Plant Growth: మొక్కల దగ్గర పాడినా.. మాట్లాడినా వింటాయా.. బాగా ఎదుగుతాయా

మొక్కలపై రీసెర్చ్ చేసి అవి శబ్దాల ద్వారా వచ్చే వైబ్రేషన్స్‌ను ఎలా రిసీవ్ చేసుకుంటాయా అని చెప్తూ తన రీసెర్చ్ లో విషయాలు ఇలా..

Plant Growth: మొక్కల దగ్గర పాడినా.. మాట్లాడినా వింటాయా.. బాగా ఎదుగుతాయా

Plant Growth

Plant Growth: కొందరు మాట్లాడినా.. పాటలు పాడినా మొక్కలకు తెలుస్తుందని.. అది విని బాగా ఎదగడం తద్వారా కాయలు కాయడం ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. అది నిజమేనా.. ఈ ప్రశ్న వేస్తుంది అమెరికాలోని ఓహియోలో ఉన్న టోలెడో యూనివర్సిటీ ప్రొఫెసర్ హీది అప్పెల్.

‘ఈ ప్రశ్న తరచుగా నాకు నేనే అనుకుంటూ ఉంటాను. మొక్కలపై రీసెర్చ్ చేసి అవి శబ్దాల ద్వారా వచ్చే వైబ్రేషన్స్‌ను ఎలా రిసీవ్ చేసుకుంటాయా అనుకుంటా’ అని చెప్తూ తన రీసెర్చ్ లో విషయాలు ఇలా చెప్తున్నారు.

శబ్ధంలో వైబ్రేషన్స్ దాగుంటాయి. నిజానికి మాట్లాడటం, పాటలు పాడటం వల్ల మొక్కలు బాగా ఎదుగుతాయని నమ్మడానికి ఎటువంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు. కొన్ని స్టడీల్లో మొక్కలపై మ్యూజిక్ మంచి ప్రభావం చూపించాయంటే.. మరికొన్నింటిలో అలాంటిదేం లేదని తెలిసింది. ఇలాంటి స్టడీలను నమ్మితే అటూ ఇటూ తేల్చుకోలేం. అవే మనల్ని గందరగోళంలో పడేస్తుంటాయి.

సరిగ్గా గమనిస్తే.. మొక్కలు వైబ్రేషన్స్ ను గుర్తించగలవని తెలుస్తుంది. అది వాటికి ముఖ్యం కూడా. గాలి వీచిన సమయంలో టమాటా లాంటి మొక్కలు పుప్పొడి లాంటివి మాత్రమే రిలీజ్ చేస్తుంటాయి. మరికొన్ని మొక్కలు తుమ్మెదలు లాంటివి వచ్చినప్పుడు రెక్కల కదలికను బట్టి వైబ్రేషన్ ఫీల్ అవుతాయి. అలా గాలికి, లేదా ఇతర కీటకాల కదలికలకు వైబ్రేషన్ ఫీల్ అయి పుప్పొడి రిలీజ్ చేస్తుంటాయి.

……………………………………… : చూస్తుండగానే కుప్పకూలిన భవనం.. వైరల్ వీడియో

మిస్సౌరీ యూనివర్సిటీకి చెందిన రెక్స్ కొక్రోఫ్ట్ సైంటిస్ట్.. మొక్కలు గొంగళిపురుగులు ఆకులను తినేటప్పుడు వైబ్రేషన్స్ ను గమనిస్తాయని తెలిసింది. తద్వారా ఎదుర్కొనేందుకు వాటంతట అవే కొంత కెమికల్ ప్రొటెక్షన్ ను స్వతహాగా డెవలప్ చేసుకుంటాయట. దీనిని బట్టి సహజంగా వాటిని తాకి.. వాటిపై ప్రభావం చూపే వైబ్రేషన్స్ కు తప్ప ఇతర కారణాలతో అవి రెస్పాండ్ అవుతాయని ఎక్కడా నిరూపించలేదు.

దీనిని బట్టి మొక్కల దగ్గరకు వెళ్లి సంగీతం వినిపించినా.. స్వయంగా పాడినా ఎటువంటి ప్రభావం కనిపించదు. పీక్స్ లో సౌండ్ పెట్టుకుని వదిలేసినా ఎలాంటి హర్టింగ్ కూడా ఉండదు.