Dreams In Sleep : నిద్రలో కలలు వస్తున్నాయా! అసలు కారణం ఏంటంటే?
మన జీవితంలో ఏం జరగాలి, ఏం జరగకూడదని బలంగా కోరుకుంటామో, అవే కలలు కనటం ద్వారా అనుభూతి చెందుతాం. చిన్ననాటి జ్ఞాపకాలు కూడా, వారి కలలపై ప్రభావం చూపుతాయి.

Dreams In Sleep : కలలు రావటమనేది సహజం. అయితే ఇందులో కొన్ని కలలు మనకు గుర్తు ఉంటాయి. కొన్ని మనకు గుర్తు ఉండవు. కొన్ని కలలు సగంలో ఆగిపోతాయి. కొన్ని సార్లు కలలు ఎంత మధురంగా ఉంటాయో, మరికొన్ని సార్లు అంతే భయంకరంగా ఉంటాయి. కలలనేవీ కేవలం మెదడుకి సంబంధించినవని కొంతమంది చెబితే, ఆత్మకు సంబంధించినవని మరికొందరు చెబుతారు. సైన్స్ చెబుతున్న దాని ప్రకారం కలలుసాధారణంగా మనం నిద్రిస్తున్న సమయంలో, శరీరం రెండు దశల్లోకి వెళుతుంది. మొదటిది, ర్యాపిడ్ ఐ మూవ్ మెంట్ దశ. ఈ దశలో శరీరంలోని అవయవాలు విశ్రాంతి తీసుకుంటున్నా, మెదడులోని ఆలోచనలు మాత్రం జరుగుతూనే ఉంటాయి. రెండోది నాన్ ర్యాపిడ్ ఐ మూవ్ మెంట్. ఈ దశలో మెదడులోని ఆలోచనలు పూర్తిగా స్తంభిస్తాయి.
కలలు ర్యాపిడ్ మూవ్ మెంట్ దశలో మాత్రమే వస్తాయి. గాఢ నిద్రలో ఉన్నప్పుడు కూడా కొన్ని సార్లు కలలు వస్తాయి, కానీ అవి మేల్కొనే సమయానికి గుర్తుండవు. ఒక సగటు మనిషికి, నిద్రలో సుమారు ఆరు కలల వరకూ వస్తాయి. ఒక వ్యక్తి భావోద్వేగాలకు అనుకూలంగానే, వారికి కలలు రావడం జరుగుతుందని పరిశోధకులు చెబుతారు. ఒక్కొక్కసారి మనం ఎప్పుడో ఒకసారి చూసిన మనుషులు కూడా కలలోకి వస్తూ ఉంటారు. కొన్ని సార్లు మనకు పీడ కలలు వస్తే, కొన్నిసార్లు మంచి కలలు వస్తాయి.
మన జీవితంలో ఏం జరగాలి, ఏం జరగకూడదని బలంగా కోరుకుంటామో, అవే కలలు కనటం ద్వారా అనుభూతి చెందుతాం. చిన్ననాటి జ్ఞాపకాలు కూడా, వారి కలలపై ప్రభావం చూపుతాయి. మనిషి తన రోజు వారి దినచర్యలో ఎదుర్కొన్న సంఘటనలు, ఎక్కువగా ఆలోచించిన ఆలోచనలు కలల రూపంలో వస్తాయి. కొంత మంది కలల ద్వారా భవిష్యత్తు చూడగలుగుతారు. ఒక మనిషి సున్నిత మనస్కులు అయితే, లేదా ప్రతి చిన్న విషయానికి భయపడేవారు అయితే వారికి పీడకలలు, లేదా భయంకరమైన కలలు ఎక్కువగా వస్తూ ఉంటాయి.
కలలు మన భవిషత్తులో రాబోయే ఆపదలను ముందుగానే మనకి చూపిస్తాయని, అవి చూపించినట్లే మన జీవితం కూడా ఉంటుందని చాలా మంది నమ్మతుంటారు. భవిష్యత్తు గురించి అంచనా వేసుకునే వారు అయితే జరగబోయే వాటిని ముందు కలలో చూడగలుగుతారు. యోగ శాస్త్రం ప్రకారం కలలు అనేవి మనిషి శరీరంలో చక్రాలపై ఆధారపడి ఉంటాయి. ఎక్కువగా భయపెట్టే విషయాలు నిరంతరం మెదడుని ఒత్తిడికి గురి చేసి, నిద్రలో పీడకలలని సృష్టించేలా చేస్తాయి..
1RBI On Cryptocurrencies : ముప్పు తప్పదు.. క్రిప్టో కరెన్సీపై ఆర్బీఐ గవర్నర్ వార్నింగ్
2Mumbai: ఫోన్ పక్కకుపెట్టి జాబ్ వెదుక్కోమని చెప్పిందని వదిన హత్య
3Telangana Corona Cases : తెలంగాణలో కరోనా కల్లోలం.. కొత్తగా ఎన్ని కేసులంటే
4Pat Cummins Sixer : ఇదేందయ్యా ఇది.. ఏడా సూడలే.. భారీ సిక్సర్ బాదిన ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్
5Sandwich Shot Dead : బాబోయ్.. శాండ్ విచ్లో క్రీమ్ ఎక్కువగా ఉందని కాల్చి చంపేశాడు
6Pooja Hegde: పూజా కొంటె అందాలు చూడతరమా..?
7Indian Railways: రైల్లో కప్పు కాఫీకి రూ.70 చెల్లించిన ప్రయాణికుడు
8The Warrior: వారియర్ కోసం మాస్ డైరెక్టర్, క్లాస్ హీరో!
9BSNL Prepaid Plans : జూలై 1 నుంచి BSNL కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు.. బెనిఫిట్స్ ఇవే..
10Amarnath Yatra Begins : హరోం హర.. మూడేళ్ల తర్వాత మళ్లీ అమర్నాథ్ యాత్ర ప్రారంభం.. 80వేల మంది సైనికులతో భారీ భద్రత
-
Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట మరో ఫీట్.. ఏకంగా 50!
-
Anthrax : కేరళలో ఆంత్రాక్స్ కలకలం.. అడవి పందుల్లో వ్యాప్తి.. లక్షణాలు ఇవే!
-
Moto G62 : మోటరోలా నుంచి కొత్త ఫ్లాగ్షిప్ 5G ఫోన్.. ఇండియాలో లాంచ్ ఎప్పుడంటే?
-
NTR: ఎన్టీఆర్ స్టార్ట్ చేశాడు.. ఇక దూకుడు షురూ!
-
iOS16 Beta Update : iOS 16 beta అప్డేట్తో సమస్యలా.. iOS 15కు మారిపోండిలా..!
-
Ramarao On Duty: రామారావు కోసం మసాలా ‘సీసా’.. మామూలుగా లేదుగా!
-
Dasara: ‘దసరా’ ఉందంటూ బ్రహ్మీ మీమ్‌తో డైరెక్టర్ గట్టిగానే ఇచ్చాడుగా!
-
Flagship Smartphones : 2022లో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లు ఇవే..!