Soft Drinks : వేసవి తాపం తీర్చుకునేందుకు శీతలపానీయాలు తాగేస్తున్నారా!

కూల్ డ్రింక్ లో 10 చెంచాలకు సరిపడా షుగర్ ను కలుపుతారు. ఇంత మోతాదులో చక్కెర తీసుకుంటే వాంతులు అయ్యే ప్రమాదం ఉంటుంది. అయితే వాంతులు కాకుండా కూల్ డ్రింక్స్ లో ఫాస్పోరిక్ ఆమ్లం కలుపుతారు.

Soft Drinks : వేసవి తాపం తీర్చుకునేందుకు శీతలపానీయాలు తాగేస్తున్నారా!

Drinking Soft Drinks

Soft Drinks : వేసవి కాలంలో చాలా మంది ఎండవేడిని తట్టుకునేందుకు శీతలపానీయాలను డబ్బులకొద్దీ తాగేస్తుంటారు. ప్రస్తుతం మార్కెట్లో కూల్ డ్రింక్స్ వ్యాపారం జోరుగా సాగుతుంది. అయితే ఈ కూల్ డ్రింక్స్ ను తాగటం వల్ల శరీరానికి పోషకాలు అందకపోను అనేక దుష్ప్రభావాలు కలుగుతాయి. శీతల పానీయాల్లో ఉండే ప్రమాదకరమైన రసాయనాలు ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి. తియ్యగా, కూల్ గా, రుచిగా ఉండే ఈ శీతలపానీయాలు శరీరంలో ప్రవేశిస్తే అన్నిభాగాలపై దీర్ఘకాలంలో అనారోగ్యాన్ని కలిగిస్తాయి. కూల్ డ్రింక్స్ లో ఉండే రసాయనాలు వాటి వల్ల శరీరానికి కలిగే దుష్ప్రభావాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

కూల్ డ్రింక్ లో 10 చెంచాలకు సరిపడా షుగర్ ను కలుపుతారు. ఇంత మోతాదులో చక్కెర తీసుకుంటే వాంతులు అయ్యే ప్రమాదం ఉంటుంది. అయితే వాంతులు కాకుండా కూల్ డ్రింక్స్ లో ఫాస్పోరిక్ ఆమ్లం కలుపుతారు. దీని వల్ల ఎముకలు, దంతాల మూలాలు బలహీనంగా మారతాయి. కూల్ డ్రింక్స్ లో రుచికోసం వాడే క్యారమెల్ రంగు రుచిని అందించకపోగా క్యాన్సర్ కు కారణమౌతుంది. ఫార్మల్ డిహైడ్ ఇది కూడా క్యాన్సర్ కారకం. శరీరంలోకి ప్రవేశించి అమీనో యాసిడ్లైన ఫార్మిక్ యాసిడ్, ఫార్మాల్ డిహైడ్ గా విడిపోతుంది. మొక్కజొన్న నుండి తీసిన అధిక ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ కూల్ డ్రింక్స్ లో కలపటం వల్ల శరీరంలో కొవ్వు, కొలెస్టరాల్, ట్రైగ్లిజరైడ్స్ ను పెంచటంతోపాటు ఆకలిని పెంచుతుంది. కూల్ డ్రింక్ ఎక్కువ రోజులు నిల్వ కోసం పొటాషియం బెంజోయేట్ ని కలుపుతారు. ఇది శరీరంలోకి చేరగానే బెంజీన్ గా విడిపోతుంది. క్యాన్సర్ కు దారితీస్తుంది. వీటిల్లో కలిపే కృత్రిమ రంగు మెదడు పనితీరును మందగించేలా చేస్తుంది. దీని వల్ల పనిపై ఏకాగ్రత తగ్గిపోతుంది.

కూల్ డ్రింక్స్ తాగటం వల్ల అనేక దుప్ఫ్రభావాలు కూడా ఉన్నాయి. కూల్ డ్రింక్స్ వల్ల మూత్ర విసర్జనతోపాటు, డీహైడ్రేషన్, అధిక దాహం వంటివి పరిస్ధితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. లివర్, గుండె సంబంధిత వ్యాధులకు దారితీసే అవకాశం ఉంటుంది. కూల్ డ్రింక్ లో ఉండే కెఫిన్ వల్ల రక్తపోటు పెరుగుతుంది. ఇది పెద్ద వయస్సు వారిలో పెద్దగా ప్రభావం చూపకపోయినా చిన్నపిల్లలకు మాత్రం హాని కలిగిస్తుంది. కూల్ డ్రింక్స్ తాగటం వల్ల షుగర్ లెవల్స్ పెరిగిపోతాయి. శరీరంలో కొవ్వు నిల్వలు పేరుకుంటాయి. కాబట్టి వేసవి కాలమే కాదు. ఏకాలంలోనైనా ఆరోగ్యానికి హాని కలిగించే కూల్ డ్రింక్స్ మాత్రం తాగొద్దు. వాటికి బదులుగా పండ్లు, పండ్ల రసాలు తీసుకోవటం హెల్త్ కు మంచిది.