health tips for summer : వేసవిలో విటమిన్లు సమృద్ధిగా ఉండాలంటే ఇలా చేయాలి

health tips for summer : వేసవి కాలం ప్రారంభమైంది. అదే సమయంలో, కరోనా సెకండ్ వేవ్ రెట్టింపు వేగంతో ప్రజలకు సోకుతోంది. వేడిలో దాహం తీర్చడానికి ఫ్రిజ్ నుండి చల్లటి నీరు త్రాగితేనే సరిపోదట.. బదులుగా,

health tips for summer : వేసవిలో విటమిన్లు సమృద్ధిగా ఉండాలంటే ఇలా చేయాలి

Health Tips For Summer

health tips for summer : వేసవి కాలం ప్రారంభమైంది. అదే సమయంలో, కరోనా సెకండ్ వేవ్ రెట్టింపు వేగంతో ప్రజలకు సోకుతోంది. వేడిలో దాహం తీర్చడానికి ఫ్రిజ్ నుండి చల్లటి నీరు త్రాగితేనే సరిపోదట.. బదులుగా, విటమిన్స్ ఎక్కువగా లభించే కొన్ని ప్రత్యేక పానీయాలు కూడా త్రాగాలని డైటీషియన్ డాక్టర్ రష్మి శ్రీవాస్తవ వెబ్‌ఇనార్‌ చెప్పారు.. ఈ సందర్బంగా విటమిన్స్ ఎక్కువగా లభించడం తోపాటు రోగనిరోధక శక్తిని పెంచే మూడు ప్రత్యేక పానీయాల గురించి వెల్లడించారు.

కుకుంబర్-బచ్చలికూర రసం
దోసకాయ, అరటి, అల్లం, బచ్చలికూరలను 10 నిమిషాలపాటు శ్రమించి రసంగా మార్చాలి, ఆ తరువాత నిమ్మరసం, రాక్ సాల్ట్ కలుపుకొని తాగాలి.. దాంతో ఈ పానీయంలో, విటమిన్ ఎ, కె, సి, మెగ్నీషియం, కాల్షియం, రాగి మరియు పొటాషియం లభిస్తాయి.

పుచ్చకాయ పుదీనా స్మూతీ
రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి అవిసె గింజలు, గుమ్మడికాయ గింజలతో పాటు పుచ్చకాయ, పుదీనా ఆకులను ముక్కలు చేసి రుబ్బుకోవాలి. పది నిమిషాల తరువాత ఈ డ్రింక్ ను తాగినట్టయితే.. మానవశరీరంలో జింక్ , ఒమేగా -3 ని గణనీయంగా పెంచుతుంది.

డ్రై ఫ్రూట్ స్మూతీ
జీడిపప్పు, బాదం, అత్తి పండ్లను 30 నిమిషాలపాటు నానబెట్టి రుబ్బుకోవాలి.. ఆ తరువాత నునుపైన పేస్ట్ తయారు చేసుకున్న తరువాత.. తీపి కోసం కొద్దిగా తేనెని జోడించాలి.. ఈ మొత్తం పేస్ట్‌ను 2 కప్పుల పాలతో కలిపి తాగినట్టయితే.. శరీరంలోని విటమిన్ ఎ, బి, సి అవసరాలను తీరుస్తుంది.