Dragon Fruit : ఆరోగ్యానికి డ్రాగన్ ఫ్రూట్.. ఇంట్లోనే పెంచండిలా…

డ్రముల్లో ఎర్రమట్టి, కొబ్బరి పీచు, కంపోస్ట్ ను, ఇసుకను కలుపుకుని వాటిలో నింపుకోవాలి. డ్రాగన్ ఫ్రూట్ లో ఉండే విత్తనాలను కాని, లేకుంటే మొక్కను కానీ నాటుకోవాలి. రోజు కొద్దిగా

Dragon Fruit : ఆరోగ్యానికి డ్రాగన్ ఫ్రూట్.. ఇంట్లోనే పెంచండిలా…

Dragon Fruit

Dragon Fruit : ఇటీవలికాలంలో మార్కెట్లో డ్రాగ‌న్ ఫ్రూట్‌ పండ్లు విరివిగా లభిస్తున్నాయి. చైనా ఫ్రూట్ గా పిలవబడుతున్న ఈ పండును తినటం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. డ్రాగ‌న్ ఫ్రూట్‌లో విట‌మిన్ సి, విట‌మిన్ బి, ఐర‌న్‌, ఫాస్ప‌ర‌స్‌, కాల్షియంతో పాటు అనేక పోష‌క విలువ‌లు నిక్షిప్తమై ఉన్నాయి. శరీరంలో హిమోగ్లోబిన్ శాతం పెరగడానికి ఈ ఫ్రూట్ ఉపకరిస్తుంది. అలాగే, సీ విటమిన్ కూడా పుష్కలంగా లభించడంతో రోగనిరోధకశక్తి బాగా పెరుగుతుంది. ఇటీవలి కాలంలో తెలుగు రాష్ట్రాల్లో అనేక మంది రైతులు డ్రాగన్ ఫ్రూట్ సాగుకు శ్రీకారం చుడుతున్నారు. మార్కెట్లో వీటికి మంచి డిమాండ్ ఉండటంతో అదాయం బాగా లభిస్తుంది.

అయితే మీ ఇంటే వద్దే డ్రాగన్ చెట్లు పెంచుకుని ఏంచక్కా డ్రాగన్ ఫ్రూట్లను కాయించవచ్చు. దీనికి పెద్దగా శ్రమ పడాల్సిన పనికూడా లేదు. చేయాల్సిందల్లా రెండు చిన్న సైజులో ఉండే డ్రమ్ములను తీసుకోవాలి. మొక్క‌ల‌ను పెంచుకునేందుకు ఉప‌యోగించే డ్ర‌మ్ము క‌నీసం 15 నుంచి 24 ఇంచుల వెడ‌ల్పు ఉండాలి. 10 నుంచి 12 ఇంచుల లోతు ఉండాలి. ఈ డ్ర‌మ్ముల‌కు క‌నీసం మూడు నుంచి నాలుగు రంధ్రాల‌ను చేయాలి.

డ్రముల్లో ఎర్రమట్టి, కొబ్బరి పీచు, కంపోస్ట్ ను, ఇసుకను కలుపుకుని వాటిలో నింపుకోవాలి. డ్రాగన్ ఫ్రూట్ లో ఉండే విత్తనాలను కాని, లేకుంటే మొక్కను కానీ నాటుకోవాలి. రోజు కొద్దిగా వాటర్ పోస్తూ ఉడటంతోపాటు, సూర్యరశ్మి, గాలి వెలుతూరు సోకే భవనాలపై భాగంలో ఉంచితే మొక్కగా బాగా పెరిగేందుకు అవకాశం ఉంటుంది. నీటిని తగినంత మోతాదులో మాత్రమే అందించాలి. అధికంగా నీరు పోయటం వల్ల మొక్కలు దెబ్బతినే అవకాశం ఉంటుంది.

చీడ‌పీడ‌ల నుంచి కాపాడేందుకు సేంద్రియ ఎరువుల‌ను ఉప‌యోగించొచ్చు. మొక్క నాటిన త‌ర్వాత 9 నుంచి 12 నెలల లోపు కాపు వ‌స్తుంది. పువ్వులు పూసే దశలో వాటికి ఫలదీకరణం చేయటం తప్పనిసరి. ఆడ పుష్పం యొక్క పుప్పొడిని మ‌గ పుష్పంపై చ‌ల్లడంతో అది ఫ‌ల‌దీక‌ర‌ణం చెంది ఫ‌లం రూపాంత‌రం చెందుతుంది. ఆడ పుష్పం పెద్ద‌దిగా ఉండి, బాగా విక‌సించి ఉంటుంది. మ‌గ పుష్పం కొంచెం చిన్న‌దిగా కనిపిస్తుంది. మొక్కకు సపోర్టుగా కర్రనుగాని, ఇనుపకడ్డీని కాని ఏర్పాటు చేసుకోవాలి. ఇలా చేస్తే ఏడాది కాలంలోనే ఇంటి వద్దే డ్రాగన్ ఫ్రూట్ ను మీరే స్వయంగా పండించుకుని తినవచ్చు. ఇంటి పరిసరాల్లో కొద్ది పాటి స్ధలం ఉన్నవారు సైతం ఈ డ్రాగన్ ఫ్రూట్ మొక్కను పెంచుకోవచ్చు.