Vitamin C : విటమిన్ సి తో రోగనిరోధక శక్తి పెరుగుతుందా ? జలుబు మొదలయ్యాక విటమిన్ సి మాత్రలు తీసుకుంటున్నారా?

జలుబు మొదలయ్యాక విటమిన్‌ సి మాత్రలను మొదలెట్టినవారిలో జలుబు తీవ్రతలో ఎలాంటి తేడాలు ఉండవు. రోజూ విటమిన్‌ మాత్రలు వేసుకున్నవారిలోనైతే జలుబు వేధించే సమయం కాస్త తగ్గుతుంది. నిజానికి మాత్రల కన్నా ఆహారం ద్వారా విటమిన్‌ సి లభించేలా చూసుకోవటమే మంచిది.

Vitamin C : విటమిన్ సి తో రోగనిరోధక శక్తి పెరుగుతుందా ? జలుబు మొదలయ్యాక విటమిన్ సి మాత్రలు తీసుకుంటున్నారా?

Vitamin C

Vitamin C : ఆహారం రూపంలో మనం తీసుకునే వాటి ద్వారా సి విటమిన్‌ లభిస్తుంది. బత్తాయి, నారింజ, నిమ్మ, ఉసిరి, జామ, టమోటా, క్యాబేజీ, కాలిఫ్లవర్‌, బంగాళాదుంప వాటితో
విటమిన్‌ సి దండిగా లభిస్తుంది. విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. నీటిలో కరిగే విటమిన్ల రకానికి చెందిన ఇది మంచి యాంటీఆక్సిడెంట్‌ గా చెప్పవచ్చు. తెల్ల రక్త కణాలను పెంచడం ద్వారా మనలో రోగనిరోధక శక్తిని బలపడేలా చేస్తుంది. ఇది శరీరం స్వయంగా తయారు చేసుకోని యాంటీ ఆక్సిడెంట్.

విటమిన్ సి అనేది శరీరానికి అనేక లాభాలను చేస్తుంది. ఇది ఇమ్యూనిటీని పెంచడమే కాదు. మెదడు పనితీరుని మెరుగుపరుస్తుంది. మానసిక స్థితిని నియంత్రించడంలో కీ రోల్ పోషిస్తున్న డోపమైన్, నోర్‌ఫైన్ ఫ్రైన్ సంశ్లేషణలో సాయపడుతుంది. విటమిన్ సి జలుబు, జ్వరాల వంటివి తగ్గించకపోవచ్చు. కానీ, అవి రాకుండా మాత్రం అడ్డుకోగలవు. తరచూ జలుబుతో బాధపడేవారిలో కొందరు విటమిన్‌ సి మాత్రలు వేసుకుంటుంటారు. ఇవి జలుబు వైరస్‌లను కట్టడి చేస్తాయని భావిస్తుంటారు. జలుబును తగ్గించటంలో దీని ప్రభావం అంతంతేనని అధ్యయనాలు పేర్కొంటున్నాయి.

జలుబు మొదలయ్యాక విటమిన్‌ సి మాత్రలను మొదలెట్టినవారిలో జలుబు తీవ్రతలో ఎలాంటి తేడాలు ఉండవు. రోజూ విటమిన్‌ మాత్రలు వేసుకున్నవారిలోనైతే జలుబు వేధించే సమయం కాస్త తగ్గుతుంది. నిజానికి మాత్రల కన్నా ఆహారం ద్వారా విటమిన్‌ సి లభించేలా చూసుకోవటమే మంచిది. చర్మంపై ముడతలు ఏర్పడి వృద్ధాప్యం ఛాయలు కనిపిస్తున్నవారు విటమిన్-సి ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తప్పకుండా తీసుకోవాలి. విటమిన్ సిని ఆస్కార్బిక్ ఆమ్లం అని కూడా అంటారు. ఇది శరీరంలోని అన్నిరకాల కణాజాలాలను వృద్ధి చేస్తుంది చేస్తుంది. నష్టపోయిన కణజాలాన్ని సరిజేస్తుంది.

ఈ విటమిన్‌ లోపం వల్ల గుండెకు సంబంధించిన నరాలు, ఎముకలు, చర్మం దెబ్బతింటాయి. అందువల్ల మీ ఆహారంలో విటమిన్ సీ, సప్లిమెంట్లు అధికంగా ఉండేలా చూసుకోవాలి. మగవారు 90 మిల్లీగ్రాములు, ఆడవారు 75 మిల్లీగ్రాములు నిత్యం శరీరానికి అందించాలి. పెద్దల్లో పిగ్మెంటేషన్‌, ఇతర చర్మ సంబంధ వ్యాధులు వచ్చిన సమయాల్లో 1000 మిల్లీ గ్రాముల వరకు విటమిన్‌ సీ తీసుకోవాలి. గర్భంతో ఉన్నవారు నిత్యం 85 మిల్లీగ్రాములు, బాలింతలు 120 మిల్లీగ్రాముల వరకు శరీరానికి అందేలా చూడాలి. రోజుకు 5 మి.గ్రా. నుంచి 100 మి.గ్రా. విటమిన్‌ సి అవసరం. దీని మోతాదు 2000 మి.గ్రా. కన్నా మించితే వికారం, వాంతి, ఛాతీలో మంట, కడుపునొప్పి వంటి దుష్ట్రభావాలకు దారితీస్తుంది.