Vaccine Period Problems : కొవిడ్ వ్యాక్సిన్‌తో మహిళల్లో పీరియడ్ సమస్యలు..?

ప్రపంచాన్ని కరోనావైరస్ మహమ్మారి వణికిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది కరోనా బారిన పడ్డారు. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న కొంతమంది మహిళలు పీరియడ్ సమస్యలతో బాధపడుతున్నట్టు ఓ నివేదిక వెల్లడించింది. 

Vaccine Period Problems : కొవిడ్ వ్యాక్సిన్‌తో మహిళల్లో పీరియడ్ సమస్యలు..?

Does The Covid Vaccine Cause Period Problems

Covid vaccine cause period problems? : ప్రపంచాన్ని కరోనావైరస్ మహమ్మారి వణికిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది కరోనా బారిన పడ్డారు. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న కొంతమంది మహిళలు పీరియడ్స్‌ సమస్యలతో బాధపడుతున్నట్టు ఓ నివేదిక వెల్లడించింది.  సాధారణంగా ఏదైనా మెడిసిన్ తీసుకున్నప్పుడు.. దుష్ప్రభావాలు కనిపిస్తుంటాయి. కానీ, కొవిడ్ -19 వ్యాక్సిన్లు తీసుకున్నాక అనేక దుష్ప్రభావాలు తలెత్తుతున్నాయి. అయితే ఆ జాబితాలో పీరియడ్స్‌ సమస్యలు లేవు. వేలాది మంది మహిళలు వ్యాక్సిన్ అనంతరం సాధారణ రక్తస్రావం కంటే భారీగా ఉన్నట్లు నివేదించారు. టీకా తర్వాత పీరియడ్ సమస్యలకు ఎలాంటి సంబంధం లేదని నిపుణులు చెబుతున్నారు.

అందుకే టీకా అనంతరం కలిగే దుష్ప్రభావాల జాబితాలో పీరియడ్స్‌ సమస్యలను చేర్చలేదని అంటున్నారు. మే 17 వరకు మెడిసిన్స్ & హెల్త్‌కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ (MHRA)కు ఆక్స్‌ఫర్డ్ / ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌తో ముడిపడి ఉన్న 2,734 నివేదికలను అధికారిక గణాంకాలు వెల్లడించాయి. ఫైజర్ / బయోఎంటెక్ టీకాకు సంబంధించి 1,158 ఉండగా.. 66 మోడరనా వ్యాక్సిన్ తీసుకున్నవారే ఉన్నారు. క్లినికల్ ట్రయల్స్ సమయంలో వేలాది మందిపై దుష్ప్రభావాలు ఉన్నట్టు కనిపించలేదు. టీకాల మధ్య మార్పుతో పీరియడ్స్ సమస్యలకు మధ్య సంబంధంపై అనేక నివేదికలు సూచించినప్పటికీ రెండింటి మధ్య ఎలాంటి స్పష్టమైన సంబంధం నివేదించారు.

లండన్‌లోని ఇంపీరియల్ కాలేజీలో శాస్త్రవేత్త విక్టోరియా మేల్ ప్రకారం.. చాలా మంది మహిళలు తమ పీరియడ్స్‌ సాధారణం కంటే ఎక్కువగా ఉందని నివేదించారు. నివేదికలను సమీక్షించిన అనంతరం.. యూకేలో మూడు కోవిడ్ -19 వ్యాక్సిన్లతో ఎలాంటి ప్రమాదం ఉన్నట్టు ఆధారాలేవన్నారు. ఇప్పటి వరకు వ్యాక్సిన్ తీసుకున్న మహిళల సంఖ్య సాధారణంగా రుతు రుగ్మతల రేటుకు సంబంధించి నివేదికల సంఖ్య తక్కువగా ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నివేదికలను నిశితంగా పరిశీలిస్తున్నామని తెలిపారు. టీకా తరువాత మహిళల్లో తీవ్రమైన తిమ్మిరితో పాటు భారీ రక్తస్రావం జరిగిందని అనేక నివేదికలు తెలిపాయి. ఈ సమస్యలకు వ్యాక్సిన్‌కు స్పష్టమైన సంబంధం లేదని తేలిందని అమెరికాలో సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ఒక ప్రకటనలో పేర్కొంది.

కొవిడ్ వ్యాక్సిన్ కారణంగా కొన్ని దుష్ప్రభావాలు ఉంటాయని, అందులో అలసట, టీకా వేసిన చోట నొప్పి ఉంటుంది. ఈ సమస్యలన్నీ పీరియడ్స్‌ సమయంలో తీవ్రతరం చేస్తాయని అంటున్నారు. మహిళలు సాధారణ రుతు చక్రం కంటే ఎక్కువ అసౌకర్య కాలాన్ని అనుభవించడానికి ఒత్తిడి కూడా ఒక కారణమని కొంతమంది నిపుణులు వివరించారు. పీరియడ్స్‌ విషయంలో.. ఒత్తిడి, నిద్రలేమి, వ్యాయామం లేకపోవడం, కొన్ని మందులు కూడా ప్రభావితం చేయవచ్చునని అంటున్నారు. 20ఏళ్ల నుంచి 30 ఏళ్ల మహిళల్లో చాలామంది కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. కొంతమంది మహిళల్లో పీరియడ్స్‌ సమస్యలు రావడానికి.. కొవిడ్-19 టీకాలు సంతానోత్పత్తిని ప్రభావితం చేస్తాయనడానికి ఎలాంటి ఆధారాలు లేవని నిపుణులు స్పష్టం చేశారు.