఫిట్‌నెస్‌ లెవల్‌ లేదా ఒబేసిటీకి కొలమానం కాదని గుర్తుంచుకోవాలి.

ఎలాంటి శరీర బరువుతోనైనా ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండే వీలుంది. అయితే పూర్తి ఆరోగ్యం సురక్షిత పరిధిలోనే ఉండేలా చూసుకోవాలి. శరీర కదలికలన్నీ సౌకర్యవంతంగా, రోజంతా సరిసమానమైన శక్తి కలిగి ఉండేలా చూసుకోవాలి. ఆరోగ్యకరమైన సమతులాహారం, క్రమం తప్పని వ్యాయామాలతో శరీర బరువు గురించి దిగులు చెందకుండా ఆరోగ్యంగా, ఫిట్‌గా జీవించే ప్రయత్నం చేయాలి.