Double Mask Guidelines: డబుల్‌ మాస్క్‌పై కేంద్రం కీలక మార్గదర్శకాలు.. ఏం చేయాలి? ఏది చేయకూడదంటే?

భారతదేశంలో కరోనావైరస్ సెకండ్ వేవ్ వణికిస్తోంది. భారీసంఖ్యలో కేసులు నమోదవుతుండగా.. మరణాలు కూడా ఆగడం లేదు.. కరోనావైరస్ వ్యాక్సినేషన్ పూర్తిస్థాయిలో అందరికి అందుబాటులోకి రావాల్సి ఉంది.

Double Mask Guidelines: డబుల్‌ మాస్క్‌పై కేంద్రం కీలక మార్గదర్శకాలు.. ఏం చేయాలి? ఏది చేయకూడదంటే?

Double Masking Amid Covid 19 Second Wave

Double Mask Guidelines : భారతదేశంలో కరోనావైరస్ సెకండ్ వేవ్ వణికిస్తోంది. భారీసంఖ్యలో కేసులు నమోదవుతుండగా.. మరణాలు కూడా ఆగడం లేదు.. కరోనావైరస్ వ్యాక్సినేషన్ పూర్తిస్థాయిలో అందరికి అందుబాటులోకి రావాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా వైరస్ బారిన పడకుండా ఉండాలంటే ప్రతిఒక్కరూ ముఖానికి మాస్క్, సామాజిక దూరాన్ని పాటించడం తప్పనిసరి.. ప్రస్తుత మహమ్మారి సమయంలో ఒక మాస్క్ పూర్తిస్థాయిలో రక్షణ ఇవ్వలేదనే వాదన వినిపిస్తోంది.



అందుకే డబుల్ మాస్క్ ధరించడం ఎంతో మేలని సైంటిస్టుల పరిశోధనలో తేలింది. రెండు లేదా అంతకంటే ఎక్కువ లేయర్లు ఉన్న మాస్క్ ధరించడం ద్వారా వైరస్ కణాలు వ్యాపించడానికి చాలా తక్కువ అవకాశాలు ఉంటాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా డబుల్ మాస్క్ వినియోగంపై కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. ఒకే రకమైన రెండు మాస్క్ లను డబుల్ మాస్క్ గా వాడొద్దని కేంద్ర సూచించింది.



డబుల్ మాస్క్ ధరించేటప్పుడు సర్జికల్ మాస్క్, క్లాత్ మాస్క్ కలిపి ధరించాలని కేంద్రం సూచిస్తోంది. అలాగే ఒకే మాస్క్ ను వరుసగా రెండు రోజులు వాడొద్దని సూచించింది. సాధారణ క్లాత్‌మాస్క్‌ 42 నుంచి 46 శాతం వరకు వైరస్ నుంచి రక్షణ కల్పిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. అదే సర్జికల్‌ మాస్కు అయితే 56.4 శాతం రక్షణ ఇస్తుందన్నారు. సర్జికల్‌ మాస్కుపై క్లాత్‌మాస్కు ధరిస్తే కరోనా నుంచి రక్షణ 85.4 శాతం వరకు ఉంటుందని స్పష్టం చేశారు.



ఏం చేయాలంటే :
– డబుల్ మాస్క్‌లో సర్జరీ మాస్క్, డబుల్ లేదా ట్రిపుల్ లేయర్డ్ క్లాత్ మాస్క్ ఉండాలి.
– ముక్కు పైభాగంలో మాస్క్ గట్టిగా నొక్కినట్టు బిగుతుగా ఉండాలి.
– శ్వాస సులభంగా ఆడేంతగా చూసుకోవాలి.
– క్లాత్ మాస్క్ క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవాలి.

ఏం చేయకూడదంటే? :
– ఒకే రకమైన రెండు మాస్క్ లను కలిపి ధరించరాదు.
– వరుసగా రెండు రోజులు ఒకే మాస్క్ ధరించవద్దు.