Birch Tree : రావి చెట్టు క్యాన్సర్ ప్రమాదాన్ని నివారిస్తుందా?

రోగనిరోధక వ్యవస్ధను మెరుగుపరచేందుకు రావిచెట్టు బెరడు తోడ్పడుతుంది. మతిమరుపు వ్యాధి చికిత్సలలో సైతం ఇది ఉపయోగపడుతుంది. రావిచెట్టులో ఉండే పలు సమ్మెళనాలు క్యాన్సర్ కణాలను చంపుతాయని పరిశోధనలు చెబుతున్నాయి.

Birch Tree : రావి చెట్టు క్యాన్సర్ ప్రమాదాన్ని నివారిస్తుందా?

Birch Tree

Birch Tree : పురాతన కాలం నుండి రావిచెట్టును ఎంతో పవిత్రమైన వృక్షంగా భారతీయులు భావిస్తున్నారు. రావి చెట్టు ఆకులు మొదలు శాఖలు, పువ్వులు, పండ్లు , బెరడు ఆరోగ్యపరంగా అనేక ప్రయోజనాలు అందిస్తాయి. తెగిన గాయాలకు రావి ఆకుల రసం పూస్తే గాయం త్వరగా మానిపోతుంది. ఈ రసంలో గాయాన్ని మాన్పే ఔషదగుణాలు ఉన్నాయి. వాపు నిరోధకంగా, నొప్పి నివారిణిగా పనిచేస్తుంది.

రావి చెట్టు బెరడు సారం రక్తంలో చక్కెర స్ధాయిలను క్రమబద్దీకరించటంలో సహాయకారిగా పనిచేస్తుంది. రావిచెట్టు బెరడు, వేరుల్లో సిటోస్టరోల్ డి గ్లైకోసైడ్ అనే సమ్మెళనం రక్తంలో చక్కెర స్ధాయిలను తగ్గించటంలో సహాయపడుతున్నట్లు అధ్యయనాల్లో తేలింది. రావి చెట్టులోని వివిధ భాగాల్లో ఇథనాలిక్ సారాలు అనేక బ్యాక్టీరాయలకు వ్యతిరేకంగా పోరాడటంలో ఉపకరిస్తాయి.

రోగనిరోధక వ్యవస్ధను మెరుగుపరచేందుకు రావిచెట్టు బెరడు తోడ్పడుతుంది. మతిమరుపు వ్యాధి చికిత్సలలో సైతం ఇది ఉపయోగపడుతుంది. రావిచెట్టులో ఉండే పలు సమ్మెళనాలు క్యాన్సర్ కణాలను చంపుతాయని పరిశోధనలు చెబుతున్నాయి. ప్రీరాడికల్స్ యొక్క ప్రభావాన్ని తగ్గించటం ద్వారా క్యాన్సర్ ప్రమాదాన్ని నివారిస్తాయి. నాడీ వ్యవస్ధకు సంబంధించిన రుగ్మతను తొలగించటంలో రావి ప్రభావ వంతంగా పనిచేస్తుంది.

రావిని ఔషదంగా సేవించేటప్పుడు తగినంత మోతాదులో మాత్రమే తీసుకోవాలి. లేకుంటే దుష్పప్రభావాలు కలిగి అవకాశం ఉంటుంది. రావి చెట్టును ఔషదంగా తీసుకునే ముందు ఆయుర్వేద వైద్యులను సంప్రదించి వారి సూచనలు, సలహాలు తీసుకోవటం ఉత్తమం.