DRDO 2DG Covid Powder: కరోనాను అంతం చేసే డీఆర్‌డీఓ 2డీజీ డ్రగ్ వచ్చేసింది..

కరోనాను అంతం చేసే డీఆర్‌డీఓ 2డీజీ డ్రగ్ వచ్చేసింది.. భారత రక్షణ సంస్థ DRDO అభివృద్ధి చేసిన 2DG (2-డియాక్సీ డి-గ్లూకోజ్‌) అందుబాటులోకి వచ్చింది. ఈ ఔషధాన్ని సోమవారం ఢిల్లీలో కేంద్ర రక్షణ, ఆరోగ్యశాఖ మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, హర్షవర్ధన్‌ తొలి బ్యాచ్‌ 2డీజీ సాచెట్లను రిలీజ్ చేశారు.

DRDO 2DG Covid Powder: కరోనాను అంతం చేసే డీఆర్‌డీఓ 2డీజీ డ్రగ్ వచ్చేసింది..

Drdo 2dg Covid 19 Medicine

DRDO 2DG Covid Powder: కరోనాను అంతం చేసే డీఆర్‌డీఓ 2డీజీ డ్రగ్ వచ్చేసింది.. భారత రక్షణ సంస్థ DRDO అభివృద్ధి చేసిన 2DG (2-డియాక్సీ డి-గ్లూకోజ్‌) అందుబాటులోకి వచ్చింది. ఈ ఔషధాన్ని సోమవారం ఢిల్లీలో కేంద్ర రక్షణ, ఆరోగ్యశాఖ మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, హర్షవర్ధన్‌ తొలి బ్యాచ్‌ 2డీజీ సాచెట్లను రిలీజ్ చేశారు. మొదట రక్షణ మంత్రి డ్రగ్‌ను విడుదల చేసి ఆరోగ్యశాఖ మంత్రికి అందజేశారు. ఆ తర్వాత కరోనా యాంటీ డ్రగ్స్‌ను ఢిల్లీ ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రణదీప్‌ గులేరియాకు అందజేశారు.

పదివేల డోసులను ఢిల్లీలోని పలు ఆస్పత్రులకు పంపిణీ చేయనున్నారు. పొడి రూపంలో ఈ ఔషదం అందుబాటులోకి వచ్చింది. ఈ డ్రగ్ పౌడర్‌ను నీటితో కలిపి తీసుకోవాల్సి ఉంటుంది. వైరస్ ఉన్న కణాల్లోకి చేరడం ద్వారా వైరస్ వృద్ధిని అడ్డుకుంటుందని డీఆర్‌డీఓ పేర్కొంది. కరోనాకు ఇప్పటి వరకు వ్యాక్సిన్లే రాగా.. పౌడర్ డ్రగ్ కూడా అందుబాటులోకి వచ్చేసింది. 2డీజీ ఔషధంతో కొవిడ్‌ రికవరీ సమయం తగ్గుతుందని తెలిపింది. ఆక్సిజన్‌ అవసరం తగ్గిపోతుందని పేర్కొంది. తొలి విడతలో 10వేల సాచెట్లను అందుబాటులోకి తెచ్చారు. మే 27, 28 తేదీల్లో రెండో విడతలో భాగంగా మరిన్ని సాచెట్లను విడుదల చేయనున్నారు.

జూన్‌ నాటికి పూర్తి స్థాయిలో మార్కెట్లోకి ఈ డ్రగ్ పౌడర్ అందుబాటులోకి ఉంటుందని డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ వెల్లడించింది. ఈ 2డీజీ డ్రగ్ పౌడర్ ధరను డీఆర్‌డీవో ఇంకా ప్రకటించలేదు. కరోనా కట్టడి కోసం డీఆర్‌డీవో ఏడాది వ్యవధిలో ఈ ఔషధాన్ని తయారుచేసింది. గతంలో ఈ డ్రగ్ క్యాన్సర్‌ కోసం తయారుచేశారు. శరీరంలో క్యాన్సర్‌ కణాలకు గ్లూకోజ్‌ అందకుండా ఈ మందు అడ్డుకుంటుంది. శరీరంలోకి ప్రవేశించిన కొవిడ్‌ వైరస్‌ కణాలకు గ్లూకోజ్‌ అందకపోతే కణ విభజన జరగదు. దాంతో శరీరంలో కరోనా వ్యాప్తి జరగదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.