శృంగారానికి ఎక్స్‌పెయిరీ డేట్ ఉందా?

  • Published By: Mahesh ,Published On : August 10, 2020 / 01:24 PM IST
శృంగారానికి ఎక్స్‌పెయిరీ డేట్ ఉందా?

శృంగారం.. ఓ అందమైన క్షణం.. ఓ మెరుపు మెరిసినట్టుగా ఉద్రేకంతో మొదలై భావ ప్రాప్తితో ముగుస్తుంది.. ఇద్దరు పార్టనర్ల మధ్య శృంగారాన్ని మరింత ఆశ్వాధించాలంటే మానసికంగా సిద్ధం కావాలంటారు.. అప్పుడే ఆ శృంగారపు అనుభూతిని పొందొచ్చు అంటారు సెక్సాలిజిస్టులు.. ఐదు నిమిషాల పాటు ఉద్రేకాన్ని కలిగించే ఈ శృంగారానికి అసలు ఎక్స్ పెయిరీ డేట్ అనేది ఉందా? అంటే అలాంటి పరిమితులేమి లేవంటున్నారు.. శృంగారానికి వయస్సుతో సంబంధం లేదంటున్నారు.



ప్రతిఒక్కరిలోనూ లైంగిక వాంఛ ఉంటుందని అంటున్నారు.. వాస్తవానికి శృంగారానికి పలానా వయస్సు సరిపోతుందనడానికి ఎలాంటి కొలమానం లేదు.. కౌమర దశ నుంచి వృద్ధాప్యం వరకు శృంగారాన్ని ఎంజాయ్ చేయొచ్చు అంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. 50 ఏళ్ల తర్వాత చేసే శృంగారం మరింత మజా ఉంటుందని అంటున్నారు ఓ శృంగార రచయిత.. 50ఏళ్ల తర్వాత నుంచి వృద్ధాప్యంలో శృంగారానికి సంబంధించి నాలుగు పుస్తకాలను రచించారు.

ఇందులో “నేకెడ్ ఎట్ అవర్ ఏజ్”అనే పుస్తకానికి అవార్డు గెలుచుకున్నారు. 76 ఏళ్ల వయస్సులోనూ ఆమె సీనియర్ శృంగారం గురించి గట్టిగా చెబుతున్నారు. 50 తరువాత శృంగారం గురించి ఎక్కువగా మాట్లాడుతామని అన్నారు. ఒక వయస్సు వచ్చాక శృంగారం గురించి తెగ ఆందోళన చెందుతుంటారని ఆమె చెప్పుకొచ్చారు.

నడి వయస్సు నుంచి ముదుసలి వయస్సులోనూ శృంగారంలో గొప్ప అనుభూతిని పొందాలంటే ఏం చేయాలి? ప్రతి సమస్యకు, ఒక పరిష్కారం ఉంటుందని చెబుతున్నారు. వయస్సు పెరిగే కొద్ది శరీరం మారుతుంది, లైంగికత, లైంగిక సామర్థ్యాలు కూడా మారుతుంటాయి. శృంగారంలోకి తిరిగి ఎలా ప్రారంభించాలి అనేవారిలో అనేక సందేహాలు వ్యక్తమవుతుంటాయి. వృద్ధాప్య సమయంలో భాగస్వామిని కోల్పోయిన వారి ఒంటరి జీవితంలో శృంగారంపై ఆసక్తిని ఎలా పెంచుకోవాలి? అనేదానిపై సెక్సాలిజిస్టులు కొన్ని వివరణలు ఇచ్చారు? అవేంటో ఓసారి చూద్దాం..



భాగస్వామిని కోల్పోయిన వారితో మీరు ఏమి చెబుతారు? :
శృంగారానికి టైమ్‌లైన్ అంటో ఏది లేదు.. మనం మరెవరితోనూ ఉండకూడదని అనిపించవచ్చు. సహజమైన అనుభూతిగా చెప్పవచ్చు.. కానీ ఇది కూడా తాత్కాలికమే. కొన్నాళ్లకు ఆ ఆలోచన మారిపోవచ్చు.. కొత్త వ్యక్తితో కలిసిన కొత్త జీవితాన్ని ఆరంభించవచ్చు. వారితో లైంగిక జీవితాన్ని కూడా అస్వాధించవచ్చునని అంటున్నారు.

 

ఆరోగ్యకరమైన శృంగారంపై వృద్ధులకు హక్కు ఉంది, ఇది సరియైనదా?
ప్రతిఒక్కరి జీవితంలో లైంగిక జీవనం అనేది సర్వ సాధారణం.. దీనికి ఒక ఎక్స్ పెయిరీ డేట్ అంటూ ఏది ఉండదు.. వారి జీవితంలో ఎప్పుడైనా ఈ క్షణాన్ని పొందవచ్చు. జీవితాంతం లైంగిక జీవనాన్ని సాగించేవారు లేకపోలేదు. వయస్సు పెరిగిన తర్వాత శరీరం మారుతుంది. కానీ, మనం ఆ మార్పులకు అనుగుణంగా ఉండాలి.. దీనిని లోపంగా చూడకూడదని సెక్సాలిజిస్టులు సూచిస్తున్నారు.



ఆకస్మిక కోరిక.. ప్రేరేపించే కోరిక అంటే ఏంటి? :
శృంగారమనేది.. ఒక కోరిక.. దీన్ని ఆకస్మిక కోరిక అని పిలుస్తారు. ఎప్పుడూ ఏ సమయంలో ఈ కోరిక కలుగుతుందో చెప్పలేం.. ఆ క్షణంలో శృంగారం చేయాలని బలమైన కోరిక  కలుగుతుంది చాలామందిలో.. వయసు పెరిగే కొద్దీ కొంతమందిలో శృంగారపు కోరిక తగ్గిపోతుంది. శృంగారం చేయాలనే భావన కూడా తగ్గిపోతుంది. కానీ, శారీరకంగా శృంగారానికి శరీరాన్ని ప్రేరేపించవచ్చు.. మనతో లేదా భాగస్వామితో కలిసి ఉన్నప్పుడు ఈ కోరిక శారీరక ప్రేరేపణకు దారితీస్తుంది. మూడ్ బాగుంటే చాలు.. కోరికలు బుసగొట్టాల్సిందే..



యువతకు పోడ్‌కాస్ట్ అంటే ఎందుకు ఆసక్తి? వృద్ధుల శృంగారాన్ని ఎందుకు పట్టించుకోవాలి? :
ముఖ్యమైన ప్రశ్న.. ఎందుకంటే మనమందరం వృద్ధాప్యంలోకి అడుగు పెట్టాల్సిన వాళ్లమే.. వయస్సు పెరిగే కొద్ది వృద్ధాప్యానికి చేరువ అవుతు న్నామని అర్థం.. అయినా శృంగార భావనకు వయస్సుతో సంబంధం లేదు.. కొంతమంది ఆనందంతో కూడిన శృంగారాన్ని కోరుకుంటారు. ఆనందాన్ని కలిగించేదిగా ఉండాలి. భాగస్వామితో కలిసి శృంగార జీవితాన్ని అనుభవించాలి. దీన్ని ఒక యుక్త వయస్సు నుంచే అవగాహన చేసుకుంటే.. వృద్ధాప్యంలోనూ మంచి శృంగారానికి ఆటంకమే ఉండదు..