Alcohol : చలికాలంలో వెచ్చదనం కోసం మద్యం తాగుతున్నారా…అయితే ఒక్క క్షణం?

చలిలో విపరీతమైన మద్యసేవనం ప్రాణాంతకం అని ఓహియో వర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు. మద్యం జోలికి మాత్రం వెళ్లొద్దంటూ హెచ్చకలు జారీ చేస్తున్నారు.

Alcohol : చలికాలంలో వెచ్చదనం కోసం మద్యం తాగుతున్నారా…అయితే ఒక్క క్షణం?

Alcohol

Alcohol : చలి నుండి రక్షణ కోసం చాలామంది వేడివేడి పదార్ధాలను తినడానికి ఇష్టపడుతుంటారు. దీనివల్ల శరీరంలో కాస్త వేడి ప్రభావం ఉంటుందని ఎప్పటికప్పుడు వేడి వేడి పదార్థాలు తింటుంటారు. దీంతో చలి నుండి కాస్త ఉపశమనం కలుగుతుంది. ఇక కొందరు ఆరుబయట మంటలతో చలి నుండి ఉపశమనం పొందుతారు. వీటి ద్వారా ఎటువంటి ప్రమాదం ఉండదు. అయితే చలి బాగా పెడితే బాడీలో వేడి పుట్టించడానికి కొంత మంది మద్యం తాగుతారు. కానీ ఇలా మద్యం తాగడం వల్ల చలిని తట్టుకోవడం అనేది ఒట్టి భ్రమ అని నిపుణులు చెబుతున్నారు. చలిని తట్టుకునేలా ఒళ్లు వెచ్చబడాలంటే మద్యం సేవించాలన్నది నూటికి నూరు శాతం అబద్దపు ప్రచారం అని కొట్టిపడేస్తున్నారు.

కానీ కొందరు మాత్రం ఈ చలికాలం సమయంలో మద్యం సేవించడానికి బాగా ఇష్టపడుతుంటారు. కారణం ఈ సమయంలో మద్యం ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరానికి కాస్త వేడి తగులుతుందని అనుకుంటారు. కానీ ఇందులో ఎంతవరకు నిజం లేదు. మద్యం సేవిస్తున్నంతసేపు శరీరం బాగా వెచ్చబడి ఉంటుంది. కానీ కొద్ది సమయం తర్వాత శరీరం పూర్తిగా చల్లబడుతుంది. దాంతో ఆల్కహాల్ చలిని తట్టుకునే శక్తిని కోల్పోతుంది.

దీనివల్ల శరీరానికి బాగా వణుకు పుట్టడం వంటివి జరగటంతో కొన్ని సందర్భాలలో గుండె పనితీరు కూడా ఆగిపోతుందని తాజా అధ్యయనంలో తేలింది. కాబట్టి చలికాలంలో మద్యం సేవించే వాళ్ళు ఎక్కువగా తీసుకోకుండా సరైన మోతాదులో తీసుకోవడం మంచిదని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. మరికొందరు ఈ సమయంలో పొగ తాగుతూ ఉంటారు. దీనివల్ల కూడా శరీరానికి వేడి కలుగుతుందని అనుకుంటారు. కానీ ఇది కూడా శరీరానికి చాలా డేంజర్ అని ముఖ్యంగా చలికాలంలో దీని ప్రభావం మరింత ప్రమాదకరంగా ఉంటుందని తెలుపుతున్నారు.

చలికాలంలో మద్యం తాగడం వలన శరీరం చల్లగా మారుతుంది. దీంతో ఇతర అనారోగ్య సమస్యలు మరింత పెరుగుతాయి. ఆల్కహాల్ శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. ఒకవేళ శరీరంలోకి చేరకపోతే.. శరీర ద్రవం తగ్గుతుంది. దీంతో డీహైడ్రేషన్ సమస్య పెరుగుతుంది. చలికాలంలో శరీరంలో నుంచి చెమటగానీ, నీరు గానీ బయటకు రాదు. అందుకే ఎక్కువ నీరు తాగాల్సిన అవసరం లేదనుకుంటారు. చలికాలంలో గాలి చాలా పొడిగా ఉంటుంది. దీంతో గాలి నుంచి తేమ శరీరానికి చేరదు. చలిలో మద్యం సేవిస్తే శరీర ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోయి ఆరోగ్యానికి తీరని నష్టం కలుగుతుంది.

చలిలో విపరీతమైన మద్యసేవనం ప్రాణాంతకం అని ఓహియో వర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు. మద్యం జోలికి మాత్రం వెళ్లొద్దంటూ హెచ్చకలు జారీ చేస్తున్నారు. వోడ్కా, విస్కీ, జిన్, వంటి మద్యాన్ని చలిలో తాగితే, ఈ పానీయాలు వెచ్చగా ఉండటానికి ఏమాత్రం సహాయపడవు. వీటివల్ల గొంతు నొప్పి లేదా తీవ్రమైన జలుబును చవిచూడాల్సి వస్తుంది. తీవ్రమైన చలిలో ఎక్కువసేపు నిలబడవలసి వస్తే, మద్యం తాగటంవల్ల శరీరం వేడెక్కి కొన్నిసార్లు ప్రాణాంతకంగా మారే అవకాశాలు ఉంటాయి.

శరీరం వేడెక్కటానికి, వెచ్చని గదిలో కూర్చుని మద్యం త్రాగవచ్చు, ఇది రక్త నాళాలను విస్తరిస్తుంది, రక్త ప్రవాహాన్ని పెంచుతుంది, కానీ గది ఉష్ణోగ్రత వద్ద అధిక ఉష్ణం వల్ల ఏమాత్రం నష్టం ఉండదు. అలా కాకుండా బయటి చలివాతావరణంలో కూర్చుని మద్యం సేవించే ప్రయత్నం ఏమంత మంచిది కాదు. గదిలో మద్యం సేవించిన తరువాత చలిలో తిరిగే ప్రయత్నం మాత్రం చేయటం ఏమంత శ్రేయస్కరం కాదని నిపుణులు చెబుతున్నారు.