Strain The Eyes : వర్క్ ఫ్రం హోంతో కళ్ళపై ఒత్తిడి పడుతుందా!

పాలకూర, క్యాబేజీ, బీట్ ఆకుకూరలు, కాలే, పాలకూర, ట్యూనా , సాల్మన్ వంటి చేపలు, విత్తనాలు, బీన్స్, గింజలు, గుడ్లు, నిమ్మ, నారింజ వంటి సిట్రస్ పండ్లు వంటి ప్రోటీన్ వనరులను చేర్చండి. ఇవి కంటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

Strain The Eyes : వర్క్ ఫ్రం హోంతో కళ్ళపై ఒత్తిడి పడుతుందా!

Strain The Eyes : కోవిడ్ రాకతో అందరూ వర్క్ ఫ్రంహోంకే పరిమితమయ్యారు. నేటికీ చాలా మంది ఉద్యోగులు ఇంటినుండే పనిచేస్తున్నారు. ముఖ్యంగా డిజిటల్ స్క్రీన్ పై వర్క్ చేసే వారు ఇంటి నుండే తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. అలాంటి వారు నిత్యం తమ కార్యకలాపాలను మొత్తంగా కంటిపైనే అధారపడి కొనసాగిస్తున్నారు. దీంతో రోజు వారిగా డిజిటల్ స్క్రీన్ ముందు ఎక్కువ సేపు గడుపు తుండటంతో కళ్ళు అలసి పోవటంతోపాటు వాటిపై ఒత్తిడి పెరుగుతుంది. కంప్యూటర్ , ఫోన్ స్క్రీన్ ల కారణంగా కళ్ల సమస్యలు చాలా మందిలో పెరుగుతున్నాయి. ప్రస్తుతం కంటి సమస్యలతో కంటి వైద్యులను సంప్రదిస్తున్న వారి సంఖ్య బాగా పెరిగినట్లు ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి.

కళ్ళ విషయంలో జాగ్రతగా మెలిగితే ;

మన కళ్ళు చాలా సున్నితంగా ఉంటాయి. వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా కళ్లకు ప్రమాదం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ఎక్కువసేపు పనిచేయడం వల్ల, కళ్ళలో మంట, నొప్పి, అలసట కలుగుతాయి. ఇలాంటి సమస్యల నుండి బయటపడేందుకు కంటి ఆరోగ్యానికి అవసరమైన ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి. రోజువారీ ఆహారంలో సమతుల్య ఆహారం తీసుకోవాలి. కంటికి మేలు చేసే విటమిన్లు సి, ఇ, జింక్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే ఆహారాలను చేర్చుకోవాలి.

పాలకూర, క్యాబేజీ, బీట్ ఆకుకూరలు, కాలే, పాలకూర, ట్యూనా , సాల్మన్ వంటి చేపలు, విత్తనాలు, బీన్స్, గింజలు, గుడ్లు, నిమ్మ, నారింజ వంటి సిట్రస్ పండ్లు వంటి ప్రోటీన్ వనరులను చేర్చండి. ఇవి కంటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. దీనికి తోడు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. వాకింగ్, జాగింగ్, యోగా వంటి రోజువారీ వ్యాయామం ఇతరత్రా సమస్యలు తలెత్తకుండా రక్షణగా తోడ్పడతాయి.

రాత్రి ప్రశాంతమైన నిద్ర అవసరం. ఎక్కువ గంటలు మేల్కొని పనిచేయటం  కంటి ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. కళ్ళకు తగినంత విశ్రాంతి ఇవ్వటం వల్ల కళ్ళు హైడ్రేటెడ్‌గా ఉంటాయి. కంటికి సంబంధించి ఏమాత్రం చిన్నసమస్యను గుర్తించినా తక్షణం కంటి వైద్యుడిని సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాలి. ఏదైన సమస్య ఉంటే వారిచ్చే సూచనలు పాటించటం అవసరమైతే కంటి అద్దాలు ధరించటం చేయాలి.