SALT : ఉప్పు మోతాదుకు మించితే గుండె సంబంధిత సమస్యలు వస్తాయా?

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, ఒక వ్యక్తి రోజుకు 2 గ్రాముల కంటే ఎక్కువ సోడియం, అంటే రోజుకు 5 గ్రాముల ఉప్పు మాత్రమే తీసుకోవాలి. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ రోజుకు 2.5 గ్రాముల కంటే ఎక్కువ సోడియం తీసుకోకూడదని సిఫార్సు చేసింది.

SALT : ఉప్పు మోతాదుకు మించితే గుండె సంబంధిత సమస్యలు వస్తాయా?

Salt

SALT : ఆహారంలో ఉప్పు తగు మోతాదులో ఉంటే ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఆహారాల తయారీలో దీనిని ఉపయోగిస్తారు. ఉప్పును సోడియం క్లోరైడ్ గా పిలుస్తారు. ఉప్పు అనేది రక్తపోటు, రక్త పరిమాణాన్నినిర్వహించటానికి సహాయపడుతుంది. శరీరంలో తక్కువ సోడియం క్లోరైడ్ స్ధాయిలను కలిగి ఉండటాన్ని హైపోనాట్రేమియా అంటారు. శరీరంలో ఉప్పు లోపిస్తే కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఉప్పు లోపం కారణంగా వాంతులు, వికారం, గందరగోళం, బద్ధకం, మూర్చ, అల్ప రక్తపోటు, కండరాల తిమ్మిరులు, పాదాలు, ముఖంలో వాపు వంటి లక్షణాలు కనిపిస్తాయి.

అదే క్రమంలో రోజుకు 1500 మి.గ్రా కన్నా సోడియం మించకుండా చూసుకోవాలి. మోతాదుకు మించితే శరీరానికి ఎక్కువ హాని చేస్తుంది. నిల్వ పచ్చళ్లు, బజ్జీలు, వంటి చిరుతిళ్లలో ఉప్పు అధికంగా ఉంటుంది. తొందరగా ఆకలి తీరుతుందని చాలామంది ఈ ప్రాసెస్డ్‌ ఫుడ్‌లను తింటారు. వీటి వల్ల శరీరంలో అధిక మోతాదులో ఉప్పు చేరుతుంది. వీటి బదులు పండ్లు, నట్స్‌, గింజలు తినేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి. సోడియం ఎక్కువ పరిమాణంలో తీసుకుంటే, రక్తపోటుతో సహా అనేక రకాల హృదయ సమస్యలకు దారితీయవచ్చు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, ఒక వ్యక్తి రోజుకు 2 గ్రాముల కంటే ఎక్కువ సోడియం, అంటే రోజుకు 5 గ్రాముల ఉప్పు మాత్రమే తీసుకోవాలి. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ రోజుకు 2.5 గ్రాముల కంటే ఎక్కువ సోడియం తీసుకోకూడదని సిఫార్సు చేసింది. ఉప్పు మోతాదుకు మించితే మాత్రం గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆహారంలో ఉప్పు తక్కువయిందని కొందరు అదనంగా ఉప్పును యాడ్ చేసుకుంటారు. అలా చేయటంవల్ల మనం తీసుకున్న ఆహారం ఆలస్యంగా అరుగుతుంది. అంతేకాకుండా రక్తపీడనం పెరగడం నీటిని గ్రహించడం, గుండె జబ్బుల ముప్పు ఎక్కువవడానికి కారణం అవుతుంది.