Lose Weight : నీళ్లు తాగండి, బరువు తగ్గండి! |Drink water, lose weight!

Lose Weight : నీళ్లు తాగండి, బరువు తగ్గండి!

సమయానికి ఆహారం తీసుకుంటూనే మధ్యమధ్యలో ఆకలి అనిపిస్తుంటే మాత్రమే నీరు ఎక్కువ మొత్తంలో తీసుకోవాలి. ఇలా చేయటం వల్ల తినే ఆహారం అతిగా తినకుండా తక్కువ మోతాదులో తినేందుకు అవకాశం ఉంటుంది.

Lose Weight : నీళ్లు తాగండి, బరువు తగ్గండి!

Lose Weight : మారిన అలవాట్లు, జీవన శైలి కారణంగా ఇటీవలి కాలంలో అందరని వేధిస్తున్న సమస్య అధిక బరువు. బరువును తగ్గించుకునేందుకు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. వాకింగ్, రన్నింగ్, స్విమ్మింగ్ లాంటి వాటిని చేస్తున్నప్పటికీ బరువు తగ్గుదలలో ఏమాత్రం మార్పు కనిపించదు. అయితే రోజు తాగే నీటితోనే బరువును సులభంగా తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. శరీరానికి నీరు ఎంతో అవసరం. శరీరం నుండి వ్యర్ధాలను బయటకు పంపటంలో, కొవ్వుని కరిగించి శరీరాన్ని తేలికగా మార్చటంలో నీరు సహాయపడుతుంది. నీటిలో ఎలాంటి కేలరీలు ఉండవు.

ఉదయం నిద్రలేవగానే దినచర్యను నీటితోనే ప్రారంభించటం మంచిది. నిద్రలేవగానే అరలీటరు నీరు తాగటం అలవాటుగా మార్చుకోండి. కొంతమంది బరువు తగ్గాలన్న ప్రయత్నంలో ఉదయం అల్పాహారాన్ని మానేస్తుంటారు. ఆకలిని తట్టుకోలేక ఎదో ఒక చిరుతిండి తింటుంటారు. మధ్యాహ్నం భోజనం చేయకపోవటం, ఇలా చేయటం వల్ల బరువు తగ్గకపోను బరువు పెరగటంతోపాటు ఇతరత్రా ఆరోగ్య సమస్యలను కొనితెచ్చుకోవాల్సి వస్తుంది. ఏదైనా తినాలని అనిపించిన సమయంలో ఎక్కువ మొత్తంలో నీరు తాగండి.

సమయానికి ఆహారం తీసుకుంటూనే మధ్యమధ్యలో ఆకలి అనిపిస్తుంటే మాత్రమే నీరు ఎక్కువ మొత్తంలో తీసుకోవాలి. ఇలా చేయటం వల్ల తినే ఆహారం అతిగా తినకుండా తక్కువ మోతాదులో తినేందుకు అవకాశం ఉంటుంది. నీరు తాగమన్నారని చల్లగా ఉండే కూల్ వాటర్ జోలికి మాత్రం వెళ్లకండి. గోరు వెచ్చని నీటిని తాగటం అలవాటుగా మార్చుకోండి. కొవ్వును కరిగించటంలో గోరు వెచ్చని నీరు సహాయపడుతుంది. భోజనం చేసే సమయంలో, చేసిన తరువాత నీటిని తాగటం వల్ల అజీర్తి, గ్యాస్ వంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయి. భోజనం చేయకముందే నీరు తాగటం మంచిది. దీని వల్ల అతిగా తినకుండా చూసుకోవచ్చు.

పదేపదే నీరు తాగటం కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది. అయితే నీటికి కాస్త రుచిని జోడిస్తే ఎక్కువ మోతాదులో వాటిని తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇందుకోసం నీటిలో అల్లం, తేనె, నిమ్మరసం, సబ్జా గింజలు, పండ్ల ముక్కలు వేసుకుని తాగటం వల్ల శరీరానికి మంచి పోషకాలు అందుతాయి. రోజుకు పావు లీటరు నుంచి ముప్పావు లీటరు నీరు తాగినవారు 68-205 కేలరీలు తక్కువగా తీసుకుంటారని పరిశోధనలో తేలింది. అదనంగా తీసుకునే నీటితో కడుపు నిండిన భావన కలుగుతుంది.

అయితే నీరు తాగే విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అతిగా నీరు తాగితే శరీరంలో సోడియం స్థాయిలు తగ్గుతాయి. శరీరంలో సోడియం తక్కువగా ఉండటం.. ప్రాణాంతకం కావచ్చు. దీనిని దృష్టిలో ఉంచుకుని మీ శరీరానికి సరిపడా నీళ్లు తాగడం మంచిది.

 

×