Dragon Fruit : కొలెస్ట్రాల్ ను నియంత్రణలో ఉంచి గుండెకు మేలు చేసే డ్రాగన్ ఫ్రూట్!

డ్రాగన్ ఫ్రూట్‌లో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. వీటితో పాటు ఫ్లేవనాయిడ్స్, ఫినోలిక్ యాసిడ్, ఆస్కార్బిక్ యాసిడ్,‌ ఫైబర్ మెండుగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతాయి. ఇన్సులిన్‌ రెస్టిసెన్స్‌ను పెంచుతుంది.

Dragon Fruit : కొలెస్ట్రాల్ ను నియంత్రణలో ఉంచి గుండెకు మేలు చేసే డ్రాగన్ ఫ్రూట్!

Dragon fruit keeps cholesterol

Dragon Fruit : డ్రాగన్‌ ఫ్రూట్‌ దీనిలోని పోషక విలువల కారణంగా చాలా మంది ఈ పండు తినడానికి ఇష్టపడతారు. డ్రాగన్ ఫ్రూట్ లో కేలరీలు తక్కువగా, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. పీచు పదార్థం కూడా అధికంగానే ఉంటుంది. ఐరన్, ప్రొటీన్లు, పిండిపదార్థాలు, మెగ్నీషియం, విటమిన్ సి, విటమిన్ ఇ, కెరోటినాయిడ్లు, పాలీఫెనాల్స్ తదితర విలువైన పోషకాలు లభిస్తాయి. డ్రాగన్ ఫ్రూట్ ఖరీదు కొంచెం ఎక్కువే అయినా దానికి తగ్గట్లే శరీరానికి శక్తినిచ్చే న్యూట్రియెంట్స్ లభిస్తాయి. డ్రాగన్‌ ఫూట్‌ పోషకాల స్టోర్‌ హౌస్‌ అని చెప్పాలి. ఇందులో మీ శరీరానికి శక్తినిచ్చే ఫైబర్‌, ప్రొటీన్లు అధికంగా ఉన్నాయి. మెగ్నీషియం, కాల్షియం, ఐరన్‌, ఫాస్ఫరస్‌ వంటి మినరల్స్‌ మెండుగా ఉంటాయి. విటమిన్‌ సి అధికంగా ఉంటుంది. దీంతో పాటు బి1, బి2, బి3 విటమిన్లూ ఉంటాయి. తరచూ మన డైట్‌లో డ్రాగన్‌ ఫ్రూట్‌ చేర్చుకుంటే.. అనేక ఆరోగ్య సమస్యలు దూరమవుతాయని నిపుణులు చెబుతున్నారు

డ్రాగన్ ఫ్రూట్‌లో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. వీటితో పాటు ఫ్లేవనాయిడ్స్, ఫినోలిక్ యాసిడ్, ఆస్కార్బిక్ యాసిడ్,‌ ఫైబర్ మెండుగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతాయి. ఇన్సులిన్‌ రెస్టిసెన్స్‌ను పెంచుతుంది. డయాబెటిస్‌ లేని వారు, డ్రాగన్‌ ఫ్రూట్‌ తింటే షుగర్‌ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. డ్రాగన్‌ ఫ్రూట్‌ తినటం వల్ల గుండె ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. కొలెస్ట్రాల్‌ ట్రైగ్లిజరైడ్, చెడు కొలెస్ట్రాల్‌, లిపోప్రొటీన్ కొలెస్ట్రాల్ తగ్గుతాయి. డ్రాగన్‌ ఫ్రూట్‌ గుండెను సురక్షితంగా, ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. డ్రాగన్‌ ఫ్రూట్‌ విత్తనాలలో ఒమేగా -3, ఒమేగా -9 ఫ్యాటీ యాసిడ్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఇవి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. హెచ్‌డీఎల్‌ గుండె ఆరోగ్యానికి మంచిది.

ఒక కప్పు డ్రాగన్ ఫ్రూట్ గుజ్జు నుంచి సుమారు 136 కేలరీలు అందుతాయి. అలాగే 29 శాతం పిండిపదార్థం, 3 గ్రా మాంసకృత్తులు, 7 గ్రా పీచు, 8 శాతం ఇనుము ఉంటాయి. ఇది జీరో ఫ్యాట్ ను కలిగి ఉంటుంది. డ్రాగన్ ఫ్రూట్‌లో యాంటిట్యూమర్, యాంటీఆక్సిడెంట్‌, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి మహిళలను రొమ్ము క్యాన్సర్‌ నుంచి రక్షిస్తాయి. క్యాన్సర్‌ పేషెంట్స్‌ డ్రాగన్‌ ఫ్రూట్‌ తింటే, వారికి కొంత ఉపశమనం కలిగిస్తుంది. ఆర్థరైటిస్ నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి సహాయపడుతుంది. డ్రాగన్ ఫ్రూట్‌లో ఉండే విటమిన్ సి, కెరోటినాయిడ్లు మీ రోగనిరోధక శక్తిని పెంచుతాయి. దీని వల్ల తెల్ల రక్తకణాలు దెబ్బతినకుండా ఉంటాయి. మెదడు పనితీరు మెరుగుపడుతుంది. అల్జీమర్స్, పార్కిన్సన్స్, మూర్ఛ వంటి ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.